- ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్
- పిల్లలను భావి, భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం :
- పాఠశాల వైస్ చైర్మన్ ప్రార్దన మణికొండ
- ఘనంగా ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ 39వ వార్షికోత్సవం
భావి, భారత పౌరులుగా తీర్చిదిద్దబడే ఏకైక ప్రదేశం పాఠశాల. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని అభివృద్ధిపథంలో నడిపించేదే విద్యాలయం. ఎంతో మంది విద్యార్థులను ప్రగతిపథంలో నడిపి దేశ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ 2019 నాటికి 39 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. పాఠశాల 39వ వార్షికోత్సవం నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్ లలితకళాతోరణంలో నవంబర్ 30న ఘనంగా జరిగింది. పాఠశాల వైస్ చైర్మన్ ప్రార్దన మణికొండ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ స్టేట్ మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్ ఏకే.ఖాన్, విశిష్ట అతిథులుగా మూవింగ్ ఇమేజస్ ఫౌండర్ అపరాజిత రాయ్ సిన్హా, శ్రీ త్యాగరాజ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్స్‌పాల్ రాఘవ రాజ్ భట్, ఆకృతి కథక్ కేంద్ర డైరెక్టర్ మంగళ భట్, రోహిణి చింత, పాఠశాల చైర్మన్ మణికొండ వేదకుమార్, డైరెక్టర్ కట్టా ప్రభాకర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శి : మాజీ ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్
విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శి అని, పిల్లల ఎదుగుదలకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ స్టేట్ మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్ ఏకే.ఖాన్ పేర్కొన్నారు. నేటి విద్యావిధానంలో నైతిక విలువలు ఎంతో ముఖ్యమని, వాటితోపాటు ప్రతిభకు పట్టం కట్టాలన్నారు. పిల్లలు భావి, భారత పౌరులుగా ఎదిగేందుకు పాఠశాలలోని ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి వారిని సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలన్నారు.

పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు : శ్రీ త్యాగరాజ గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రిన్స్‌పాల్ రాఘవ రాజ్ భట్
పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులని రాఘవ రాజ్ భట్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను డాక్టర్ లేదా ఇంజినీరింగ్ చదవాలని ఒత్తిడి తీసుకురావద్దని, వారి అభిష్టం మేరకు నిర్ణయం తీసుకో వాలన్నారు. నిత్యం పాఠశాలలో పెయింటింగ్, కల్చర్, మ్యూజిక్, డ్యాన్స్ మొదలైనవి నిర్వహిం చడం గర్వకారణం అన్నారు. పాఠశాలలో పిల్లలకు ఒత్తిడి లేకుండా విద్య నిర్వహించ డానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి : ఆకృతి కథక్ కేంద్ర డైరెక్టర్ మంగళ భట్
భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, మన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా పెద్దపీట వేయాలని ఆకృతి కథక్ కేంద్ర డైరెక్టర్ మంగళ భట్ అన్నారు. మ్యూజిక్, డ్రామా, పెయింటింగ్ విద్యార్థులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని చెప్పారు.
పిల్లలను నిత్యం ప్రోత్సహించాలి : అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిని చింత
పిల్లలతో ఉపాధ్యాయులు ఎల్లప్పుడు మాట్లాడుతూ ఉండాలని, ఉపాధ్యాయులు ఎల్లప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ పిల్లలను నిత్యం ఎంకరేజ్ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిని చింత అన్నారు. పిల్లలను ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పిల్లలతో ఎక్కువగా మాట్లాడించాలని, వాళ్ల అభిప్రాయాలు గౌరవించాలన్నారు. డ్రామా, పెయింటింగ్, కమ్యూనికేషన్, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కరికులమ్‌లో ఉండాలన్నారు. టీమ్ వర్క్ ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్యా విధానం అందించాలన్నారు.

ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రస్థానం అమోఘం : స్కూల్ వైస్ చైర్మన్ ప్రార్దన మణికొండ
ఆక్స్ఫర్డ్ పాఠశాలను 1981లో 240 మంది విద్యార్థులతో స్టేట్‌బోర్డులో భాగంగా ప్రారంభించారని, ప్రస్తుతం సీబీఎస్సీ, స్టేట్ బోర్డు రెండూ కలుపుకొని 2600 మంది విద్యార్థులు చదవడం గర్వకారణమని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ వైస్ చైర్మన్ ప్రార్దన మణికొండ పేర్కొన్నారు. అలూమ్నీ బాడీతో కలుపుకుంటే ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10 వేల మందికిపైనే చదివినట్లు చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆక్స్ఫర్డ్ పాఠ శాలకు ఆరవ స్థానం రావడం సంతోషదాయకం అన్నారు. విద్యావిధానంలో విప్లవం తీసుకురావడానికి ఆక్స్ఫర్డ్ పాఠశాల నిరంతరకృషి చేస్తూ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందన్నారు.
ఆక్స్‌ఫర్డ్‌లో స్టీమ్..:
పాఠశాల వార్షికోత్స వంలో భాగంగా డిసెంబర్ 1న (రెండవ రోజు) హిమాయత్ నగర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్ అండ్ మ్యాథ్స్) అనే అంశంపై ఎగ్జిబిషన్ జరిగింది. పాఠశాల వైస్ చైర్మన్ ప్రార్దన మణికొండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ అభివృద్ధి వైస్ చైర్మన్ రఘువీర్ పాల్గొన్నారు. జేఎన్ఎఫ్ఏయూ వీసీ ప్రొ.ఎన్.కవిత దర్యాని రావు, ప్రభుత్వ ఎస్సీఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి పాల్గొన్నారు.
పిల్లల్లో ఎంతో మేధస్సు ఉంది.. దాన్ని వెలికితీయాలి : తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ అభివృద్ధి వైస్ చైర్మన్ రఘువీర్
పిల్లల్లో ఎంతో మేథస్సు దాగి ఉందని, దాన్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ అభివృద్ధి వైస్ చైర్మన్ రఘువీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు తయారు చేసిన పలు ప్రాజెక్టు నమూనాలను ఆయన స్వయంగా పరిశీలించి, వారిని అభినందించారు.

ప్లాస్టిక్ వల్ల సమాజానికి ఎంతో అనర్థం : ప్రభుత్వ ఎస్సీఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి
ప్లాస్టిక్ వల్ల సమాజానికి ఎంతో అనర్థం ఉందని, సమాజాన్నే సవాల్ చేసేస్థాయికి ప్లాస్టిక్ చేరడం బాధాకరం అన్నారు. స్టీమ్ ప్రాజెక్టులో భాగంగా పిల్లలు తయారు చేసిన విభిన్నమైన ప్రాజెక్టు నమూనాలు ఎంతో వైవిధ్యంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మన భూమిని ఏ విధంగా సంరక్షించుకోవాలో ప్రాజెక్టు రూపంలో పిల్లలు మంచి మెసెజ్ ఇవ్వడం అభినందనీయం అన్నారు.
భూ కాలుష్యంను తగ్గించే విధంగా నేటి చదువులు ఉండాలి : జేఎన్ఎఫ్ఏయూ వీసీ ప్రొ.ఎన్.కవిత దర్యాని రావు
పాఠశాలలో పిల్లలు ఎంతో అద్భుతంగా ప్రాజెక్టులను తయారు చేయడం అభినందనీయం అని జేఎన్ఎఫ్ఏయూ వీసీ ప్రొ.ఎన్.కవిత దర్యాని రావు అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు భూకాలుష్యం నుండి రక్షించే విధంగా విభిన్నంగా చదువులు చదవాలన్నారు.
స్టీమ్ ఎగ్జిబిషన్ ఎంతో ఆకట్టుకుంది : దక్కన్‌లాండ్ సంపాదకులు, పాఠశాల చైర్మన్ మణికొండ వేదకుమార్
ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజి నీరింగ్, ఆర్ట్ అండ్ మ్యాథ్స్ అనే అంశంపై స్టీమ్ ఎగ్జిబిషన్లో భాగంగా పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులు ఎంతో నిర్మాణాత్మ కంగా ఉన్నట్లు స్కూల్ కర స్పాండెట్ సయ్యద్ సాబీర్ తెలిపారు. ఇలాంటి అద్భుత మైన ప్రాజెక్టుల వల్ల పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. ప్రాజెక్టులు ఎలా తయారు చేయాలో చిన్నప్పుడే బీజాలు పడటం వల్ల వాళ్లు భవిష్యత్‌లో గొప్పవాళ్లుగా ఎదిగే అవకాశం ఉందన్నారు.
అబ్బురపరిచిన నృత్యాలు :
పర్యావరణాన్ని రక్షించాలని, కాలుష్యాన్ని నివారించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతూ పిల్లలు చేసిన నృత్యాలు ఎంతో వైవిధ్యంగా, విజ్ఞానభరితంగా ఉన్నాయి. పిల్లల మేథాశక్తికి పదునుపెట్టి వారిలో మానసిక వికాసాన్ని కల్పించే విధంగా పిల్లలు చేసిన నృత్యాలు ఎంతో ఆనందభరితంగా సాగాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కట్టా ప్రభాకర్, ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రిన్సిపాల్స్ రామాంజుల, ఫమీద హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్స్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బాల్‌రాజ్, చిదంబరం, బేగ్, రాజ్‌కుమార్, సయ్యద్ ఖైజర్ పాల్గొన్నారు.
– కట్టా ప్రభాకర్,
ఎ : 8106721111