జీదిమాజా ఒక ప్రపంచ కవి
2018 అక్టోబర్‍లో చైనాలోని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ వారి ఆహ్వానం మేరకు నేను చైనా వెళ్ళాను. 22 సాయంత్రం స్వాగత విందు (welcome Banquet) లో మొదటిసారి చైనీస్ మహాకవి జీదిమాజా (Jidi Majia)ను చూశాను. మనిషి స్ఫురద్రూపి, అందగాడు. ఆయన సాన్నిధ్యం వల్ల కడుపుకే కాదు కంటికీ విందు చేకూరినట్టనిపించింది. జీదిమాజా చైనాలోని 55 ఆదివాసీ తెగల్లో ఒకటైన ‘యీ’ తెగకు చెందినవాడు. ఆ తెగలో 90 లక్షల మంది జనాభా. ఆయన కవిత్వం 20 …



