Author name: deccanland

ఈ చరిత్ర మనదేనని చెప్తున్న శాసనాలు

పైఠాన్‍ తవ్వకాల్లో (Exlavations at paithan – 1996-97 by ASI, SSAS) దొరికిన ముద్రమీద ‘బ్రాహ్మీలిపి’లో ‘రాజామచ మహాసేనదవుస’ అని వుంది (Godbole, 2002-03 P.11, 111)
కోటిలింగాల, కొండాపూర్‍లలో శాతవాహనుల నాణేలతో పాటు శాతవాహన పూర్వరాజుల నాణేలు, మహారథి, మహాసేన, మహా తలవరుల నాణేలు కూడా దొరికాయి. మహాసేనులు శాతవాహనుల సమకాలికులని, వాళ్ళు శాతవాహనుల …

ఈ చరిత్ర మనదేనని చెప్తున్న శాసనాలు Read More »

అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్‍ రౌతులు ‘ఎ.సి.గార్డస్’

పది ఆర్ల సంవత్సరాల క్రింద హైద్రాబాద్‍ పాతనగరంలో నివసించే ముసలివారు ‘‘కట్టెపూల్‍’’ అనేవారు తప్ప ముసల్మానుల లాగా ‘‘లక్డికాపూల్‍’’ అనేవారు కాదు. అయినా ఏం లాభం? కట్టె ఒకటే తెలుగు పదం. మళ్లీ పూల్‍ మాత్రం ఉర్దూ పదమే కద. కల్తీలేని తెలుగులో చెప్పాలంటే కట్టెతో కట్టబడిన వంతెన. అబ్బో అంత లంబాచౌడా పేరు పలికేబదులు …

అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్‍ రౌతులు ‘ఎ.సి.గార్డస్’ Read More »

మూఢనమ్మకాలపై పోరాడిన డా. వై.నాయుడమ్మ

పద్మశ్రీ డాక్టర్‍ యలవర్తి నాయుడమ్మ గురించి ఒక మాటలో పరిచయం చెయ్యాలంటే పుట్టుకతో రైతుబిడ్డ-వృత్తిరీత్యా అస్పృశ్యుడు. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు చెప్పుకునేవాడు. 1943లో కేవలం 17 రూపాయల నెలజీతంతో మదరాసులో గల తోలు పరిశోధనాసంస్థలో రసాయనశాస్త్ర విభాగంలో డిమాన్‍ స్ట్రేటర్‍ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ ఉద్యోగం లభించటంలో ఆ సంస్థలో కీలక …

మూఢనమ్మకాలపై పోరాడిన డా. వై.నాయుడమ్మ Read More »

5G స్థాయి కార్పొరేట్‍ యువ నైపుణ్యాలు

విశ్వమే కుగ్రామం అయ్యంది. అరచేతిలో వైకుంఠం చూపే చరవాణి లీలలు. శాస్త్రసాంకేతిక విప్లవం నిత్యనూతన అంతర్జాల క్రీడ అయ్యింది. 4G తరం సాంకేతికతను దాటుతూ 5G తరానికి వడివడిగా అడుగులు వేస్తోంది ఆధునిక శాస్త్రపరిజ్ఞానం. నేటి వినూత్న ఆవిష్కరణలే రేపటికి పాతవంటున్న ఘడియలు. పోటీ ప్రపంచంలో అవకాశాలు అనేకమైనప్పటికి, నిరుద్యోగం పెరుగుతున్న వైనాలు. చదువుల్లో అత్యుత్తమ …

5G స్థాయి కార్పొరేట్‍ యువ నైపుణ్యాలు Read More »

ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన్న

మధ్యయుగాల చరిత్రలో ఎందరో చారిత్రక పురుషులు, ప్రసిద్ధులున్నా, రాజులలో అతికొద్దిమంది మంత్రి, ధండనాథులు స్వల్పంగా చరిత్రలో మిగిలినారు. అలాంటి వాళ్లలో తెలంగాణ యోధుడొకడు చరిత్రలో అక్షర బద్ధం ఐనాడు. అతని పేరు ఎనుములపల్లి పెద్దన. పెద్దనామాత్యుడు తనకాశ్రితుడైన మహాకవి చరిగొండ ధర్మన్న చేత ‘చిత్రభారతం’ కృతి రాయించుకొని అంకితం పుచ్చుకొన్నాడు. ఈ కావ్య అవతారికలో ఇతని జీవితంలోని …

ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన్న Read More »

2020 అక్టోబర్‍ 6న భూమికి సమీపంలో అంగారక గ్రహం

PLANET MARS CLOSEST TO EARTH ON 6th OCT 2020
at 62.02 million km – Spot Mars without use of Telescopes/Binocular

ఆకాశంలో నిత్యం ఎన్నో ఖగోళ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రతిరోజూ సాయంత్రం వేళ ఇంట్లో నుంచి ఆకాశంవైపు చూసినప్పుడు మనకు కోట్లాది నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ …

2020 అక్టోబర్‍ 6న భూమికి సమీపంలో అంగారక గ్రహం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -2

ప్రకృతి సూత్రాలలో 15వది – అనగా జీవశాస్త్ర పరంగా మొదటిది:
భూమిపైన జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది. ఈ జీవం క్రమానుగుణంగా పరిణామం చెందుతూ ప్రకృతికి అనుగుణంగా పలురూపాల్లోకి రూపాంతరం చెందింది. చెందుతూనే వుంది. మానవుడి పుట్టుక ఈ పరిణామంలో ఓ భాగమే!

(Life originated from inanimate matter and has been …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -2 Read More »

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక పైగా టూంబ్స్

హైదరాబాద్‍కు చారిత్రకంగా పేరు ప్రఖ్యాతులు అందించిన వారసత్వ కట్టడాల్లో ఇవి కూడా ఉన్నాయి. నిజామ్‍లకు విధేయులుగా ఉండిన పైగా కుటుంబీకుల సమాధులివి. ఉన్నతాధికారులుగా, దాతలుగా, వీరులుగా పైగా కుటుంబీకులు పేరొందారు. హైదరాబాద్‍ లో ఆర్కిటెక్చర్‍ అద్భుతాలకు పేరొందిన వాటిలో ఈ సమాధులు కూడా ఉన్నాయి. అక్కడి మొజాయిక్‍ టైల్స్, హస్తకళానైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. …

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక పైగా టూంబ్స్ Read More »

అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం

సైన్స్ రచయిత కె.బి.గోపాలం గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రముఖ సైన్స్ రచయిత, అనువాదకులు కె.బి.గోపాలం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, తరువాత ఆకాశవాణిలో సైన్స్ ఆఫీసర్‍గా, అసిస్టెంట్‍ స్టేషన్‍ డైరెక్టర్‍గా, స్టేషన్‍ డైరెక్టర్‍గా, డిప్యుటీ డైరెక్టర్‍గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో పనిచేశారు. కరోనా విపత్తుపై మే మాసంలో దక్కన్‍ ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.…

అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం Read More »

అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని

సాంఘిక – ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న చెలికానితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

సాంఘిక-ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వెంకట భూసుర జగన్నాధరావు (రావు వి.బి.జె.) చెలికానిగా పాఠకులకు సుపరిచితులు. వీరు భారతదేశంలో నివాస సంక్షేమ సంఘాలను రూపొందించడానికి ఎంతో కృషి చేశారు. అవి ఇప్పుడు భారత రాజకీయాలలో నాల్గవ శ్రేణి స్వపరిపాలనగా …

అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని Read More »