deccanland

జానపద కళారూపాల్లో దక్కనీ కళాసంస్కృతి

ప్రపంచ జానపద కళ ఉత్సవాలను ప్రతీ సంవత్సరం ఆగస్టు 22నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లిఖిత సంప్రదాయానికి ముందే దేశదేశాల్లో జానపద కళారూపం మౌఖిక సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. అపు రూపమైన విజ్ఞానాన్ని అందించిన ఈ జానపదకళ జాతుల వారసత్వసంపదగా మిగిలి పోతోంది. అంతేగాదు అది జాతుల సాంస్కృతిక చిహ్నంగా కూడా నిలిచి పోతోంది. వాస్తవంగా జానపద అస్తిత్వమంతా జానపద కళా వైభవాల్లోనే నిక్షిప్తమై ఉంది. ఒక్క కళలే గాదు మానవ మనుగడకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించింది …

జానపద కళారూపాల్లో దక్కనీ కళాసంస్కృతి Read More »

గోండు (కోయతూర్‍) భాష డిక్షనరీ – ఒక పరిశీలన

నిజమైన భారతీయులు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైనపుడు అసలు ఈ దేశంలో మూలవాసి ఎవరు? ఆ మూలవాసులకు ఈ దేశంలో దక్కిన గౌరవం ఎలాంటిది? వారి ఆస్తిత్వ మూలాలు, సంస్కృతి సంప్రదాయాలు, భాషల రక్షణ పై, జీవన విధానంపై చర్చ జరిగినపుడు వారికంటు ఒక భద్రత దొరుకుతుంది. కాని 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారత దేశంలో ఆ ప్రయత్నం జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో 10 కోట్ల జనాభ గల ఆదివాసీలుఉంటే, అందులో …

గోండు (కోయతూర్‍) భాష డిక్షనరీ – ఒక పరిశీలన Read More »

నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! (గత సంచిక తరువాయి)గత కథనాలలో భూగోళానికి, మానవాళికి ముంచుకొస్తున్న పెనుప్రమాదాల్ని చర్చించాం! వివిధ సదస్సుల, సమావేశాల చర్చల్ని, తీర్మానాల్ని, దేశాధినేతల వాగ్బాణాల్ని చూసాం! అయినా జరగాల్సిన ధ్వంసరచన జరుగుతూనే వుంది. యుద్దమేఘాలు తొలగకపోగా మరింత కారుమబ్బులుగా మారుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్యన చిన్న రాజ్యాలు నలిగిపోతుంటే, అమాయక ప్రజలు నిత్యం సమిధలుగా మారుతున్నారు. ఓ వైపు కాలుష్య పరిణామాల్ని ఏకరువు పెడుతూనే నిత్యం యుద్ధభేరిని మోగిస్తున్నాయి. తన ఉనికికే ప్రమాద ఘంటికలు …

నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !! Read More »

అక్టోబర్‍ 4న ప్రపంచ జంతు దినోత్సవం

భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులూ ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు కనుమరుగై పోతున్నాయి. ఈ మధ్యనే అంతరించి పోయిన చీతాలు జాతిని ఇతర దేశాల నుంచి తెప్పించడం జరిగింది. ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా, వాటిని పరిరక్షించడమే …

అక్టోబర్‍ 4న ప్రపంచ జంతు దినోత్సవం Read More »

నమ్మిన బంటు

శివపురంలో ఉండే ధర్మయ్యకు లేక లేక సంతానం కలిగింది. అతడు తన కుమారుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కానీ ఆ తర్వాత అతడు తన కొడుకుకు శ్రమపడి డబ్బులు సంపాదించాలని చెప్పాడు. అతని కొడుకు పేరు శేషు. అతడు తండ్రితో ‘‘నాన్నా! మనకు నీవు సంపాదించినదే చాలా ఉంది. నేనెందుకు కష్టపడాలి. మీ ఆస్తి అంతా కూడా నాదే కదా!’’ అని అన్నాడు . అప్పుడు ధర్మయ్య ‘‘ఒరేయ్‍! నా ఆస్తి అంతా నీదే. …

నమ్మిన బంటు Read More »

కాలం… ఒక నిర్ధారిత చరిత్ర

కాలం కేవలం సమయసూచిక కాదు. అది ఒక నిర్ధారిత చరిత్ర. దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక ఈ సంచికతో 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ పది సంవత్సరాల సమయంలో ప్రధాన మీడియాకు భిన్నంగా, ప్రత్యమ్నాయ పత్రికగా సమాజం పట్ల జర్నలిజం నిర్వర్తించవలసిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించింది. సామాజిక సంక్షోభాలూ, సంక్లిష్టతలూ ముసురులా కమ్మి అన్ని రంగాలనూ కుదిపేస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచి, ఆచరణ వైపు నడిపించవలసిన ప్రధాన మీడియా తన కర్తవ్యానికి దూరమవుతున్నప్పుడు ఆలోటును భర్తీ …

కాలం… ఒక నిర్ధారిత చరిత్ర Read More »

పేర్వారం జగన్నాథం

అభ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో ఆకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి ప్రయాణిస్తున్నాడనే స్పృహతో వీరు కవిత్వం రాశారు. దీనిని చేతనా వర్తమానిగా పిలిచారు. తెలంగాణకు చెంది, ఓరుగల్లు నేలకు చెందినవారు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్కుమార, వేనరెడ్డి. చేతనావర్తకవిగా సుప్రసిద్ధులైన పేర్వారం జగన్నాథం గారు ప్రధానంగా అధిక్షేప కవి. పఠాభి ‘ఫిడేలు రాగాలు డజన్‍, కవితా సంపుటిని రచించి అధిక్షే కవిగా ప్రసిద్ధులయ్యారు. పఠాభి తరువాత వెంటనే గుర్తుకు వచ్చే …

పేర్వారం జగన్నాథం Read More »

గొప్ప విజయము

సరిగ్గా పదిసంవత్సరాలు. తెలంగాణ ఉద్యమం చివరి దశ 2009 డిసెంబర్‍కి తెలంగాణ ప్రకటన వచ్చి, వెనుకంజ వేసిన సంక్షోభకాలం. తెలంగాణ మళ్లీ క్రాస్‍రోడ్స్లో నిలబడింది. ఉద్యమం ఉవ్వెత్తున జరగవలసిన సందర్భంలో ఉన్నది. అలాంటి సంక్షుఛిత సందర్భంలో మాసపత్రికగా ‘దక్కన్‍ల్యాండ్‍’ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాఫ్రంట్‍ నాయకుడు మణికొండ వేదకుమార్‍ ఈ పత్రికను స్థాపించి, సంపాదకుడిగా ఉన్నారు. అప్పుడు సందిగ్ధ సందర్భంలో ప్రారంభమయిన ఆ ‘దక్కన్‍ ల్యాండ్‍’’ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప …

గొప్ప విజయము Read More »

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’

నయాపూల్‍ దాటాక ఎడమవైపున్న నాయబ్‍ హోటల్‍ పక్క సందులోకి మళ్లితే చత్తాబజార్‍ వస్తుంది. అక్కడి సిటి సివిల్‍ కోర్టు వెనక భాగాన ఉన్నదే పురానీ హవేలీ. ఐదవ కులీ కుతుబ్‍ షాకు (1580-1612) ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్‍ మోమిన్‍ అస్త్రాబాదీ నివాసమే ఈ హవేలీ. ఇది అవతలి వారికి కనబడకుండా ఉండటం కోసం దీని చుట్టూ ఒక మైలు దూరం వర్తులాకారంలో ఎత్తైన ప్రహారీ గోడను నిర్మించారు. రెండవ నిజాం మీర్‍ అలీ ఖాన్‍ తన కుమారుడు, …

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’ Read More »

నలభై అడుగుల ఆలయపునర్నిర్మాణానికి నాలుగు దశాబ్దాలా? (జాకారం శివాలయం ఆవేదన)

మనదేశంలోనే ఎత్తైన, సువిశాలమైన తంజావూరులోని రాజరాజేశ్వరాలయ నిర్మాణానికి కేవలం 15 ఏళ్లు పట్టింది. కోణార్క్లోని ప్రపంచస్థాయి సూర్యాలయ నిర్మాణానికి కూడా 15 ఏళ్లే పట్టింది. ఇవి రెండూ ఎప్పుడో వెయ్యేళ్ల నాడు, 800 ఏళ్ల నాడు, ఆధునిక పరికరాలు ఏమీ లేనపుడు, నిర్మాణ స్థల ఎంపిక, రాతి గనుల ఎంపిక, శిల్పుల ఎంపిక, పథక రచన, ఆలయ విడిభాగాలు, వాటిపై రమణీయ శిల్పాలు, ద్వారాలు, స్థంభాలు, గోడలు, దూలాలు, కప్పు, పైన శిఖరం, ముందు మహామండపాలు, ఇలా …

నలభై అడుగుల ఆలయపునర్నిర్మాణానికి నాలుగు దశాబ్దాలా? (జాకారం శివాలయం ఆవేదన) Read More »