పల్లా దుర్గయ్య
తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని మణికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు.
పల్లా దుర్గయ్య గారి స్వగ్రామం ఈ మణికొండే. దుర్గయ్యగారు 25-5-1914 తేదీన పల్లా నర్సమ్మ పాపాయ్య దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు 5వ సంతానం. తండ్రిగారికి వ్యవసాయం, ఉంది. పౌరోహిత్యం కూడా చేసేవారు. కాని దుర్గయ్యగారికి …









