లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ
(గత సంచిక తరువాయి)పశువుల ఫారాల నిర్మాణం ఎలా ఉండాలి?ఫారం నిర్మాణం : పశువుల ఫరాల్ని ఎంపికచేసిన స్థలంలో ఇ, యు, ఎల్, సి, ఎఫ్ అక్షరాలలాగా నిర్మించుకుంటే, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది.పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరక్టుగా పడకుండా తూర్పు-పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని కూడా దిశను మార్చుకోవచ్చును. తీరప్రాంతాలలో గోడ, గాలివీచే దిశకు అడ్డుగా, ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో నేల తొందరగా ఆరడానికి ఉత్తర-దక్షిణ దిశల్లో, అధిక ఉష్ణోగ్రత ఉండే …









