రామప్ప ఫ్లూ జ్వరం
నక్షత్రనౌక భరణి అంతరిక్షంలో ఆవగింజలా తేలిపోతోంది. కాప్టెన్ మారుతి నౌకను నెఫ్ట్యూన్ కక్షలోంచి ఇవతలికి లాగాడు. భరణిలో దాదాపు వెయ్యిమంది సైనికులున్నారు. అత్యంత శక్తివంతమైన ఎన్నో మారణాయుధాలున్నాయి. నెప్ట్యూన్‍కి ఆవలగల ‘జంబూ’ గ్రహంలో తలెత్తిన తిరుగుబాటును అణిచివెయ్యడానికి భరణి వెడుతోంది. మారుతి పక్కనే గోడలో టీ.విలాంటి ఒక పరికరం బిగించబడి ఉంది. మారుతి సహాయకురాలు శశిరేఖ ఆ టి.విలోకి పరీక్షగా చూస్తోంది. ఉన్నట్టుండి శశిరేఖ ‘‘మారుతీ’’ అని గట్టిగా అరిచింది. మారుతి ఉలిక్కిపడ్డాడు. అయోమయంగా శశిరేఖ మొహంలోకి …









