వన్యప్రాణి రక్షణే జీవ వైవిధ్య పోషణ
(కేరళలో గర్భం దాల్చిన ఏనుగు హత్యకు స్పందనగా) కేరళలోని నీలంబూర్ అటవీ ప్రాంతంలో గర్భం దాల్చిన 15 సంవత్సరాల వయస్సు గల ఏనుగును క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ భారతదేశ ప్రజలను, జంతు ప్రేమికులను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనకు స్పందించిన వారిలో రతన్ టాటా, విరాట్ కొహ్లీ, ఇతర ప్రముఖులతో పాటు అసంఖ్యాక సామాన్య జనం తమ గళాన్ని వినిపించడం ఆహ్వానించదగిన పరిణామం. కరోనా లాక్‍డౌన్ కారణంగా వన్యప్రాణులు కొంత స్వేచ్ఛను తీసుకోవడం, మానవ నివాసాలకు దగ్గరగా రావడం కూడా ఏనుగు హత్యకు దారి …









