ప్రకృతి మనల్ని ఈ సృష్టినుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందా?


ప్రకృతి ప్రయోగించిన ఆయుధమే కరోనా వైరస్‍?


ప్రకృతి ఓ గొప్ప ప్రయోగకర్త. అది ఎలా ప్రయోగాలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కముక్కలో చెప్పా లంటే సృష్టికి అండగా నిలువని జీవజాతులను అది వేరు చేస్తుంది. లక్షలాది ఏళ్లుగా అది అలా ప్రయోగాలు చేస్తూనే ఉంది. డైనోసార్లను అది పక్కకు తప్పించింది. సాబెర్‍ టూత్‍ పులిని కూడా అలానే చేసింది. మనిషికి పూర్వీకులుగా భావించే రామాపితెకస్‍ అనే జీవుల్ని కూడా ఉనికిలో నుంచి తొలగించింది. అదే విధంగా పురాతన మనుషులుగా గుర్తించే నియాండర్తల్స్ను కూడా ప్రకృతి పక్కకు తప్పించింది.
వీటిలో కొన్ని జాతులు 2లక్షల ఏళ్లు కూడా జీవించాయి. మరి కొన్ని జాతులు కోటి నుంచి 2 కోట్ల సంవత్సరాల పాటు మనుగడలో ఉన్న జీవులు కూడా ఉన్నాయి. మరి మనుష్యుల సంగతి ఏంటి? మానవ జాతి ఎప్పటికీ నిలిచి ఉంటుందా? మ ప్రకృతి తన జీవరాశుల జాబితాలో నుంచి తొలగించి వేస్తుంది. మరి మనం నిజంగానే సృష్టికి మేలు చేసే వారిగా ఉన్నామా?


భూగోళంతో మీరు గనుక సంభాషించి ఉంటే, మన గురించి అది ఏమనుకుంటుందో మనకు చెప్పి ఉండేది. మన తీరు పట్ల అది ఎంత మాత్రం సంతోషంగా లేదు. ఇప్పుడు ఉనికిలో లేని మశూచి వైరస్‍ ఎంత నష్టం కలిగించిందో అంతకు మించిన నష్టాన్ని మనం కలిగిస్తూ ఉండవచ్చు. మన భూగోళం పట్లనే మనం క్రూరంగా వ్యవహరిస్తున్నాం.
మీరు మరే జీవరాశినైనా చూడండి. ఒక జీవి మరో జీవిని చంపుతుంది, ఎందుకోసం? తన ఉనికికి ముప్పు వాటిల్లినప్పుడు లేదా దాని నుంచి దాడి ప్రమాదం ఉన్నప్పుడు లేదంటే బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే. కానీ, మనుషులుగా మనం మాత్రం ఈ విషయంలో పరిణతి చెందలేదు. మనం మన ఉనికి కోసం కాకుండా ఇతర జీవరాశులపై, యావత్‍ భూగోళంపై మన ఆధిపత్యం కోసం లేదా కొన్ని సందర్భాల్లో మన సరదాల కోసం వాటిని చంపుతున్నాం.
కరోనా వైరస్‍ గురించి యావత్‍ ప్రపంచంలోనూ గందరగోళం నెలకొంది సృష్టికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేం. ప్రకృతి మనల్ని తప్పించేందుకు చేస్తున్న ఎన్నో ప్రయత్నాలను మనం చూశాం. ప్రస్తుత పరిస్థితుల్లో చైనానో… చైనా ప్రజలో సమస్య కాదు.


మరి సమస్య ఏంటి? మన సొంత చైతన్యమే మనకు సమస్యగా మారింది. మనం బతికే ఉన్నాం కానీ మరో ప్రపంచంతో వేరై పోయిన అనుభూతితో ఉన్నాం. మనం జీవించే ఉన్నాం కానీ మన చుట్టూ ఉన్న వారితో వేరై పోయి నట్లుగా అనుభూతి చెందుతున్నాం. ఈ విధమైన అవగాహనే దాని సొంత స్పందనలకు దారి తీసింది. దాన్నే ఇప్పు డు ప్రపంచంలో మనం చూస్తున్నాం. దాన్నే మనం కేన్సర్‍గా, విపత్తులుగా లేదా కరోనా వైరస్‍గా చూస్తున్నాం.


మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఒకరితో ఒకరం కలసి ఉండలేని పరిస్థితిలో మనం ఇక జీవితాన్ని కొనసాగించలేం. ఒకరితో ఒకరం లేదంటే ఇతర జీవరాశులతో మనం ఎంత వేరుగా ఉంటే, మన చుట్టూరా సమస్యలు అంతగా అధికం కానున్నాయి. నిజంగా మీరు గనుక ప్రశాంతమైన ప్రపంచం కోసం చూస్తుంటే, మీరు గనుక నిజంగా మరింత ఆనందదాయక ప్రపంచం కోసం చూస్తుంటే, మన పిల్లల కోసం అందమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటే, ఇప్పటికే పరివర్తన మొదలుకావాల్సి ఉండింది. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. దాని ఫలితమే మనం అనుభవిస్తున్నాం.

  • ప్రీతాజీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *