మంచి పని
‘‘రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు’’ అన్నాను పాలుతాగుతూ.‘‘ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్ ముందుగా చెప్పారు కదా!’’ అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.‘‘నీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘మా టీచర్ కూడా చెప్పారులే. ఒక మంచిపనిచేసి, దాని గురించి రాసి చూపించమన్నారు’’‘‘అయితే ఈ రోజే ఇప్పుడే మొదలు పెడదామా’’ పాలుతాగేసి ఉత్సాహంగా అన్నాను.‘ఊ’ …









