పాకాల యశోదారెడ్డి
స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోధారెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా ‘‘మహాలక్ష్మి ముచ్చట్లు’’ అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోదా రెడ్డి.తెలంగాణ మూరుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం. ఆమె 1929 ఆగస్టు 8వ తేదీన మహబూబ్‍నగర్ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. …









