కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్ షాహీ’
శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్లా ఉంటుంది. గులాం యాసీన్ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను. మొగల్పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్ మోమిన్ దాయెర, మీర్‌జుమ్లా తలాబ్ (చెరువు) -ఎడమవైపు సుల్తాన్‌షాహీ బస్తీ ఉంటుంది. గాన సుజనులారా ప్రవేశించండి సుల్తాన్ షాహీలోకి! కుతుబ్‌షాహీల కాలంలో ఇచ్చోటనే కదా టంకశాల ఉండేది. అందులో రాజముద్రలు వేయబడిన టంకములను …








