గాంధీజీ ఉద్యమమే కవితై, కవితే ఉద్యమమై…
మననం చేసుకోవడానికి సౌలభ్యమున్న తెలుగు పద్యం రంగస్థల రూపు ధరించి సామాన్యుడిని సులువుగా ఆకట్టుకుంది. పాట దానిని మించి ఇటీవల రోజుల్లో సినిమా ద్వారా కూడా అలరిస్తోంది. గాంధీజీ ప్రభావం గురించి సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే పాటలనే తొలుత పేర్కోవాల్సి ఉంటుంది. ‘‘ఆంధ్ర సాహిత్య చరిత్రలో గాంధీయుగం చిరస్మరణీయం, స్వర్ణయుగం’’ అని అంటారు స్వాతంత్య్ర సమరయోధులు కోదాటి నారాయణరావు!ఇటు తెలుగు సాహిత్యం వైపు చూస్తే మేరు శిఖరంగా కనిపించే కవి దామరాజు పుండరీకాక్షుడు. ఆయన ‘శ్రీ గాంధీనామం …








