పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

ర్యావరణ సంక్షోభం – నైతికత

21వ శతాబ్ది ప్రారంభం నుండి మానవాళి మునుపెన్నడూ లేని విధంగా పర్యావరణ విషయంగా అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తున్నది. మానవ చరిత్రలోనే ఇవి Unprecedented గా ఉన్నాయి. ఈ సవాళ్ళన్నీ మానవ కార్యకలాపాల ద్వారా ఉత్పతన్నమైనవే. భూమిపై జీవుల, జీవరాశులు పెద్దయెత్తున అంతరింపులకు గురవుతూ వస్తున్నవి. 65 మిలియన్ల సంవత్సరాల క్రిందట డైనాసార్‍ యుగం అంతరించిన తరువాత ఇంత పెద్దమొత్తంలో జీవజాతులు అంతరించిపోవటం మొదలైంది. కొన్ని అంచనాల ప్రకారం రోజుకి వందకు పైగా ప్రాణులు (Species) అంతరిస్తున్నాయి. ఇది రానున్న రెండు దశాబ్దాలలో రెండు, మూడింతలు అవుతాయనేది అంచనా. భూమిపై జీవాన్ని నిలబెడుతున్న సహజ వనరులు – గాలి, నీరు, నేల విపరీతంగా కాలుష్యానికి గురవుతూ
ఉన్నాయి. కాలుష్యం, క్షీణతలు ప్రమాదకరమైన ఘంటికలను మోగిస్తున్నాయి. మానవ జనాభా 6 బిలియన్లు ఉండగా 2010 నాటికి అవి మరో బిలియన్‍ పెరగగలదని అంచనా వేశారు. ప్రస్తుతం 2013లో ఉన్న జనాభా ఏడు బిలియన్ల పై చిలుకు. జనాభా ఈ రకంగా పెరుగుతూ పోవడం వల్ల సహజ వనరులు తరిగిపోవడం, క్షీణించడం రెండు మూడింతలు పెరుగుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. విషపదార్థాలు విపరీతంగా పెరిగి భవిష్యత్తు తరాలను మహమ్మారులకు గురిచేసే అవకాశాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచం అటవీ ప్రాంతాలు, అడవులు, వ్యవసాయ భూములు, పర్వతాలు, పచ్చిక బయళ్లు వృద్ధి చేయబడుతున్నాయి. ఓజోను పొర క్షీణించడంతో గ్రీన్‍హౌజ్‍ వాయువుల ప్రభావం పెరిగింది. మానవ కార్యకలాపాలు వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. అసలు భూ వాతావరణానికే ముప్పు ఏర్పడింది.


మన సంస్కృతిలో ఉన్న ధోరణి ఏమంటే ఈ సమస్యలన్నీ కేవలం సైంటిఫిక్‍, సాంకేతికం లేదా రాజకీయ సమస్యలుగానే చూడటం అయితే ఇవి శాస్త్ర సమస్య, సాంకేతిక, రాజకీయ సమస్యలు మాత్రమే కావు. పర్యావరణ, ఇకోలాజికల్‍ వివాదాలు కొన్ని ప్రాథమిక మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మనం మానవులుగా వేటికీ విలువను ఇస్తున్నాం. అసలు ఏ తరహా మనుషులం మనం. ఎటువంటి జీవితం జీవించాలి, ప్రకృతిలో మనిషి స్థానం ఏమిటి? అసలు ఏ తరహా ప్రపంచంలో మనుషులు వృద్ధి చెందాలి అనే వాదోపవాదాలు కూడా ఉన్నాయి. పర్యావరణ సమస్యలు ఎథిక్స్కు సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించిన మౌలిక ప్రశ్నలను లేవనెత్తు తున్నాయి.


ఎన్విరాన్‍మెంట్‍, ఎకాలజీకి సంబంధించి ఆసక్తికరమైన పరిశోధనలు, తాత్త్విక సిద్ధాంతాలు రూపొందాయి. చాలామంది తాత్వికులు పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ సిద్ధాంతాలు, సూత్రాలు చాలవని గుర్తించారు. దీనికి ప్రతిస్పందనగా తాత్త్వికులు సంప్రదాయ భావనలను సూత్రాలను విస్తరించడం మొదలు పెట్టారు. దీనివల్ల అవి పర్యావరణ పరంగా ప్రాసంగికంగా ఉంటాయని భావించారు. చాలా మంది తాత్త్వికులు నైతిక విస్తరణవాదం తగినది కాదని భావించారు. తాత్త్విక ప్రతిస్పందనగా పర్యావరణ సమస్యలను, వివాదాలను పరిష్కరించలేదని భావించారు. చాలామంది తాత్త్వికులుthical theories సూత్రాలు ప్రపంచ దృక్పథంలో భాగంగా చూశారు. పర్యావరణ, ఎకలాజికల్‍ విధ్వంసానికి అవే కారణం అని తలచారు. వారి దృష్టిలో కావలసింది ఏమంటే adical philosophical approach, అవి meta physics, epistemological, political ethical మొదలైన వాటిని పునరాలోచిం చాలని యోచించారు. ఈ సందర్భంలో environmental philosophyగా గుర్తించారు. మనం రెండు విషయాలను గురించి పట్టించుకోవాలి. ఒకటి Bio centrism ఇది అన్ని ప్రాణులకు నైతికత ఉంటుంది. రెండోది ecocentrismసంప్రదాయ పర్యావరణ నైతిక ఆలోచన ధార నుండి కొంత ముందుకు జరిగి సమ్యగ్‍ దృక్పథాన్ని గూర్చి ఆలోచిస్తుంది.
1962లో రాచెల్‍ కార్సన్‍ ‘సైలెంట్‍ స్ప్రింగ్‍’ గ్రంధం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. డిడిటి ఇతర రసాయన క్రిమిసంహారకాల తీవప్రభావం తెలియవచ్చింది. విచక్షణలేని వీటి వాడకం ముఖ్యంగా మరణంలోకి, విషతుల్యతలోకి తీసుకువెళ్లి ‘వసంతం గొంతును’ నిశ్శబ్దంలోకి నెడుతుందని భావించింది. ఈ పుస్తకం రసాయన కాలుష్యం గురించి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల దృక్పథాలపై ప్రభావం చూపింది.


వ్యవసాయం మొదలైనప్పటి నుండి కీటకాలను నియంత్రించేందుకు రసాయన పదార్థాలు వాడినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం రసాయన కీటకనాశినులను కనుగొనడం, ఉత్పత్తిచేయడం వాడకం అనేవి విపరీతంగా పెరిగాయి. పెస్టిసైడ్‍ అంటేనే అవాంఛిత జీవరూపాన్ని సంహరించే పదార్థం అని అర్థం. Insecticideలు కీటకాలను, హెర్బిసైడ్‍లు మొక్కలను, ఫంగిసైడ్‍లు ఫంగిని లక్ష్యంగా చేసుకొని సంహరిస్తాయి. జనాభా పెరుగుదలను బట్టి వ్యవసాయం మీద డిమాండ్‍ పెరిగింది. ఇదే సమయంలో రైతులు తగ్గిపోయారు. అవి వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు తీవ్రమైన వత్తిడిని కలగజేసాయి. పంటనష్టం జరగకుండా పెస్ట్లు నియంత్రించబడటం విత్తిన పంటమీద 37 శాతం పెరిగింది.


సైలెంట్‍ స్ప్రింగ్‍ అనే గ్రంథం వెలువడకముందు రసాయన కీటకనాశినుల గురించి ఒకే ప్రశ్న సాధారణంగా అడగబడేది. ఈ ప్రశ్నను అటు శాస్త్రవేత్తలు, ఇటు సాధారణ ప్రజానీకం ఆ కీటక నాశినులు ప్రభావం చూపుతాయా? మనుషులకు, పంటకు హాని చేయకుండా అవి కీటకాలను నిర్మూలిస్తాయా అనే ప్రశ్న వచ్చేది. కార్బన్‍ గ్రంథం తరువాత దీర్ఘకాల ప్రభావాలు, పర్యవసానాలతో పాటు, రాజకీయ, ఎథికల్‍ అంశాలు క్రిమిసంహారకాల ఉపయోగం గురించి ముందు వరసలోకి వచ్చి చేరింది.
తొలుదొల్త క్రిమిసంహారకాల వల్ల లాభాలు స్పష్టంగా తెలిశాయి. డిడిటి లాంటి కీటకనాశనులు ఇతర క్లోరినీకరించిన హైడ్రోకార్బన్లు దోమలను ఇతర క్రిమి కీటకాలను, సంహరించగలిగేవి. మలేరియా, టైఫస్‍, బ్యూటోనిక్‍ప్లేగ్‍ లాంటి వ్యాధులను కలిగించే కీటకాలను నిర్మూలించగలిగేవి. క్రిమి సంహారకాల పంటనష్టాన్ని తగ్గిస్తాయి. క్రిమిసంహారకాలు ప్రభావపూరితమైనవి. రైతులకు ధరలు పెంచకుండానే డిమాండ్‍ను అందుకోవడానికి ఉపకరించాయి. ఆరోగ్య, వ్యవసాయ సంబంధ ప్రశ్నలన్నిటికీ క్రిమి సంహారకాలు ఆర్థికంగా, సాంకేతికంగా ఉపయోగకరం అనేదే దృష్టి.


అయితే ఇతర ప్రశ్నలు ముఖ్యంగా ఎకోలాజికల్‍, పొలిటికల్‍, ఎథికల్‍ మొదలైనవి కనీసంగా కూడా అడగబడేవి కావు. సైలెంట్‍ స్ప్రింగ్‍ శాస్త్రవేత్తలను, పరిశ్రమలను, రైతులను, జనసామాన్యాన్ని ఒక విషయంగా సవాలు చేసింది. దీర్ఘకాలం క్రిమిసంహారకాల వాడ కం వలన జరిగే నష్టం గురించిన ప్రశ్నలను లేవనెత్తింది. ఆహారపు గొలుసులో ఇతర జీవరాశుల మీద క్రిమిసంహారకాల ప్రభావం ఎటువంటిది? అనే ప్రశ్నలవి. రక్షణస్థాయి, రిస్క్స్థాయిని ఎవరు నిర్ణయించాలి. లాభాలు రిస్క్తో సమానమైనవేనా అనేది పెద్ద ప్రశ్న.


పర్యావరణంలో ఈ రసాయనాలు కరిగిపోవడాన్ని, కలిసిపోవడాన్ని ప్రతిఘటిస్తాయి. అట్లాంటివి సుదీర్ఘకాలం తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అట్లాంటి వాటిలో డిడిటి ఒకటి. ఇది నీటిలో కరగదు. కొవ్వులో కరుగుతుంది. ఇది ఎకోసిస్టిమ్‍లో నిలిచి ఉంటుంది. జీవుల్లోని ఫాటీటిన్యూల్లో ఇది మరింత సాంద్రతర మవుతుంది. పెరుగుతుంది, ఫలితంగా కొద్దిపాటి డిడిటి నీళ్లలో ఉంటే Biological amplification అనే పక్రియ ద్వారా micro organismýË concentrate అవుతుంది. అది planktonలో ఉంటుంది. plankton ను ఆహారంగా తీసుకునే చిన్న చేపల్లో అది గాఢమవుతుంది. ఇక అది ఆహారపు గొలుసులో ముందుకు పోయే కొద్దీ దాని సాంద్రతను పెంచుకుంటూ పోతుంది. రెండవ ప్రపంచయుద్ధానంతర దశాబ్దాలలో క్రిమిసంహారకాల వాడకం నాటకీయంగా పెరిగింది.


ఇతర ప్రాణులకు పొంచి ఉన్న హాని మాత్రమే కాదు. ఆధారాలు చూపుతున్న వాస్తవం ఏమంటే, సుదీర్ఘ కాలం పంటనష్టం జరగకుండా వాడే పెస్టిసైడ్స వల్ల కూడా మనుషులకు, మానవేతర ప్రాణులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. 1940ల నుంచి పదింతలుగా పెరిగిన క్రిమిసంహారకాల వాడకం వల్ల మొత్తంమీద పంటనష్టం నివారింపబడింది. ఇదెలా జరిగిందో తెలియాలంటే మరికొన్ని వాస్తవాలను మనం పరిశీలించాలి.


మొదట కొన్ని రకాల క్రిమి సంహారకాలు కొన్ని కీటకాలను వాటి సహజ శత్రువులను చంపకుండానే సంహరించగలవు. aphidsను సంహరించడానికి ఉద్దేశించిన insecticide ladybugsను preying mantisను చంపగలవు. అయితే సాధారణంగా ఇవి Aphids మీద ఆధారపడి జీవిస్తాయి. సహజమైన శత్రువులు లేకుండా మనగలిగే Pestsత్వరితంగా పునరుత్పత్తి చేయగలుగు తాయి. ఇక రెండవది మనగలిగిన సూక్ష్మజీవులు ఉత్పత్తిచేసే జీవులు మరింతగా పెస్టిసైడ్స్పట్ల resistantగా ఉంటాయి. కొంత అక్కడక్కడా జన్యుపర అవకాశాల వల్ల కొన్ని రకాల జీవులు కొన్ని ప్రత్యేక పెస్టిసైడ్‍ పట్ల సహజమైన రెసిస్టెన్స్ను కలిగి ఉంటాయి. ఈ జీవులు తక్కువ రెసిస్టెంట్‍గా ఉంటే వాటి సంతతిని త్వరితంగా వృద్ధి చేస్తాయి. అలాగే సహజ శత్రువులను అవి సంహరిస్తాయి. కొద్ది సమయంలోనే అవి అంటే కొద్ది రోజుల్లోనే అవి జన్యుపర నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పెస్టిసైడ్‍ వీటిపై ఏ ప్రభావమూ చూపలేదు. ఫలితంగా పెస్టిసైడ్‍ సాంద్రతను పెంచాలి. ప్రీక్వెన్సీని పెంచాలి. లేదా కొత్త కెమికల్స్ వైపు మరలాలి. తిరిగి క్రమం మళ్లీ మొదలవుతుంది.


క్రిమి సంహారకాలను వాటిని ఉపయోగాలను సమర్థించేవారు రసాయన, వ్యవసాయ పరిశ్రమల వారు ఇదొక శాస్త్ర, సాంకేతిక సవాలుగానే పరిగణన చేస్తారు. నూతన రసాయన క్రిమి సంహారకాలను వృద్ధిచేస్తే అవి సురక్షితమైనవేనా, మనిషి ఉపయోగానికి? క్రిమి కీటకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సమర్థవంతమైనవేనా అని అడుగుతారు.


ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, ఇన్ని సవాళ్లు ఎదురవుతూ ఉండగా మానవాళి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. అయితే మనం తగిన సముచిత నిర్ణయాలు తీసుకోవడాన్ని మనం ఎట్లా మొదలు పెడతాం అనేది ప్రశ్న. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు సమస్యలన్నీ మనకు పూర్వం ఉన్న తరాలు తీసుకున్న నిర్ణయాల ఫలితాలే. నిజానికి చాలా నిర్ణయాలు లాభదాయకమైన ఫలితాలనే వారికి, మనకూ ఇచ్చి ఉంటాయి. అయితే అవి మహా విధ్వంసభరిత ఫలితాలను కూడా సమంగానే ఇచ్చాయి. గతంలో తీసుకున్న నూర్వతరాల నిర్ణయాల ఫలితాలనే మనం అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుతం మనం ఏ విధంగా సరైన నిర్ణయాలు తీసుకోగలం. అవి పూర్వ నిర్ణయాల వలనే అస్పష్ట పర్యవసానాలను కలిగి ఉండవనే హామీ ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టే మనం నిర్ణయాలు తీసుకునే ముందు ఒక అడుగు వెనక్కి వేసి నిర్ణయం తీసుకునే క్రమాన్ని పరిశీలించాలి. అప్పుడు మాత్రమే అది హేతుబద్ధంగా ఉంటుంది. ఎన్నో విధాలుగాPhilosophical ethics అటువంటిదే. Philosophical ethics లాగా Environmental ethics మనం కలిగి ఉండాలి. ఇది రెండు స్థాయిల్లో జరగాలి. ఆచరణ స్థాయిలో నిర్ణయించేటప్పుడు మనం ఏం చేయాలి? మనమెలా జీవించాలి అనేవి ముఖ్యంగా అయితే ఏం చేయాలనేది ఎట్లా నిర్ణయించాలి. దేనిని విలువగా పరిగణించాలి. అనేది కూడా ముఖ్యమే.


పాశ్చాత్య తత్వశాస్త్రం 2,500 సంవత్సరాల క్రిందట సోక్రటీస్‍ ప్రశ్నతో మొదలైంది. ఎధీనియన్‍ సమాజాన్ని, ఆ సమాజంలో వ్యక్తి పాత్రను ప్రశ్నించడంలో మొదలైంది. “we are dealing with no small thing” అని అన్నాడు సోక్రటీసు. అయితే “but with how we ought to live” అన్నాడు.


పర్యావరణ సమస్యలు కూడా అట్లాంటివే. మనకు thical responsibility ఏమైనా ఉందా? మన చుట్టూ ఉన్న వివిధ జీవ రూపాలను కాపడటం, పరిరక్షించటం అనే విషయంగా బాధ్యతలను స్వీకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కొన్ని రకాల క్రిములను పెస్టస్గా నిర్వచించించి వాటిని నిర్మూలించుటలో ఏదైనా దోషముందా? మనం చర్యలో అక్కడ ఉన్నా తాత్త్విక అంచనాలు ఇందులో మిళితమైన ఉన్నాయి. పెస్టిసైడ్స్ వాడకముందే సురక్షిత మైనవని రుజువైందా లేక ప్రమాదం ఉందని భావించిన వారిలో ఈ భావం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలోనే ఎథిక్స్కి సంబంధించి, పొలిటికల్‍ ఫిలాసపికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి.


పర్యావరణ, స్పృహ, చైతన్యాలు ఎందుకు కావాలని ఈ కవులు భావించి ఉంటారనే ప్రశ్న ఎలాగూ కలుగుతుంది. పౌరులను సాధికారం చేయటం వీరి లక్ష్యంగా భావించవచ్చు. పౌరులు చైతన్యవంతులు కావటం వల్ల వారు పూర్తిస్థాయి ప్రజా విధానాలలో విమర్శనాత్మకంగా పాల్గొంటారు, చర్చిస్తారు. తాత్త్విక విషయాలలో అవగాహన వల్లగానీ, విషయాల పట్ల ఎరుకలో కలిగే చర్చవల్లగాని దిశానిర్దేశంలో ఒక అడుగు వేయడానికి దోహదపడుతుంది.


రాచెల్‍ కార్సన్‍ రచన సూచించేదేమిటి? పర్యావరణ సమస్యలను కేవలం సాంకేతికమైన వాటిగా పరిగణించి పరిష్కరించడం కోసం ఎదురుచూస్తున్నప్పుడు లేదా ఒక ప్రత్యేక అనుశాసనం ఈ సమస్యలకు అవసరం అని భావించినప్పుడు మనం సాహసం చేస్తాం. అసలు పర్యావరణ సమస్యలు ఎప్పుడూ పరిమితమైనవికావు. వాటికి ప్రత్యేకమైన సరిహద్దులు కూడా ఏమీలేవు. ఒక ప్రత్యేక అనుశాసనానికే సంబంధించినవి కావు. ఉదాహరణకు క్రిమి సంహారకాల కాలుష్యంలో వ్యవసాయంతో పాటుగా జీవశాస్త్రం, వైద్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు, న్యాయశాస్త్రం మొదలైనవి ఇమిడి ఉన్నాయి. ఇలాగే సంబద్ధ హైపోక్సియా వివిధ అనుశాసనాలతో ముడిపడి ఉంది. అయితే పర్యావరణ సమస్య ఏదైనా విలువలకు సంబంధించి ప్రశ్నను లేవనెత్తకుండా విడిగా ఉండదు. అయితే సాంకేతి, శాస్త్ర సంబంధ పరిష్కారాలు తరచుగా అవి వేటిని పరిష్కరించాయో అంతకుమించి కొత్త సమస్యలకు తలుపులు తెరిచాయి.


శాస్త్ర, సాంకేతిక విషయాల మీద అతిగా ఆధారపడటంలో ఎప్పుడూ ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. సైన్సు ఎప్పుడూ చాలామంది భావించినట్లు value neutralగా ఉండదు. మన సంస్కృతి సైన్సుకు అంతిమంగా అధికారం ఉందని గాఢంగా నమ్ముతుంది. జ్ఞానం, సత్యం విషయాలలో అంతిమ ఆధిపత్యం శాస్త్రానికే ఉంటుందని విశ్వస్తుంది. ఇది ఎంత గాఢంగా ఉండి, పరిశీలనను చేయకుండా విశ్వసిస్తే అంతగా అది సాంస్కృతిక పురాగాథకు దారితీస్తుంది. శాస్త్రసంబంధ వస్తుగతమైన mythప్రకారం మన నమ్మకాలు, అభిప్రాయం – వ్యక్తిగత స్వీయం arbitary biased ఇవి సైన్సు ద్వారా validate చేయబడాలి. ఇది ముఖ్యమైనదే అయినప్పటికీ ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. శాస్త్రానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. అది సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిష్కరించడానికి ఉపకరిస్తుంది. నిజానికిది శాస్త్ర సాంకేతిక విషయాలను చర్చించడానికి స్థలం కాదు. అనేకాంశాలు మనం పూర్తిగా సైన్సు, టెక్నాలజీల వైపు పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం తిరిగితే విరామ వస్తుంది.


కొన్ని రకాలుగా సైన్సు అంటే మరేదీ కాదు వివరణతో కూడిన సంక్షిప్త, నమోదు చేసిన జ్ఞానమార్గం. సైన్సు డిమాండ్‍ చేసే విషయం ఒకటుంది. అది అంచనాలను మినిమైజ్‍ చేస్తుంది. పక్షపాతాన్ని పరిహరిస్తుంది. ఫలితాలను పరిశీలిస్తుంది. ముగింపులను నిర్ణయాలను పరిమితం చేస్తుంది.
ఆధారం దేనిని చూపుతుంది దానికి సంబంధించింది. ఈ అర్థంలో శాస్త్రీయ పద్ధతి నిజమైన ఎథిక్‍ అని నిష్పాక్షిక, కచ్చిత, హేతుబద్ధ ఫలితాన్ని ఇస్తుంది. అది ఇచ్చే ఫలితంలోని హేతుబద్ధతను మనం నమ్మవచ్చు.


(ఈ అధ్యాయంలోని మిగతా భాగం వచ్చే సంచికలో)
-డా।। ఆర్‍. సీతారామారావు, ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *