సదర్ వేడుక సాంస్కృతిక అస్థిత్వం!
సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. నిజాం కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక అస్థిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ పండగను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ‘సదర్’ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ‘ప్రధానమైనది’ అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా …









