భారతీయుల జన్యు అమరిక చిక్కుముడిని విప్పే…
ఇండీజెన్ ప్రాజెక్ట్…!!! భూమి మీద అడుగిడిన తొలి మానవుడు తన ప్రారంభ దశలో ఆవాసం, ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకే ఆపసోపాలు పడ్డాడు, ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ‘‘పడి లేచిన కెరటంలా’’ తన జీవనగమనంలో ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో తన చుట్టూ ముసురుకున్న సమస్యలను ప్రతిఘటించాడు. అంతిమంగా మనుగడ కోసం పోరాటం తప్పదన్న నిర్ణయానికొచ్చాడు. ఈ క్రమంలో తనకు సమస్యలెదురైనప్పడల్లా అలుపెరగని పోరాటంతో, తన సునిశిత మేధాశక్తితో వాటికి పరిష్కారాలు కనుగొన్నాడు. …









