Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/header/configs Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/footer/configs January - Deccan Land - Page 9

January

బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు.


నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, …

బోయ జంగయ్య Read More »

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి


(డిసెంబర్‍ 23 కె.ఆర్‍.వీరస్వామి జయంతి సందర్భంగా)

1940వ దశకంలో హైదరాబాద్‍ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్‍.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా …

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది) Read More »

మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న …

మరుపురాని మాదన్నపేట Read More »

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍

భూమి లభ్యత పరిమితం. భూమి ఉపరితలంపై భూమి లభ్యత కేవలం 20 శాతమే.
1.ఏ నగర అభివృద్ధికైనా భూమి అనేది ప్రాథమిక వనరు. ఇది రెండు ప్రధాన లక్షణాలను కలిగిఉంటుంది. (1) ఒక నిర్దిష్ట సమయం వద్ద భూమి లభ్యత పరిమితం గానే ఉంటుంది. (2) అది ఒక దానితో ఒకటి పోటీపడే అనేక ఉపయోగాలను …

అర్బన్‍ ల్యాండ్‍ విధానాలు – సిటీ ప్లానింగ్‍ Read More »

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!

గతానికి కన్నా వర్తమానంలో మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఆశకు సృజన, ఆసక్తి, పట్టుదల, సడలని దృఢసంకల్పం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈరకమైన ఆలోచనలే మానవుడిని మహోన్నతుడిని చేశాయి. మొదట్లో ఒకచోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి కాలినడకను ఆశ్రయించిన నాటి మానవుడు, తదనంతర కాలంలో ‘‘చక్రం’’ కనుక్కోవడం, మానవ నాగరికతలోనే ఒక విప్లవాత్మక …

నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!! Read More »

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం?

సూర్యమండలంలో కేంద్రమైన భానుడికి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం శుక్రుడు. చంద్రుడి తరువాత శుకగ్రహం కూడా రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగులు పంచగలుగుతుంది. సూర్యుడి చుట్టు ఒకసారి తిరగడానికి శుకగ్రహానికి 224.7 రోజులు పడుతుంది. ఆకారం, ద్రవ్యరాశి, సూర్యుడి నుండి దూరం మరియు సంఘటనలలో శుకగ్రహం మరియు భూగ్రహం ఒకేలా ఉన్నందున శుక్రుడిని భూమి ‘సోదర గ్రహం (సిస్టర్‍ ప్లానెట్‍)’ అంటారు. …

శుకగ్రహంపై గ్రహాంతరవాసుల జీవం? Read More »

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం

భారతదేశం ఏకశిలా సదృశ్యమైన ధార్మిక, సాంస్కృతిక విలువలు కలిగిన దేశం కాదు. భిన్నభాషా సంస్కృతులు, భిన్నమైన ఆలోచనా ధారలు వికసిల్లిన విశాల దేశం. భిన్నత్వమే ఈ దేశం ప్రత్యేకత. భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన సాంస్కృతిక ధార ఈ దేశానిది. అందులోనే సహజీవన సంస్కృతి వెల్లి విరిసింది. ఈ సహజీవన సంస్కృతి ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. …

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హిందుస్తానీ సంగీతం Read More »

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍

చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్‍, కామిక్‍ స్ట్రిప్‍ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు …

నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్‍ స్క్రోల్‍ పెయింటింగ్‍ Read More »

ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్‍ బాధ్యతలు చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రే స్వయంగా భక్తిపరుడు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి తెలిపారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొదలు పెడతారన్నారు. సమైక్య రాష్ట్రంలో దేవాదాయ శాఖ అంటే కొన్ని పేర్లు మాత్రమే వినబడేవి. తిరుపతి …

ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి Read More »