deccanland

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’

కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన ‘‘కన్‍ఫెషన్స్ ఆఫ్‍ ఎ థగ్‍’’ అన్న నవలో చదవవచ్చు. వర్తకుల బిడారును లేక యాత్రికుల సమూహాన్ని ‘‘కారవాన్‍’’ అని ఉర్దూలోనూ, ఇంగ్లీష్‍లోనూ దాదాపు ఒకే అర్ధం ఉంది. …

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’ Read More »

బంగారు తీగల ‘జర్దౌసి’

జర్దౌసి అనేది ఒక రకం ఎంబ్రాయిడరీ. భారత దేశంతో పాటుగా ఇరాన్‍, అజార్‍బైజాన్‍, ఇరాక్‍, కువైత్‍, టర్కీ, సెంట్రల్‍ ఆసియా, పాకిస్థాన్‍, బంగ్లా దేశ్‍లలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. జౌర్దౌసి అనేది అందమైన మెటల్‍ ఎంబ్రాయిడరీ. ఒకప్పుడు భారతదేశంలో రాజులు, కులీన వర్గాల వారు దీన్ని ఎంతగానో ఉపయోగించేవారు. రాజులు ఉపయోగించే టెంట్లను అందంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ కళను వినియోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. కత్తి పిడి, వాల్‍ హ్యాంగింగ్స్, ఏనుగు అంబారీ, గుర్రపు స్వారీ జీను లాంటివాటిపై జర్దౌసి …

బంగారు తీగల ‘జర్దౌసి’ Read More »

టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం

యాదాద్రి-భువనగిరి జిల్లా, మండల కేంద్రం ఆలేరుకు 6కి.మీ.ల దూరంలో వున్న టంగుటూరు ప్రాచీన గ్రామం. ఇక్కడ విష్ణుకుండినుల నాణాలు దొరికాయి. నేనా గ్రామంలో టీచరుగా పనిచేసినపుడు ఒక విద్యార్థిని నాకు విష్ణు కుండినులనాటి రెండు సీసపు నాణాలనిచ్చింది. గ్రామానికి ఆగ్నేయదిశలో వున్న ఆంజనేయుని విగ్రహం ముందు 5అడుగుల ఎత్తున్న నలుపలకల తెల్లరాతి శాసనస్తంభం వుంది. ఈ శాసనం కళ్యాణీ చాళుక్యుల కాలంనాటిది :టంగుటూరు గ్రామంలో కనుగొన్న కళ్యాణీ చాళుక్యులకాలం శక సం.914 (క్రీ.శ.992)నాటి కొత్త శాసనాన్ని నేను చదివి, పరిష్కరించాను. …

టంగుటూరులో అడ్డలూరి జైన శాసనం Read More »

సామాజిక సేవనా? వాణిజ్య కార్యకలాపమా ?

(సోషల్‍ సర్వీస్‍గా మొదలైన టౌన్‍ ప్లానింగ్‍ కార్యకలాపం ట్రాన్స్ ఫరబుల్‍ డెవలప్‍ మెంట్‍ రైట్స్, ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్, ప్రీమియం ఫ్లోర్‍ స్పేస్‍ ఇండెక్స్ వంటి ఉపకరణాల వాడకం కొనసాగింపు అనేది సిటీ ప్లానింగ్‍కు మెరుగైన అర్బన్‍ రూపం క్రియేట్‍ చేయడంలో పరిమితులు విధించడం, ఈ నేపథ్యంలో ఈ ఉప కరణాల గుణగణాలను పున: సమీక్షించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనపత్రం చర్చిస్తుంది.) 1.ఉపోద్ఘాతంపారిశ్రామిక విప్లవం, ప్రజారోగ్య వ్యవస్థలకు అది కలిగించిన అవరోధాల నేపథ్యంలో టౌన్‍ ప్లా నింగ్‍ …

సామాజిక సేవనా? వాణిజ్య కార్యకలాపమా ? Read More »

ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్‍ పాఠాలు గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‍

అభివృద్ధి వైపు అడవిబిడ్డలు తరాలు మారుతున్నా… సమాజంలోని వెనుకబడిన ఎస్టీల తలరాతలు మాత్రం మారడంలేదు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా… వీరు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ట్రైబల్‍ సబ్‍ ప్లాన్‍ వంటివి గత 20 ఏళ్లుగా అమలులో ఉన్న ప్పటికీ… వారి అభివృద్ధి మాత్రం అశించిన స్థాయిలో లేదు. అందుకే దేశం అభి వృద్ధిపథం వైపు దూసుకెళుతున్నప్పటికీ… ఆదివాసీలు అలాగే ఉండి పోయారు. వీరిలో అక్షరాస్యతా శాతం కూడా చాలా తక్కువ. ఈ సామాజిక …

ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్‍ పాఠాలు గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‍ Read More »

నిరపరాధి భావన

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. వాళ్ళ అధికారానికి ఎలాంటి పరిమితులు లేవు. వాళ్ళకు తోచింది చేసే అవకాశం వుండేది. అనుమానం మీద, నేరారోపణల మీద శిక్షలు విధించేవాళ్ళు. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండా పోయింది. నిరంకుశత్వం పెరిగిపోయేది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215వ సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా, ఒక వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్ష్యాలు లేకుండా ఏ అధికారి …

నిరపరాధి భావన Read More »

సెంట్రల్ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ

న్యాయం కోసం సైన్స్! హైదరాబాద్‍లో 1967లో నెలకొల్పబడిన సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ అనేది భారతదేశంలోని ఆరు సెంట్రల్‍ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీల్లో ఒకటి. చండీగఢ్‍, కోల్‍కతా, భోపాల్‍, పుణె, గువాహతిలలో మిగిలిన ఐదు ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్స్, బాలిస్టిక్స్, నా ర్కోటిక్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్ డీఎన్‍ఏ ఎగ్జామినేషన్‍, సైబర్‍ ఫోరెన్సిక్స్ తదితరాలకు సంబంధించిన శాస్త్రీయ పరీక్ష సదుపాయాలను, ఫలితాలను, విశ్లేషణలను ఇది అం దిస్తుంది. ఫింగర్‍ ప్రింట్‍ వెరిఫికేషన్‍ లేనప్పటికీ సిగ్నేచర్‍ వెరిఫికేషన్‍ …

సెంట్రల్ ఫోరెన్సిక్‍ సైన్స్ లేబొరేటరీ Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5

ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిదిజీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, నమ్మేవారు ప్రపంచవ్యాపితంగా వున్నారు. ఇందులో చదువుకున్నవారే అధికులు కావడం గమనార్హం! వీరెవ్వరికి చార్లెస్‍ డార్విన్‍ ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం (Natural Selection) చెవికెక్కదు. పైగా విద్యాధికులు కొందరు పనిగట్టుగొని ఈ సిద్ధాంతాలకు, సైన్సుకు వ్యతిరేకంగా పనిచేయడం తెలిసిందే! మరి ఈ …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5 Read More »

తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ఫ్లోరైడ్‍ రహిత సమాజం

పరిచయం :మానవ సమాజం అభివృద్ధి చెంది ఇతర గ్రహాలకు వెళ్తున్నా అదే సమయంలో మన భూమి మీద నివసిస్తున్న మానవ సమాజాలలోని ఒక వర్గం వైకల్యాలతో బాధపడుతుంది.వైకల్యాలు రెండు రకాలు ఉంటాయి.అ) ఒకటి పుట్టుకతో వచ్చేవిఆ) తాత్కాలికంగా, కృత్రిమంగా వచ్చే వైకల్యాలు. అవి యుద్ధాల రూపంలో కావచ్చు. అగ్ని పర్వతాల రూపంలో కావచ్చు. వైకల్యాలు అనేక రూపాల్లో సంభవిస్తాయి. కాని ప్రకృతిలో ఒక మూలకం ఎక్కువ మోతాదులో భూమిలో లభించినప్పుడు వైకల్యాలు సంభవించడం జరుగుతుంది. ఫ్లోరైడ్‍ అంటే …

తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ఫ్లోరైడ్‍ రహిత సమాజం Read More »

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య

నాలుగు చెరగులా కల్ల, కపటం, ప్రచారం, కృత్రిమత్వం, వ్యాపారధోరణి డొంకదార్లు – ఇలా పరచుకుని సమాజం సాగుతున్న వేళ కొందరు పోరాట యోధుల గురించి తప్పక తెలుసుకోవాలి! అలాంటి అపురూపమైన వ్యక్తి హెచ్‍.ఎన్‍.గా ప్రఖ్యాతులయిన డా.హెచ్‍.నరసింహయ్య! పదమూడవ ఏట నుంచి ఖాదీని వదలని వ్యక్తీ, అమెరికాలో న్యూక్లియర్‍ ఫిజిక్స్లో పిహెచ్‍.డి. చేసిన వ్యక్తీ, సత్యసాయి మహిమలను పరీక్షకు నిలిపిన వ్యక్తీ, క్విట్‍ ఇండియా ఉద్యమంలో చదువు వదలి చెరసాలకేగిన వ్యక్తీ, కర్నాటక సంగీతం, సంఘసేవ, గాంధీ, వివేకానందలను అమితంగా ఇష్టపడిన …

మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య Read More »