సుస్థిరమైన సమాజ అభివృద్ధిలో సాహిత్యం, కళల కీలక పాత్ర

  • సినిమాలు నిజజీవితాన్ని ప్రతిబింబించాలి – ప్రముఖ సినీ దర్శకులు ఆదూర్‍ గోపాలకృష్ణన్‍
  • ఘనంగా ముగిసిన హైదరాబాద్‍ సాహితీ ఉత్సవాలు
  • ఆకట్టుకున్న సృజనాత్మక కళారూపాలు, చర్చలు, ప్రదర్శనలు


సుస్థిరమైన సమాజ నిర్మాణం కోసం సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వ సమ్మేళనాలు, కళాత్మకమైన ఉత్సవాలు కీలకపాత్ర పోషిస్తాయి. హైదరాబాద్‍ సాహితీ ఉత్సవం 2020, జనవరి 24 నుండి 26 వరకు మూడు రోజులపాటు విద్యారణ్య పాఠశాలలో ఘనంగా జరిగింది. విద్యార్థులు, కవులు,చిత్రకారులు, రచయితలు, సినీ కళాకారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలను ఒకే వేదికమీదకి తీసుకు వచ్చి ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేసి వినూత్న ప్రపంచాన్ని సృష్టించాలనే ప్రయత్నం అపూర్వం. గత పదేండ్ల నుండి ఈ ఉత్సవాల్లో వర్క్షాపులు, సంభాషణలు, ప్యానెల్‍ చర్చలు, రీడింగులు, పుస్తక ప్రదర్శనలు ద్వారా సాహితీకారులకు కొత్త అనుభూతిని కలిగించేలా కృషి చేస్తుంది. సమాజాన్ని సుసంపన్నం చేయాలంటే ఇలాంటి సాహిత్య పండుగలు ఎంతో అవసరం.


క్రియేటివ్‍ రైటింగ్స్, సైన్స్ అండ్‍ టెక్నాలజీలపై చర్చలు :
హైదరాబాద్‍ లిటరరీ ఫెస్ట్ 2010లో ఆవిర్భవించింది. విభిన్న కోణాలకు చెందిన సాహిత్యం, కళారూపాలు, అకడమిక్‍, క్రియేటివ్‍ రైటింగ్స్, సైన్స్ అండ్‍ టెక్నాలజీ, సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు, వాటిపై చర్చాగోష్టులు, సదస్సులు, పుస్తకావిష్కరణలు.. ఇలా వేటికవే ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాహితీ పండుగ భావప్రకటన స్వేచ్ఛకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు, సంభాషణలు, ప్యానెల్‍ చర్చలు, వర్క్ షాప్ లు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


సాహిత్య అధ్యయన వేదిక :

నూతన సమాజ ఆవిష్కరణకు కళలు, సాహిత్యం, సంస్కృతి ప్రధానపాత్ర పోషిస్తాయి. అన్ని రకాల కళలు, సాహిత్యం, సంస్క•తి, వారసత్వానికి ఒక వేదికను ఏర్పాటు చేసి సమాజంలో భావ చైతన్యవ్యాప్తిని ప్రోత్సహిస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించి, తోటి వారిని ఆదరించాలి. లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉన్నా దానిపై చర్చ జరగాలి. పర్యావరణ అనుకూలతల వైపు అడుగులు వేయాలి. ప్లాస్టిక్‍ వాడకాన్ని తగ్గించుకోవడంతో పాటు వస్తు సామాగ్రిని పునర్వినియోగం, రీ సైకిల్‍ యొక్క విశ్వసనీయతను అమలు చేసేలా హెచ్‍ఎల్‍ఎఫ్‍ చైతన్య పరుస్తుంది. ఈ 2020 ఫెస్ట్లో ఆస్ట్రేలియా ఆతిథ్య దేశంగా హైదరాబాద్‍ రావడం గర్వకారణం. ఆ దేశం నుండి వివిధ రంగాలకు చెందిన 13 మంది నిపుణులు హాజరయ్యారు. దేశీయ స్థాయిలో ఈసారి మలయాల సాహిత్య రంగం నుంచి కవులు, రచయితలు, కళాకారులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. సాహిత్యం, కళలు, సంస్కృతిపై లోతైన అధ్యయనం చేయడమే ధ్యేయంగా లిట్‍ ఫెస్టివల్‍ పనిచేస్తుంది.


ఆకట్టుకున్న పిల్లల సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు :
యంగిస్తాన్‍ నుక్కడ్‍ బృందం హైదరాబాద్‍ సాహితీ ఉత్సవాల ప్రాంగణంలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. నిర్విరామంగా సాహిత్య, సంగీత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఉత్సవాల్లో భాగంగా ఒకవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పిల్లల కథలు అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ కథకులు కోయిలీ ముఖర్జీ క్రక్స్ పేరిట ఔత్సాహికులకు కథలు చెప్పారు. ప్రముఖ స్టోరీ టెల్లింగ్‍ సంస్థ భూమిక బృందం గరికపాటి ఉదయభాను, విద్యాసాగర్‍, హరీత్‍ చిలువేరు, ప్రియాంక పుంటంబేకర్‍, రావన్‍లు పిల్లల కోసం చెప్పిన సాహసాల కథలు ఎంతో ఆకట్టుకున్నాయి. బాలలకు శాస్త్రీయ అంశాలపై అవగాహనను రోహిణి చింత కథలు ద్వారా కల్పించారు. ప్రముఖ దర్శకుడు, మలయాళ రచయిత అదూర్‍ గోపాలకృష్ణ రూపొందించిన చిత్రాలను ప్రదర్శించారు. సామాజిక సమస్యలపై నిర్మించిన చిత్రాలు, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


దేశవిదేశాల నుండి హాజరైన సాహితీ ప్రేమికులు :
దేశ విదేశాల నుండి సాహితీ ప్రేమికులు సాహిత్య ఉత్సవానికి వేలాది మంది హాజరయ్యారు.ఈసారి మలయాళ సాహిత్యరంగం నుండి కవులు, కళాకారులు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. వివిధ రంగాల నిపుణులు ప్రదర్శనలతో ఔత్సాహికులను ఆకట్టుకున్నారు. పలువురు ప్రముఖ కథకులు పురాణ, నిజజీవిత కథలతో స్ఫూర్తి నింపారు. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు యంగిస్తాన్‍ నుక్కడ్‍ వేదిక మీద నృత్యాలు, పాటలతో అలరించారు. దేశవ్యాప్తంగా 11 ప్రదేశాల్లో సాహితీ ఉత్సవాలు జరుగుతుండగా హైదరాబాద్‍లో ఇతర ప్రాంతాలకు భిన్నంగా సాహిత్యంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. అన్ని రకాల కళాకారులు తమ కళలను ఇక్కడ ప్రదర్శించడం ప్రత్యేకమనే చెప్పాలి. కథా రచనలు, కార్యశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా కనిపించింది.


సినిమాలు నిజ జీవితాలను ప్రతిబింబించాలి : ప్రారంభోత్సవ సభలో దాదాసాహేబ్‍ పాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు ఆదూర్‍ గోపాలకృష్ణన్‍
ప్రజల నిజ జీవితాలను ప్రతిబింబించేలా నేటి సినిమాలు రావాలని ప్రముఖ సినీ దర్శకుడు ఆదూర్‍ గోపాలకృష్ణన్‍ అన్నారు. హైదరాబాద్‍ లిటరరీ ఫెస్టివల్‍ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి అద్భుత చిత్రాలు నిర్మించాలన్నారు. మలయాళం సాహిత్యంలో ఎన్నో పక్రియలు ఉన్నాయని, వాటి గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఔత్సాహికులకు తెలియజేయాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ఆస్ట్రేలియన్‍ కాన్సులేట్‍ జనరల్‍ (చెన్నై) సుసాన్‍ మాట్లాడుతూ భారత్‍లో ఉన్న గ్రంథప్రియులు మరే దేశంలో లేరన్నారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వివిధ కోణాల్లో కళలు, కథలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‍ సాహితీ ఉత్సవం తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింప జేసిందన్నారు.


తెలంగాణ సాహిత్యం – అనువాదం సెషన్‍లో తెలంగాణ భాష సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ అనువాదకులు దామోదర్‍రావు, కవి ఎలనాగ విశిష్ట ప్రసంగాలు చేశారు.పురాణాల్లో సీత పాత్ర గురించి జరిగిన సెషన్‍లో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ప్రసంగించారు. కవి సమ్మేళనాల్లో డా.ఎన్‍.గోపి, వసంత కన్నభిరాన్‍, కవి యాకుబ్‍ తదితరులు ఇతర భాషా కవులతో కలిపి తమ కవితలు వినిపించారు. గిరీష్‍ కర్నాడ్‍ రాసిన నాటకంలోని కొన్ని సన్నివేశాలను సినీనటులు శంకర్‍ మేల్కొటే, వందనాచక్రవర్తి తదితరులు ప్రదర్శించారు. దీనికి అనూహ్య స్పందన కనిపించింది.


చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍, దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులతో వివిధ అంశాలపై తమ భావాలను పంచుకున్నారు. ఈ మూడు రోజులు ఆక్స్ఫర్డ్ గ్రామర్‍స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మూడు రోజుల సాహిత్య పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగంగా నిలిచింది.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *