Author name: deccanland

అలనాడు మామంచి సర్కారీ దవాఖానాలు

మా చిన్నప్పుడు మాకు ఊఁ అంటే రోగాలు, ఆఁ అంటే రోగాలు.మా అమ్మ మొత్తం తొమ్మిది మందిని కన్నది. పోయినోళ్లు పోంగ చివరకు మిగిలింది ఆరుగురం. మొదటి ముగ్గురు ఆడపిల్లలు. తర్వాత ముగ్గురం మొగ నలుసులం. మా అమ్మ మాటలలో మేం ముగ్గురం ‘‘పోంగ జిక్కినోళ్లం’’.ఇంట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి జ్వరాలు, రోగాలు. ప్రతి ఇంట్లో ఒక టి.బి.పేషంటు. మలేరియా, టైఫాయిడ్‍, పోలియో, న్యుమోనియా, కక్కుడు – కాళ్లకు పెట్టటం సర్వసాధారణం. అరవై, డెబ్బై ఏండ్ల క్రింద […]

అలనాడు మామంచి సర్కారీ దవాఖానాలు Read More »

జలాశయాల సంరక్షణ అందరి బాధ్యత మన నదులను కాపాడుకోవడానికి చేయి చేయి కలుపుదాం

ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, Mark Angilo World Rivers Day కెనడా, సివిల్‍ సొసైటీ గ్రూపులు, హైదరాబాద్‍ ప్రభుత్వ సిటీ కళాశాల, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ, జేబీఆర్‍ ఆర్కిటెక్చర్‍ కళాశాల, సెయింట్‍ పాట్రిక్స్ హైస్కూల్‍, హిమాయత్‍నగర్‍ ఆక్స్ఫర్డడ్ గ్రామర్‍ స్కూల్‍ హైదరాబాద్‍, శ్రీసాయి విద్యా నికేతన్‍ హైదరాబాద్‍, తెలంగాణ సంయుక్తంగా ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్‍ జిల్లా శామీర్‍పేట లేక్‍ అవుట్‍ ఫ్లో సదరన్‍ బండ్‍ ఒడ్డున సెప్టెంబర్‍ 22న నిర్వహించారు. ఈ

జలాశయాల సంరక్షణ అందరి బాధ్యత మన నదులను కాపాడుకోవడానికి చేయి చేయి కలుపుదాం Read More »

సుస్థిర ప్రగతికి ఊతం… బంగరు భవితకు మార్గం…!! @ రెన్యువబుల్‍ ఎనర్జీ

నింగినేల ఏకమైందా అన్న రీతిలో కుండపోత వానలూ, వరదలూ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలూ, ఉప్పెనలా విరుచుకుపడుతున్న వడగాలుల ధాటికి జీవరాశి చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు ధ్రువ ప్రాంతాలలో మంచుగడ్డలు తరిగిపోతోంటే మరోవైపు సముద్రమట్టాలు పెరగడమే కాదు, సాగరజలాలు వేడెక్కిపోతున్నాయి. ఇలా, విశ్వ మానవాళిపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న ప్రకృతి విపత్తులకు ప్రధానకారణం శిలాజ ఇంధనాల వినియోగమేనన్నది నిష్ఠుర సత్యం. బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాల వినియోగం ఎంత పెరిగితే కర్బన ఉద్గారాలు అంతగా

సుస్థిర ప్రగతికి ఊతం… బంగరు భవితకు మార్గం…!! @ రెన్యువబుల్‍ ఎనర్జీ Read More »

బీటలు బారిన నేల- వనరుల వినియోగం

మానవ సమాజాలకు సహజ లేదా ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎటువంటివి? అనే విషయంగా పర్యావరణ వేత్తలు తరుచుగా చర్చిస్తుంటారు. వాటికి ఒక సిద్ధాంత భూమికను, అవగాహన చేసుకోవలసిన దారులనూ చూపుతూ ఉంటారు. చాలాకాలం వరకు భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మానవ జీవితాలకు సంబంధించి ఆవరణ వ్యవస్థల కోణాన్ని విస్మరించటం జరిగిందని పర్యావరణ అధ్యయన పరులు తరచుగా చెప్పేమాట భూస్వాములకు, రైతాంగ వర్గాలకు ఉన్న సంబంధం గురించి పలు అధ్యయనాలు కనిపిస్తాయి కానీ, వ్యావసాయిక

బీటలు బారిన నేల- వనరుల వినియోగం Read More »

అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ

దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటకు ఎంత ప్రాధాన్యత ఉండేదో.. బతుకమ్మ కూడా అంతే. మిలియన్‍ మార్చ్ నుంచి వంటావార్పు వరకు ఇలా చరిత్రలో ఎన్నో తెలంగాణ ఉద్యమాలకు బతుకమ్మ కేరాఫ్‍గా నిలిచింది. తెలంగాణ అస్తిత్వ పోరాట చిహ్నంగా

అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ Read More »

అంతరించే ప్రమాదంలో బావోబాబ్‍ చెట్టు

ఈ చెట్టు పేరు బావోబాబ్‍ (Baobab). ప్రధానంగా మడగాస్కర్‍లో కనిపించడంతో పాటు ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది. ఇవి 1,000 సంవత్సరాలకు పైగా జీవించగలవు. కొన్ని చెట్లు 3,000 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఈ చెట్ల భారీ కాండంలో వేల లీటర్ల నీరు నిల్వ అవుతుంది. కాబట్టి కరువులను తట్టుకుని నిలబడగలవు. బావోబాబ్‍ చెట్లను నివాసంగా, ఆహారంగా, మరియు ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ చెట్లు అంతరించే ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాలో (ఎన్‍డేంజర్డ్ లిస్ట్లో) ఉన్నాయి.

అంతరించే ప్రమాదంలో బావోబాబ్‍ చెట్టు Read More »

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉత్తర కోస్తా ప్రాంతం యొక్క ప్రముఖమైన ప్రదేశం. ఈ జిల్లా 13,140 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఈశాన్యంలో విజయనగరం జిల్లా, నైరుతిలో తూర్పుగోదావరి జిల్లా, ఉత్తరాన ఒడిస్సా, దక్షిణాన బంగాళాఖాత సముద్రం. విశాఖపట్నం నగరం రాష్ట్రంలోని అతిపెద్ద నగరం. ప్రముఖమైన ఓడరేవు, స్టీల్‍ ప్లాంట్‍ సింహాచల క్షేత్రం, అందమైన పర్యాటక స్థలాలు ఉండటం వల్ల, ఈ నగరం, జిల్లా ప్రాముఖ్యత సంతరించుకున్నది. చెన్నై-కోల్‍కతా రహదారి NH-7

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

హరప్పా సంస్కృతి శతాబ్ది ఆవిష్కరణ

సెప్టెంబర్‍ 20వ తేదీ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక తేది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం నాటి ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా డైరెక్టర్‍ జనరల్‍ జాన్‍ మార్షల్‍ పురాతన కాలంతో పోల్చదగిన కొత్త నాగరికతను కనుగొన్నట్లు ప్రకటించారు. ఇలస్ట్రేటెడ్‍ లండన్‍ న్యూస్‍ 1924లో ఈజిప్ట్, మెసొపొటేమియా మరియు సౌత్‍-వెస్ట్ ఇరాన్‍ లేదా ఎలాం నాగరికతలు. హరప్పా మరియు మొహంజొదారో 20వ శతాబ్దపు రెండవ దశాబ్దపు ప్రారంభ సంవత్సరాల్లో దయా రామ్‍ సహానీ మరియు రఖల్‍

హరప్పా సంస్కృతి శతాబ్ది ఆవిష్కరణ Read More »

వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం

తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలరీస్‍ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్‍ జీతం 10.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును గురువారం (సెప్టెంబర్‍ 19) రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‍ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్‍, సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‍ ప్రసాద్‍,

వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం Read More »

చోళ ఆలయాలు

ఉనికి: తమిళనాడు, భారత్‍ప్రకటన తేదీ: 1987, ఎక్స్ టెన్షన్‍ 2004కేటగిరీ: సాంస్కృతికం (గ్రూప్‍ ఆఫ్‍ మాన్యుమెంట్స్) సార్వత్రిక విలువ:ఈ సైట్‍ సామాన్య శకం 11 -12వ శతాబ్ది కాలానికి చెందిన, చోళ సామ్రాజ్యపు మూడు గొప్ప ఆలయాలను కలిగి ఉంది. గంగైకొండచోళీశ్వరమ్‍ వద్ద బృహదీశ్వరాలయం ఉంది. ఇది 53 మీటర్ల ఎత్తయిన గాలిగోపురాన్ని కలిగిఉంది. గోపురానికి గల మూలలు, పై దిశగా చెక్కి ఉండే నిర్మాణం ఈ గోపురం ప్రత్యేకతలుగా ఉన్నాయి. తంజావూరు లోని బృహదీశ్వరాలయం గోపురంతో

చోళ ఆలయాలు Read More »