యక్షగాన సాహిత్యంలో కల్పిత కథలు
సామాన్య జనజీవనంలో నుండి ఆవిర్భవించి వర్ధిల్లినవి జానపద కళలు. ఇవి స్వయంభువులు. సామాన్య ప్రజల ఆశలకూ, ఆశయాలకూ, ఆలోచనలకూ, ఆవేదనలకు ప్రతిబింబాలు కావడం వల్ల ఇప్పటికీ సజీవంగానే నిలిచి ఉన్నాయి. జానపద కళలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు కాబట్టి ఎంతకాలం మన ఆలోచనల మీద ప్రభావాన్ని చూపుతాయో అంతకాలము అవి నిలిచి వుంటాయి. జానపద కళలలో యక్షగాన వాఙ్మయము అతి ప్రాచీనమైనది. దీనిని ప్రజాసాహిత్యమని చెప్పవచ్చు. ఇతివృత్తం పౌరాణికాలు గానీ, సాంఘికాలుగానీ, ఏదైనప్పటికీ ఆబాల గోపాలాన్ని …









