deccanland

ప్రకృతే నియంత్రిస్తుంది! 14 ప్రకృతే శాసిస్తుంది!! అనునిత్యం అవిటిదైపోతున్న అవని!

(గత సంచిక తరువాయి)విష్ణు పురాణాల్లో మూడవ అవతారంగా చెప్పబడే వరాహావతారం గాథ తెలిసిందే! హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి పాతాళంలోకి విసరాలని చూడగా, పాతాళంలో వరాహా వతారంలో వున్న విష్ణువు తన మోరచే ఆపి తిరిగి భూమిని పైన నిలిపారని చెపుతారు. శాస్త్రీయ దృక్పథం ముందుకు వస్తున్నకాలంలో, భూమి గుండ్రంగా వుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ప్రపంచ వ్యాపితంగా భూమి బల్లపరుపుగా వుందనే కల్పిత గాథల్ని ఈ విధంగా ముందుకు తెచ్చాయి.అయితే నేటి 21వ శతాబ్దంలో …

ప్రకృతే నియంత్రిస్తుంది! 14 ప్రకృతే శాసిస్తుంది!! అనునిత్యం అవిటిదైపోతున్న అవని! Read More »

అడవిని కాచే ఆడపులి!

ఒక చెట్టును నరికెయ్యడానికి ఎంతో సమయం అక్కర్లేదు. కానీ ఒక చిన్న మొక్క పెరిగి వృక్షంగా మారడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందుకే ఒక్క చెట్టు కూడా అక్రమ నరకివేతకు గురికాకుండా కాపాడాలన్నది మా లక్ష్యం’’ అంటున్నారు జార్ఖండ్‍కు చెందిన గిరిజన మహిళ కందోనీ సోరెన్‍. ‘జంగిల్‍ కీ షేర్నీ’ అంటూ స్థానికులు పిలుచుకొనే ఆమె సారథ్యంలో 45 మంది మహిళలు సంఘటితమై… తమ చుట్టూ ఉన్న అడవిని రక్షిస్తున్నారు. కందోనీ స్వగ్రామం జార్ఖండ్‍ రాష్ట్రం జంషెడ్‍పూర్‍ …

అడవిని కాచే ఆడపులి! Read More »

ఆవాలు.. లాభాలు..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎకరాకు 5-6 క్వింటాళ్ల దిగుబడి క్వింటాలుకు రూ. 7 వేల ధర మెట్ట ప్రాంతాల రైతుకు లాభం తెలంగాణ ప్రాంతంలోని మెట్ట ప్రాంత రైతులు ఆవాలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‍లో డిమాండ్‍ ఉండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. ప్రైవేట్‍ వ్యాపారులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామంటూ ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పంట 85 నుంచి 90 రోజుల మధ్య చేతికి …

ఆవాలు.. లాభాలు.. Read More »

బాలల కథా సుమాలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘కరీంనగర్‍జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త సంగనభట్ల చెన్న రామకిష్టయ్య గారి విశ్లేషణ.కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం …

బాలల కథా సుమాలు Read More »

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్‍ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో రకాల అనుభూతులు కలుగుతాయి. కొందరికి అక్కడ తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తే, మరి కొందరికి ఒకనాటి రాచరికం మదిలో మెదులుతుంది. కొందరికి అక్కడ ఉరకలు వేసిన తెలంగాణఉద్యమం గుర్తుకొస్తుంది. మరికొందరికి వివిధ అంశాల్లో అక్కడి విద్యార్థుల చైతన్యం యాదికొస్తుంది. అదే మన ఉస్మానియా యూనివర్సిటీ.యావత్‍ దేశంలో ఉన్నత విద్యకు మారుపేరుగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. తాజాగా ఫౌండేషన్‍ డే వేడుకతో ఈ …

21 సూత్రాల అజెండాతో నయా ఉస్మానియా Read More »

సైబ పరంధాములు

పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా – సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో ‘ఆక•తి’కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది… ఆ కళామూర్తే సైబ పరంధాములు.కీ.శే.సైబ పరంధాములు, శ్రీ సైబ లింగయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్‍ నగరంలో జన్మించారు. అప్పటి మల్టీపర్పస్‍లో చదివి గోల్డ్ మెడల్‍ సంపాదించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్‍. పూర్తి చేయలేక పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. …

సైబ పరంధాములు Read More »

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’

ఒక తాతీల్‍ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్‍ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్‍ నములుతూ మధ్యలో తుపుక్‍, తుపుక్‍ మని రోడ్డుమీద ఉమ్మేస్తూ, సన్నగా పొడుగ్గా ఉన్న మేక గడ్డం చిరుగాలితో సయ్యాటలాడుతుంటే, తెల్లటి మస్లీన్‍ లాల్చీ ధరించి, …

అరబ్బీ మురబ్బా ‘బార్కాస్‍’ Read More »

జానపద గేయాలలో సామాజిక జీవనం

జానపదులు అంటే సామాన్యంగా గ్రామీణులు లేదా నిరక్షరాస్యులు అని అనుకుంటారు. జనపదం అంటే గ్రామం కాబట్టి గ్రామంలో నివసించే వారు జానపదులు అనుకున్నారు. కానీ మారిన కాలాన్ని బట్టి, సామాజిక పరిణామాన్ని బట్టి జానపదులు అంటే ఏదైనా ఒక విషయంలో భాగస్వామ్యం గల జనసముదాయం అని చెప్పవచ్చు.సమాజంలో అక్షరజ్ఞానం లేని సామాజికులు, గ్రామీణ, శ్రామిక సామాన్య జనం తమ శ్రమలో, ఆచారాల్లో, సంబరాల్లో అలవోకగా సృష్టించుకుని అలిఖితంగా తరతరాలుగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింప …

జానపద గేయాలలో సామాజిక జీవనం Read More »

తెలంగాణలో పుష్కలంగా వారసత్వ సంపద

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా హెరిటేజ్‍ పరిరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHA), ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ ఆన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్ వింగ్‍ ఆఫ్‍ ఇండియా (ICOMOS), తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) అభివృద్ధి సంస్థ సహకారంతో హెరిటేజ్‍ పరిరరక్షణ పర్యాటకంపై అవగాహన సదస్సును ఏప్రిల్‍ 18న బేగంపేట్‍లోని హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍, …

తెలంగాణలో పుష్కలంగా వారసత్వ సంపద Read More »

పిల్లలమర్రి దేవాలయంలో ఉన్న ఆ ఒక్క వర్ణచిత్రాన్నీ కాపాడుకోలేమా?

ఆది మానవుని అడుగుజాడలకు అద్దం పట్టిన తెలుగు నేలపై శిలాయుగంలోనే చిత్రకళ పురుడుపోసుకుంది. తెలంగాణా – రాయల సీమ జిల్లాల్లో దాదాపు 45కుపైగా స్థావరాల వద్ద గుహల్లోనూ, కొండ చరియలపైనా ఆనాటి వర్ణచిత్రాలు అప్పటి సృజనకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచేవున్నాయి. కరీంనగర్‍ జిల్లాలో రేగొండ, వరంగల్‍ జిల్లాలో పాండవుల గుట్ట, కర్నూలు జిల్లాలో కేతవరం, మహబూబ్‍నగర్‍ జిల్లాలో సంగనోన్‍ పల్లి, కడప జిల్లాలో చింతకుంట, నెల్లూరు జిల్లాలో నాయుడుపల్లి శిలాయుగపు చిత్రకళకు కొన్ని ఉదాహరణలు.మళ్లీ శాతవాహనుల కాలంలో …

పిల్లలమర్రి దేవాలయంలో ఉన్న ఆ ఒక్క వర్ణచిత్రాన్నీ కాపాడుకోలేమా? Read More »