పరిచయం :
మానవ సమాజం అభివృద్ధి చెంది ఇతర గ్రహాలకు వెళ్తున్నా అదే సమయంలో మన భూమి మీద నివసిస్తున్న మానవ సమాజాలలోని ఒక వర్గం వైకల్యాలతో బాధపడుతుంది.
వైకల్యాలు రెండు రకాలు ఉంటాయి.
అ) ఒకటి పుట్టుకతో వచ్చేవి
ఆ) తాత్కాలికంగా, కృత్రిమంగా వచ్చే వైకల్యాలు. అవి యుద్ధాల రూపంలో కావచ్చు. అగ్ని పర్వతాల రూపంలో కావచ్చు. వైకల్యాలు అనేక రూపాల్లో సంభవిస్తాయి. కాని ప్రకృతిలో ఒక మూలకం ఎక్కువ మోతాదులో భూమిలో లభించినప్పుడు వైకల్యాలు సంభవించడం జరుగుతుంది.
ఫ్లోరైడ్ అంటే ఏమిటి?
ఫ్లోరైడ్ ఒక రసాయినక మూలకం. ఆవర్తన పట్టికలు 7వ గ్రూప్‍కు చెందింది. ఇది హలజున్‍ల మొదటి మూలకం. దీని యొక్క సాంకేతికం ఎఫ్. దీనియొక్క పరిమాణ భారం 18099 గ్రాములు. దీనిని షెల్లీ అనే శాస్త్రవేత్త 1771లో తెలుసుకున్నాడు. 1856లో ‘‘హెన్రి’’ అనే శాస్త్రవేత్త ఈ మూలకాన్ని కనుక్కున్నాడు.
దీని చర్యశీలత ఎక్కువ. అందులో 55కి పైగా సమ్మేళన రూపంలో లభిస్తాయి. ఇది భూగర్భంలో ద్రవరూపంలో, ఘనరూపంలో రాతి పొరల్లో లభిస్తాయి. ఇవి కర్మాగారంలోని వ్యర్థ పదార్థాల్లో ఘనరూపంలో లభిస్తాయి. ఇవి వాయురూపంలో కూడా లభిస్తాయి.
ఫ్లోరోసిస్ వ్యాధి ఎలా వస్తుంది?
కేంద్ర జలవనరుల శాఖ (2020 లెక్కల ప్రకారం) దంతాల యొక్క రంగును మార్చటం, ఎముకలు వంకరలు పోయేటట్లు చేస్తుంది. ఫ్లోరోసిస్‍కు కారణమైన ఫ్లోరైడ్ నీటిలో 100 పిపియం (ఒక లీటర్ నీటిలో ఒక మిల్లిగ్రాము వంతు) మించితే అంతా విధ్వంసమే. మన ఉమ్మడి తెలుగు నేలల్లో ప్రవహించే గోదావరి, కృష్ణా నదుల్లో 0.5 పిపియంగా ఉంది. మనలాంటి ఉష్ణ మండల దేశాలలో అవసరం గాని అంతకు మించి ఫ్లోరైడ్ నీటిని వాడితే విధ్వంసమే.
1947 సం।।లో మన దేశంలో ఫ్లోరైడ్ వ్యాధి మీద జరిగిన చర్చలు భారతదేశంలో భవిష్యత్తులో ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులు 25 నుంచి 30 కోట్ల మంది ఉంటారని అంచనా వేశారు. అందుకు ఒక కార్యక్రమం రూపొందించాలని తీర్మానం చేశారు.
1991 సం।।లో ఫ్లోరైడ్ వ్యాధికి గురైన జిల్లాలు 201. నేడు మన దేశంలో 300పైగా జిల్లాల్లో ఫ్లోరైడ్ వ్యాధి విస్తరించటం జరిగింది. మనదేశంలో కంటే ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్న దేశాలలో ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఫ్లోరైడ్ బారిన పడటం లేదంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి.
అ) ఆ దేశాలు చలి దేశాలు
ఆ) ఉన్నత ఆర్థిక స్థితి ఉండటమే
ఫ్లోరైడ్ నీరు తక్కువ త్రాగడం వల్ల అక్కడ ఫ్లోరైడ్ వ్యాధి నుంచి మినహాయించబడుతారు.
బి) ఉన్నత ఆర్థిక స్థితి : కొనుగోలు శక్తి ఎక్కువ ఉండటం వల్ల ఫ్లోరైడ్ వ్యాధి బారినుంచి వారిని కాపాడటం జరుగుతుంది.
మన తెలుగు నేల మీద ఫ్లోరైడ్ వ్యాధి కలిగినవారు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. 1935లో ఆనాటి మద్రాస్ రాష్ట్రం ఫ్లోరైడ్ వ్యాధి మీద శాసనసభలో చర్చించటం జరిగింది. ఒక కమిటి వేయటం జరిగింది. ఈ కమిటిలో డా।। రాఘవచారి. డా।। పి.పి. పండిత్, డా।। కృష్ణమూర్తి బృందం ఈ సమస్యపైన మద్రాసు రాష్ట్రంలో దర్శి, పొదలి, కనిగిరి ప్రాంతాలు సందర్శించటం జరిగింది. 1945 సంవత్సరంలో మన నైజాం నవాబు ఫ్లోరైడ్ సమస్య మీద ఒక కమిటి వేయటం జరిగింది. ఆ కమిటీ పేరు ‘‘దేవర్ కమిటి’’.
ఈ కమిటి ఉమ్మడి మెదక్, ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు పర్యటించింది. నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ ప్లోరైడ్ ఉందని నివేదికలో తెలియజేయడం జరిగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 36 లక్షల మంది ఉంటారని 2014 మధ్య వచ్చిన సర్వేల ద్వారా తెలియడం జరిగింది.
ఈ వ్యాధి నాలుగు భాగాలుగా సోకుతుంది.
అ) పండ్ల మీద
ఆ) నాడీ వ్యవస్థ మీద
ఇ) కీళ్ళ మీద
ఈ) కాళ్ళ మీద
ఫ్లోరైడ్ సామాజిక సంక్షోభం, పర్యావరణ సంక్షోభానాకి దారి తీసింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇతరులు నివసించటానికి ఎవరూ ఇష్టపడరు. వారితో పెళ్ళి సంబంధాలకు ఎవ్వరూ ఇష్టపడరు. పారిశ్రామికీకరణ అంతంత మాత్రమే ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫ్లోరైడ్ వ్యాధి నివారణకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ముఖ్యంగా నలగొండ జిల్లాలో ప్లోరైడ్ ప్రమాదం నుండి తప్పించడానికి ఎన్నో అధ్యయనాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ మరియు మిషన్ కాకతీయ ద్వారా త్రాగునీరు, సాగునీరు అందించడంతో పాటు, చెరువులను నింపడంతో భూగర్భ జలాలు పెరిగి ప్లోరైడ్ శాతం తగ్గనుంది. మిషన్ భగీరథ్ ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. ఇంతవరకు 46,000 కోట్లు ఈ పథకం క్రింద తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేయటం జరిగింది.
ఈ పథకం ద్వారా 10,767 గ్రామాలకు లబ్ధి చేకూరింది. ఇది చారిత్రకమైన విజయంగా చెప్పవచ్చు. ఈ పథకాన్ని దేశం మొత్తం విస్తరించవలసిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నం చేయడం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించ వచ్చు. దేశానికి ఒక దీర్ఘకాలికమైన పర్యావరణ ప్రజా ఉద్యమం అవసరం.
ముత్తన్నగారి రాజేందర్ రెడ్డి
ఎ : 9908240768