శిల్పి చెక్కిన సౌందర్యం

చెక్క, రాగి, ఇనుములాంటి పదార్థాలకు ప్రాణం పోస్తున్న శివరామాచారి


ఆ శిల్పాలు నాట్యం చేస్తాయి.. ఒక శిల్పంతో ఇంకో శిల్పం మాట్లాడుతుంది. జీవంలేని వస్తువులు ప్రాణం పోసుకొని జీవిస్తాయి. ఎందుకు పనికిరాని ముడి వస్తువులు సైతం ప్రఖ్యాత శిలా శిల్పంలా తయారవుతాయి. కళారూపాలు వైవిధ్యభరితంగా చూపరులను ఆకట్టుకుంటాయి. విభిన్నమైన శిల్పి చెక్కిన సౌందర్యం మంత్ర ముగ్దులను చేస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలకు చిరునామాగా నిలుస్తున్నారు శివరామాచారి. తన అమ్ముల పొదిలో ఆయుధమైన స్కల్ప్చర్‍ స్పేస్‍తో శిలా ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు.


తండ్రి స్ఫూర్తితో శిల్పకారుడు :
శివరామాచారి స్వగ్రామం మహబూబ్‍నగర్‍ జిల్లా తెలకపల్లి.1979లో జన్మించారు చారి. ఆయన తండ్రి జగదీశ్వరాచారి దేవుళ్ల ప్రతిమలను రూపొందించేవారు. నాన్న స్ఫూర్తితో శివరామాచారి శిల్పి కావాలనుకున్నారు. బీకాం చదివే రోజుల్లోనే విరిగిపోయిన చెట్టుకొమ్మను తెచ్చి గిరిజన మహిళా రూపాన్ని మలిచారు. తన సృజనాత్మకతకు బీకాం తగదని, దాన్ని మధ్యలోనే వదిలేసి బీఎఫ్‍ఏలో చేరారు. ఇందులో కళారూపాలను సబ్జెక్టుగా ఎంపిక చేసుకొని తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్నారు. తర్వాత సెంట్రల్‍ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. ఈ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అధ్యయనం చేసి నూతన భవిష్యత్‍కు బాటలు వేయాలనుకున్నారు.


హైదరాబాద్‍ రాజేంద్రనగర్‍లో స్టూడియో :
2005లో రాజేంద్రనగర్‍లో స్కల్ప్చర్‍స్పేస్‍ పేరుతో స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. టెర్రకోట మట్టితో వివిధ రూపాలను మలిచి ఔరా అనిపించారు. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడమే ఆయన నైజం. మొదట ఏ పని అయినా స్కెచ్‍ గీసుకొని, ఆ తర్వాత బంకమట్టితో ఆకృతులను రూపొందిస్తారు. లోహాలతో కళాకృతులు చేయడం తేలికైన పనేం కాదంటారాయన. ఏ రూపానికి ఏ పదార్థం వాడాలో తెలిసుండాలంటారు. చూసే హృదయాన్ని బట్టే ఆయా రూపాల్లో జీవం ఉట్టిపడుతుందంటున్నారు.ఫైబర్‍తో కళాకృతులు తయారు చేయడానికి నెలరోజులు పడితే, రాగితో తయారు చేయడానికి నాలుగు నెలలు పడుతుంది. దీనికి సహనం చాలా ముఖ్యం అంటారాయన. మట్టి, చెక్క, ఫైబర్‍గ్లాస్‍, రాగి, ఇనుములాంటి పదార్థాలకు జీవంపోసి మనుషులతో అనుబంధాన్ని చూరగొనేట్లు చేస్తున్నారు శివనారామాచారి.


బోధన :

 • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍లో 2004 నుండి 2007 వరకు డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ స్కల్‍ప్చర్‍ అండ్‍ పేయింటింగ్‍పై బోధన చేశారు.
 • ఓక్రీడ్జి ఇంటర్‍నేషనల్‍లో టెడ్‍ఎక్స్ టాక్స్ పేరుతో స్కూల్‍లో ఐన్‍స్టీన్‍ క్యాంప్స్ 2017లో పాల్గొన్నారు.


ఎడ్యుకేషన్‍ :

 • 2004లో మాస్టర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (స్కల్‍ప్చర్‍) ఎస్‍.ఎన్‍.స్కూల్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, యూనివర్సిటీ ఆఫ్‍ హైదరాబాద్‍
 • 2002లో బ్యాచిలర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (స్కల్‍ప్చర్‍) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‍.

సోలో షోలు :

 • రీ ఫైండింగ్‍ టెడ్‍ఎక్స్ హైదరాబాద్‍ 2018, 2010లో
 • మెల్టింగ్‍ ది కాస్మోస్‍, సోలో షో కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍ 2013
 • మీడియం అండ్‍ ది మెస్సెజ్‍, సోలో షో కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍ 2010


గ్రూప్‍ షోలు :

 • ట్రెండింగ్‍ ట్వీటీస్‍ గ్రూప్‍ షో, ఫోరం ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్‍ 2018
 • సాండ్స్ ఆఫ్‍ టైమ్‍ గ్రూప్‍ షో, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍ 2018
 • ఆర్టస్ ఇన్‍ స్పేసెస్‍ గ్రూప్‍ షో, తాజ్‍ ఫలక్‍నూమా ఫ్యాలెస్‍, హైదరాబాద్‍ 2018
 • డైమెన్సియన్స్ గ్రూప్‍ షో, శ్రిష్టి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍, 2017
 • నౌవేవ్‍ 8×12 ఆర్గనైజ్‍డ్‍ బై కోల్‍ గ్రూప్‍. స్టేట్‍ గ్యాలరీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్ట్, హైదరాబాద్‍. 2017
 • ట్రెండింగ్‍ ట్వీట్స్ టూ మ్యాన్‍ షో, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍
 • 2016 ఇన్‍బాక్స్ ఆర్గనైజ్‍డ్‍, శ్రిష్టి ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్‍, 2015 రీకాల్‍. టూ మ్యాన్‍ షో ఫోరం ఆర్ట్ గ్యాలరీ చెన్నై, 2014.
 • హైదరాబాద్‍ ఆర్ట్ ఫెయిర్‍, ఆర్గనైజ్‍డ్‍ ట్రాన్స్పరెంట్‍ ఇనిష్‍యేటివ్‍ గ్రూప్‍, హైదరాబాద్‍ 2014.


ఆర్ట్ క్యాంప్స్ :

 • ఆర్ట్ తెలంగాణ, ఆర్టిస్ట్ క్యాంప్‍ ఆర్గనైజ్‍డ్‍ తెలంగాణ ట్రస్ట్, హైదరాబాద్‍, 2014.
 • ట్రెడిషనల్‍ అండ్‍ మోడ్రన్‍ స్కల్‍ప్చర్‍ క్యాంప్‍ – 2012. శిల్పారామం, వాకలాపుడి, కాకినాడ, ఆంధప్రదేశ్‍.
 • కళాకృతి ఆర్ట్ క్యాంప్‍. ఆర్గనైజ్‍డ్‍ ఆర్ట్ గ్యాలరీ. 2010.


ఆర్ట్ వర్క్ షాప్స్ :

 • స్కల్‍ప్చర్‍ వర్క్షాపు కావా ఫైన్‍ ఆర్ట్ కాలేజీ మైసోర్‍, 2008
 • ఇంటర్‍నేషనల్‍ స్కల్‍ప్చర్‍ వర్క్షాపు ప్రిట్జ్ బ్యాక్‍, జర్మనీ, ఇటలీ.


ప్రతిభా పురస్కారం :

 • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రతిభా పురస్కారం 2016గాను ఎంపిక చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు.
 • ఏపీ ప్రభుత్వం నుండి 2011లో ఉగాది పురస్కారం.
 • ఏపీ స్టేట్‍ లెవల్‍ 8వ ఎగ్జిబిషన్‍లో క్యాష్‍ అవార్డు. ఆర్గనైజ్‍డ్‍ తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍
 • 2003లో హైలీ కమాండేబుల్‍ సర్టిఫికెట్‍, ఆర్గనైజ్‍డ్‍ హైదరాబాద్‍ ఆర్ట్ సొసైటీ. హైదరాబాద్‍
 • 2002లో 6వ ఏపీ స్టేట్‍ లెవల్‍ ఎగ్జిబిషన్‍ క్యాష్‍ అవార్డు. ఆర్గనైజ్‍డ్‍ తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍.
 • కాగా 2002-2004 ప్రాంతంలో స్కాలర్‍షిప్‍ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం అందజేసింది.


– అనిల్‍
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *