తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం
మొత్తం దక్కన్‍లో మొట్టమొదటి చర్చి కుతుబ్‍షాహీ కాలంలో ఏర్పాటయింది. 1620 ఆ ప్రాంతంలో ఈ చర్చ్ ప్రారంభమయింది. పోర్చుగీస్, ఫ్రెంచ్ నుంచి వచ్చిన కాథలిక్ అధికారులు గోలకొండలో కుతుబ్‍షాహీ సైన్యానికి శిక్షణ ఇచ్చేవారు. ఈ అధికారులు కట్టడాల నిర్మాణంలో, వ్యవసాయరంగంలోనూ మెలుకువలు నేర్పించేవారు. దీంతో కుతుబ్‍షాహీ రాజులతో పాటు వారి అధికారులకు కూడా వీరిపట్ల గౌరవ భావముండేది. ఈ చర్చ్కి సంబంధించి ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో తెలంగాణలో తీవ్రమైన కరువు ఏర్పడింది. …









