యే షెహర్ మేరా హై! తోడ పురానా హై!
నేను, నా కల్చరల్ సిటీ హైదరాబాద్ వర్షంలో తడిసి అలా నిద్రపోయాం. రాత్రి కురిసిన వర్షం నేలకు ప్రశాంతతను బహూకరించింది. ఆరు బయట చల్లగా ఉంది. హాయినిచ్చే చల్లదనం. గరం చాయ్ ఉదయాన్ని మరింత రాగరంజితం చేస్తుంది. జస్ట్ ఇప్పుడే తెలవారింది. లేత ఉదయం, రాత్రి కురిసిన వానలో చెట్లు స్నానం చేసి, ఆకుపచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తురాయి చెట్టు అయితే మరీనూ. నా ముందు హొయలు పోతుంది. ఆటిట్యూడ్, సో మచ్ ఆటిట్యూడ్. ఎర్రగా వికటించి నా ముందు అందంగా నిలబడింది. పోనీలే …









