అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-17 ‘కరణం’ పదాన్ని మొదటిసారి ప్రస్తావించిన మొదటి సోమేశ్వరుని కురుమిద్దిశాసనం(క్రీ.శ.1046)
కరణం, మునసబు అనే పదాలు గ్రామాధికారులను సూచిస్తాయి. కరణం అంటే గ్రామంలోని పొలం కొలతల పట్టీని నిర్వహించే వాడు. ఏదైనా పొలం అమ్మాలన్నా, కొనాలన్నా ఆ పొలం గురించి కరణం మాటే వేదం. అందరికీ అందుబాటులో లేని కొలత పద్ధతులు, కొలమానాలతో మోసం చేసేవారని వారి మీద ఒక అపవాదుండేది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా …








