దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు
ఉమ్మడి ఆంధప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి రావడం ఒక కీలక మలుపు. మొదటి సారిగా జనవరి 9, 1983 నాడు తొలి కాంగ్రేసేతర వ్యక్తిగా ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. అంతకుముందూ కుల రాజకీయాలున్నప్పటికీ అవి అంత నగ్నంగా బయటికి రాలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన తొలి ముఖ్యమంత్రి. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీరామారావు చరిత్ర సృష్టించిండు. ఈయన రాష్ట్రమంతటా పర్యటించి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పరిరక్షణ పేరిట ప్రచారం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు, గాడి తప్పిన సుదీర్ఘ …








