July

చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన

2025 మే 20న, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ వేదకుమార్‍ మణికొండ గారు, తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలోని చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు. ఇది ఎంతో ప్రాచీనమైన, సంస్కృతితో నిండిన బౌద్ధ స్థలం.ఈ సందర్శన సమయంలో అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వక పనులు కూడా పరిశీలించబడ్డాయి.ఈ సందర్శనలో ఆయనతో పాటు ప్రఖ్యాత పురావస్తు నిపుణులు ప్రొఫెసర్‍ కె.పి.రావు, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు శ్రీ …

చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన Read More »

భూమికి దూరమవుతున్న చందమామజులై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం

మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటారు. అవును ఒక్కొసారి ఇది నిజమే అనిపిస్తుంది. భూమి కాకుండా చంద్రుడి పైకి వెళ్తారని ఎవరైనా అనుకున్నారా.. కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు. జాబిలిపై తొలి అడుగుకి జులై 20కి 56 ఏళ్లు. జులై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా 1968లో ‘అపోలో-11’లో వ్యోమగాములు నీల్‍ ఆర్మ్ స్ట్రాంగ్‍, మైకెల్‍ కొల్లిన్స్, ఎడ్విన్‍ ఇ అల్డ్రిన్‍లను చంద్రుడి పైకి పంపింది.మన భూమిపై రోజుకి 24 గంటలు. ఆ …

భూమికి దూరమవుతున్న చందమామజులై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం Read More »

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 7780 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తర మరియు ఈశాన్యంలో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. పశ్చిమం మరియు నైరుతిలో కృష్ణా జిల్లా, తూర్పు దిశలో తూర్పుగోదావరి జిల్లా, దక్షిణంలో సముద్రం కలవు. ఇక్కడ కోస్తాప్రాంతం E-W దిశలో ఉంటుంది.ఈ ప్రాంతం గుండా చెన్నై-హౌరా నేషనల్‍ హైవే మరియు బ్రాడ్‍గేజ్‍ రైల్వేలైన్‍ వెళ్తువి. ఈ జిల్లాని మూడు ఫిసియోగ్రాఫిక్‍ ప్రాంతాలుగా విభజించవచ్చును. దక్షిణ ప్రాంతంలో కృష్ణా – …

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »

మౌర్య మార్గాల వెంబడిఅశోకుని శాసన ప్రదేశాలసీరియల్‍ నామినేషన్‍

యునెస్కో ఇటీవల భారతదేశానికి చెందిన 6 సైట్స్ను తన తాజా టెంటేటివ్‍ వరల్డ్ హెరిటేజ్‍ జాబితాకు జోడించింది. వీటిలో 34 ప్రాంతాల్లోని అశోకుడి శాసన ప్రదేశాలు కూడా ఒక సీరియల్‍ నామినేషన్‍గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అశోకుడి శాసన ప్రదేశాలు, ఈ సీరియల్‍ నామినేషన్‍ గురించి మరిన్ని వివరాలు… నామినేషన్‍ దాఖలు తేదీ: 11/02/2025ప్రమాణాలు: (iii) (iv) (v)వర్గం: సాంస్కృతికంసమర్పించినవారు: యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంరాష్ట్రాలు: హార్‍, ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, దిల్లీ, కర్ణాటక, ఆంధప్రదేశ్‍, …

మౌర్య మార్గాల వెంబడిఅశోకుని శాసన ప్రదేశాలసీరియల్‍ నామినేషన్‍ Read More »

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన

2025 జూన్‍ 21న సమ్మర్‍ సోలిస్టిస్‍ ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍, ప్రాంగణాన్ని నారాయణపేట జిల్లా, తెలంగాణ, ఇండియా సందర్శించారు.నారాయణపేట జిల్లా ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ స్థలంలో కొనసాగుతున్న పరిశోధనలో భాగంగా, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) మరియు తెలంగాణ ప్రభుత్వం వారి హేరిటేజ్‍ విభాగం సంయుక్తంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులను ఈరోజు సందర్శనకు ఆహ్వానించారు. ఈ సందర్శన లక్ష్యం, దక్షిణ భారతదేశపు ఆదిమ మానవుల జీవనశైలి మరియు …

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన Read More »

బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం ఒక విశిష్ట చారిత్రిక గ్రామం. బుద్ధారం పేరులోనే వేల ఏండ్ల చరిత్ర దాగి ఉన్నది. పాత పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక  చరిత్ర’ (పుట 35)లో “బుద్ధాపురం … బుద్ధారెడ్డి పేర కట్టించినదే” అని రాయగా, కపిలవాయి లింగమూర్తి తన ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ (పుట 193)లో “గోన గణపిరెడ్డి తమ తండ్రి గారి పేర… స్ధాపించిన గ్రామానికి బుద్ధవరమని …

బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి Read More »

ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా నిమిష నిమిషానికి పెరుగుతోంది. 2023 నాటికి 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా, 2025 నాటికి 823.1 కోట్లు దాటిందని అంచనా. ఈ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‍, చైనా మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. భారత్‍ ఇటీవలే చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించి మొదటి స్థానంలోకి రాగా, చైనా రెండో స్థానానికి దిగింది. భారత జనాభా 2025 నాటికి 146.39 కోట్లకు పైగా ఉండగా, …

ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం Read More »

అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి

‘‘… విశాల విశ్వమున భూరి రహస్యములెల్ల విప్ప ఈ మానవజాతి మనుగడకు మంచియగున్‍ గణితమ్ము వల్లనే-’’‘‘గణితము సౌందర్యమునకు వినియోగమునకు నెలవని వివరింపదగున్‍వినియోగము సేవక వృత్తిని సౌందర్యమ్ముదాత్త తేజము దెలుపున్‍’’‘‘పరిశీలన పరిశోధనలిరు తెరుగుల వృద్ధి గోరి హేరాళముగావరలను గణిత నమూనాల్‍ కోరముట్లై శాస్త్ర ప్రగతి కొరకిద్దరలో’’ అని ఆచార్య పుదూరు విశ్వనాథ అరుణాచలం (1935-2020) గణిత శాస్త్ర ప్రయోజనాన్నీ, ఇంకా గణితానికుండే సేవక స్వభావాన్ని, సౌందర్య ఉదాత్తతను చాలా స్పష్టంగా చెప్పడమే కాక ఈ శాస్త్రానికి సంబంధించి అబ్జర్వేషన్‍, …

అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి Read More »

భావోద్వేగాలకు జీవం పోసిన పుస్తకం

ఈ ప్రపంచంలో ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. ఒక మనిషి తన గురించి మరో మనిషికి చెబుతూ, తన గురించి తను తెలుసుకోవడమే ఫోటోగ్రఫీ యొక్క ఆర్టిస్టిక్‍ పర్పస్‍ అని ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్టులలో ఒకరైన Edward Jean Steichen చెబుతారు. అంతటి గొప్ప కళకు భారతదేశంలో మరింత ఎక్కువ గుర్తింపు రావాల్సిందిగా ఇక్కడి కళాకారులు భావిస్తూ ఉంటారు. నిజానికి భారతదేశంలో సగటు మనిషికి ఫోటోగ్రఫీ అనగానే పెళ్లిళ్లు, చావులు మాత్రమే గుర్తుకు వస్తాయి. …

భావోద్వేగాలకు జీవం పోసిన పుస్తకం Read More »

అద్భుతమైన అల్లాదుర్గం చరిత్ర

మెదక్‍ జిల్లాలోని మండల కేంద్రం అల్లాదుర్గం మెదక్‍, ఆందోల్‍ దగ్గర హైదరాబాద్‍-నిజాంసాగర్‍ హైవే మీద వుంది. 1967 ఫిబ్రవరిలో అల్లాదుర్గం చెరువుకింది పొలం యజమాని ఒక గుంటలో గుడికి సంబంధించిన శిలలు, శిల్పాలను చూసినట్లు చెప్పడంతో ఆ ఊరి దేశ్‍ముఖ్‍లు లక్ష్మారెడ్డి, రంగారెడ్డిలిద్దరు పురావస్తుశాఖకు తెలియజేసారు. అప్పటి ఆంధప్రదేశ్‍ పురావస్తు శాఖ 1967 మార్చిలోనే తవ్వకాలు మొదలుపెట్టింది.పురావస్తు తవ్వకాలలో అల్లాదుర్గంలో కొలనుపాక, వరంగల్లులలోని తోరణాల లెక్క రెండు తోరణస్తంభాలు బయట పడ్డాయి. అక్కడే ఎన్నో శిల్పాలు, పురావస్తువులు …

అద్భుతమైన అల్లాదుర్గం చరిత్ర Read More »