July

యునెస్కో (UNESCO) గుర్తింపు కోసం మంజీరా అభయారణ్యం!

సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి UNESCO గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్‍ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా డ్యామ్‍కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో ఈ జలాశయానికి అభయారణ్య హోదా ఇవ్వబడింది.మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. …

యునెస్కో (UNESCO) గుర్తింపు కోసం మంజీరా అభయారణ్యం! Read More »

చేతిరాత నిశ్శబ్ద ఆత్మహత్య

చిన్నప్పుడు మా పంతులుగారు మమ్మల్ని హెచ్చరించేవారు. ‘‘అరే వారీ’’ నీ చేతిరాత అందంగా లేకపోతే నీ తలరాత కూడా బాగుండదు రా’’ అని. దాని మతలబు ఏందంటే చేతి రాత బాగుంటే చదువుకూడా బాగా వస్తుందని తద్వారా భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉంటుందని అర్థం. మా చిన్నప్పుడు పరీక్షల ప్రశ్నాపత్రం పైన కొన్ని సూచనలు ఉండేవి. ఒక ముఖ్యమైన సూచన ఏమనగా ‘‘అందమైన ముత్యాల్లాంటి చేతి రాతకు అదనంగా ఐదు మార్కులు కలపబడును’’. అటువంటి అమూల్యమైన విశేష …

చేతిరాత నిశ్శబ్ద ఆత్మహత్య Read More »

అద్భుత దేవాలయాలున్న జనగామ అపురూప వారసత్వాన్ని కాపాడుకోలేమా?

జనగామ, జనం ఉన్న గ్రామం జనగామ. గోదావరి ఒడ్డునున్న గోదావరిఖని శివారులోనున్న గ్రామం. అక్కడ ఒకటి కాదు, రెండు అపురూప ఆలయాలున్నాయి. ఒకటి త్రిలింగేశ్వరాలయం. మరొకటి త్రిలింగ రాజరాజేశ్వరాలయం. రెండూ త్రికూటాలయాలే. మూడు గర్భగుళ్లు, మూడు అర్ధమండపాలు, ఒక రంగమండపం, మధ్య ఆలయాలకెదురుగా ప్రవేశద్వార మండపాలు. ఊరుబయట రోడ్డుకు ఎడమవైపున్నది త్రిలింగేశ్వరాలయం, కుడి వైపున కొంచెంలోపలికున్నది త్రిలింగ రాజరాజేశ్వరాలయం. రెండు ఆలయాలూ, విలక్షణ వాస్తు వైవిధ్యంతో అరుదైన కట్టడాలుగా గుర్తింపుకు నోచుకొన్నాయి. ఎడమవైపు ఆలయం చిక్కి శిథిలావస్థలో …

అద్భుత దేవాలయాలున్న జనగామ అపురూప వారసత్వాన్ని కాపాడుకోలేమా? Read More »

పాఠశాలల పునః ప్రారంభం నేటి తరం బాలలు – మన తరగతి గదులు; సవాళ్ళు

బడులు తెరిచారు ఎవరి హడావిడి వారిది. విద్యాశాఖ పుస్తకాల పంపిణీలో, మౌలిక వసతులను బాగు చేయడంలో, ఉపాధ్యాయులకు సూచనలు చేయడంలో, బడి బాట కార్యక్రమ నిర్వహణలో బిజీ బిజీగా ఉన్నారు. ఉపాధ్యాయులు వేసవి సెలవులలో తమ పిల్లలతో విహార యాత్రలకు, పెళ్ళిళ్ళకు ఇతర ప్రయాణాలు చేసి బడులు తెరిచే నాటికి ఏమైనా ఇంట్లో పనులు ఉంటే చక్క బెట్టుకుని, బడులు తెరిచే మొదటి రోజు తప్పని సరి హాజరి ఉండాలి. కాబట్టి వారి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. …

పాఠశాలల పునః ప్రారంభం నేటి తరం బాలలు – మన తరగతి గదులు; సవాళ్ళు Read More »

బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం

చరిత్రలో ప్రధాన బాధితులు జంతువులే అంటాడు చరిత్రకారుడు యూవల్‍ నోవా హరారి. పెంపుడు జంతువులను కూడా సమధికంగానే చరిత్రలో అధికంగా మానవులు బాధించారనీ ఆయన పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాలు వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి కానీ, ఇది తిరస్కరించలేని వాస్తవం. 1975లో పీటర్‍ సింగర్‍ ‘యానిమల్‍ లిబరేషన్‍’ అనే గ్రంధం ప్రచురించాడు. ఈ గ్రంధం కొంతయినా మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపింది. అసలు జంతువులు విముక్తి గురించి కొంతయినా ఆలోచించటానికి, కొద్దిగానైనా చర్చించటానికి ఈ పుస్తకం అవకాశమిచ్చింది.యానిమల్‍ …

బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం Read More »

తెలంగాణలో బౌద్ధం

జాతిపరంగా, దేశపరంగా వాడిన ఆంధ్ర శబ్దం మొట్టమొదట తెలంగాణకే చెల్లుతుంది. ఈ అంశాన్ని వాయు, మత్స్య పురాణాలేకాక బౌద్ధవాఙ్మయం నిరూపించింది. అంతేకాదు బౌద్ధం ఆచరించిన తొలి నేలగా ఈ ప్రాంతాల చరిత్రను బౌద్ధ సాహత్యమే తొలుత తెల్పింది. దాంతో తెలంగాణ చరిత్ర క్రీ.పూ.2500 సం।। నుండే ఉనికి (రికార్డు)లో ఉందన్న అంశం నిర్ధారితమైంది. ఇది బౌద్ధం వల్ల తెలంగాణకు కలిగిన లాభం.‘‘సుత్తనిపాత’’ (పారాయణ వర్గ) ఈ ప్రాంతాన్ని ‘‘అంధక రట్ట’’గా పేర్కొంది. అస్సక, ములక రాజ్యాలు ప్రధానంగా …

తెలంగాణలో బౌద్ధం Read More »

కేరళరాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కేరళ రాష్ట్రం పశ్చిమ సముద్ర తీరాన్ని అంటుకుని యున్నది. ఈ రాష్ట్రానికి తూర్పులో తమిళనాడు మరియు ఈశాన్యంలో కర్నాటక రాష్ట్రాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో చాలా భూభాగంలో సదరన్‍ గ్రాన్యులైటు టెర్రేన్‍కు చెందిన చార్నోకైట్‍ మరియు కొండలైట్‍ గ్రూప్స్కు చెందిన శిలలు ఉన్నవి. తమిళనాడు, కర్నాటక బార్డర్‍ వద్ద పిజిసికి చెందిన నైస్‍ మరియు గ్రానైట్స్ కలవు. సముద్ర తీరానికి దగ్గరగా కన్నురూకు తూర్పులో వెంగడ్‍ గ్రూప్‍కు చెందిన మైకాశిస్ట్, క్వార్ట్జైడ్‍, కంగ్లామరేట్‍ శిలలు కలవు. కొన్ని …

కేరళరాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురవుతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణ’ శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొటీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు మానవుని స్వార్థపరత్వం ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగడం శోచనీయం.ప్రకృతి విధ్వంసంమానవుడు …

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం Read More »

మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు

ప్రదేశం: అస్సాంగుర్తింపు: 1985విభాగం: నేచురల్‍ మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం మానస్‍-బెకి నదీ తీరంలో విస్తరించి ఉంది. భూటాన్‍లోని తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాలలోని రక్షిత ప్రాంతాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ సైట్‍ ప్రక•తి అందాల్లో పర్వత ప్రాంత అడవులు, ఒండ్రు గడ్డి భూములు, ఉష్ణమండల సతత హరిత అడవులు ఉన్నాయి. ఈ సైట్‍ లో అరుదైన, అంతరించిపోతున్న జాతుల ఆవాసాలు ఉన్నాయి. భారత ఉపఖండంలోని రక్షిత ప్రాంతాలలో ఇది అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. …

మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు Read More »

అదిగదిగో… నవలోకం.. ఏ సెమీకండక్టర్స్ రంగం

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎలక్ట్రానిక్‍ గాడ్జెట్స్ లేకుండా మనం ఏ పనీ చేయలేము అనడం అతిశయోక్తి కాదేమో! కార్ల నుండి స్మార్ట్ ఫోన్ల వరకు మరియు ఎంఆర్‍ఐ స్కానర్ల నుండి పారిశ్రామిక రోబోట్ల వరకు మనం పనిచేయడానికి, ప్రయాణించడానికి, ఆరోగ్య పరిరక్షణకు, విద్యారంగ పురోగతికి.. ఇలా ప్రతిచోటా ఎలక్ట్రానిక్‍ వస్తువుల ప్రాధాన్యం విస్తరిస్తోంది. అయితే ఈ ఎలక్ట్రానిక్‍ వస్తువులు సమర్ధవంతంగా పనిచేయడానికి సెమీకండక్టర్స్ అన్న చిప్‍లు కీలకమని చెప్పవచ్చు. సెమీకండక్టర్స్ను ఎలక్ట్రానిక్‍ వస్తువుల యొక్క క్రియాత్మక …

అదిగదిగో… నవలోకం.. ఏ సెమీకండక్టర్స్ రంగం Read More »