June

‘ఓన్లీ ఒన్‍ ఎర్త్’ – మానవాళి చిరునామా

మానవాళి మనుగడికి మూలధాతువు భూమి. భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు కలిస్తే ప్రకృతి. సహజంగానే వీటి మద్య సమత్యులత ఉంటుంది. ఈ సమతుల్యతనే పర్యావరణమంటాం. ప్రకృతితో సామరస్యం కొనసాగినంత కాలం సుస్థిర జీవనం సాధ్యం. ఈ సామరస్యతకు హానికలిగినప్పుడు వివిధ సంక్షోభాలు తలెత్తుతాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సంక్షోభాలన్నీ సహజమైనవి కావు. మానవ ప్రమేయమే ప్రధాన కారణమవుతున్నది. ఈ సంక్షోభాలు ప్రకృతి పరంగానే కాదు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలనూ ప్రభావితం చేస్తున్నాయి. సకల జీవరాసులకు …

‘ఓన్లీ ఒన్‍ ఎర్త్’ – మానవాళి చిరునామా Read More »

కేశనకుర్తి వీరభద్రాచారి

కీ.శే. కేశనకుర్తి వీరభద్రాచారి అనగానే నిజామాబాద్‍లో అన్ని కళల కేంద్రబిందువు అని ప్రతి వారూ స్మరించాల్సిందే! ఆరడుగుల మనిషి – నల్లని కోటు టై-పొడుగాటి పాతకాలం హీరోలు గుర్తుకు వచ్చే ప్యాంటు నడిమ పాపిట, పొడుగాటి వెంట్రుకలు. చేతిలో ఐదారు పుస్తకాలు! టకటక బూట్లు చప్పుడు వరండాలో! అదిగో చారి సార్‍ వస్తున్నారు! కాలేజీ విద్యార్థులంతా ఆంగ్ల పాఠం కోసం ఎదురు చూస్తున్న క్షణానికి శుభ సూచకం ఆయన ఆగమనం. గిరిరాజ కాలేజీలో వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకుడిగా ఉన్నా …

కేశనకుర్తి వీరభద్రాచారి Read More »

ఉన్నదొకే ధరిత్రి – కాపాడుకుందాం!

2022 సంవత్సరం ప్రపంచ పర్యావరణదినోత్సవానికి స్వీడన్‍ ఆతిథ్యమిస్తున్నది. ఒకే ఒక్క ధరిత్రి (ఓన్లీ వన్‍ ఎర్త్) అనేది ప్రచార నినాదంగా ప్రకృతితో సామరస్య పూర్వకంగా సుస్థిరతతో జీవించటం మీద దృష్టి నిలపడం జరుగుతుంది. ఇక ఈ ఏడాది కార్యక్రమాలు అన్నీ సామరస్యం, సుస్థిర జీవనం మీదనే కొనసాగుతాయి.పర్యావరణ సంక్షోభాలు, విధ్వంసాలు నానాటికీ అధికమవుతున్నాయి తప్ప తగ్గే సూచనలు సమీప దూరంలో కనిపించటం లేదు. మనుషులందరమూ ఈ భూమండలం మీద ఆధిపత్యంతో జీవించడానికే అలవాటు పడ్డట్లున్నాం. ముఖ్యంగా ప్రకృతి …

ఉన్నదొకే ధరిత్రి – కాపాడుకుందాం! Read More »

మహారాజా కిషన్‍ పర్‍షాద్‍ దేవుడీ

‘‘షాద్‍’’ అన్న తఖల్లూస్‍తో (కలంపేరు) ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో కవిత్వం రాసినది ఎవరో తెలుసా? ఆరవ నిజాంకు దివాన్‍గా పనిచేసిన మహరాజా కిషన్‍ పర్‍షాద్‍. ఆయన జాగీరు గ్రామం పేరే షాద్‍నగర్‍. నగరంలో కిషన్‍భాగ్‍ దేవాలయం ఆయన కట్టించినదే. ఆయన అధికార నివాసభవనం ‘‘దేవుడీ’’ షాలిబండాలో ఉంది. కరిగిపోయిన కమ్మని కలకు ప్రతిరూపమే ఆ దేవుడీ. ఆ దివాణం చుట్టూ అల్లుకున్న కమ్మని కథలు ఎన్నెన్నో! వీరు ఖత్రీ కులానికి సంబంధించినవారు. వీరి మాతృభూమి పంజాబ్‍. …

మహారాజా కిషన్‍ పర్‍షాద్‍ దేవుడీ Read More »

ఆ పాదాలు ఇప్పుడక్కడ లేవు!!!

అవును అవి పాదాలే. అక్కడ రెండు జతల పాదాలున్నాయి. అవి నిజంగా నిలువెత్తు పాదాలు. ఇంతవరకూ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో మరెక్కడా ఇంతెత్తున్న ఇలాంటి పాదాలు, ఇలా అరికాళ్లుపైకి కనిపించేలా ఉన్న దాఖలాలు లేవు. శ్రీరామోజు హరగోపాల్‍గారు కొలనుపాకలో ఇంతకంటే చిన్నపాదం గురించి ఇటీవలే తెలియజేశారు. ఇంతకీ ఈ పాదాలు ఎవరివై ఉంటాయి? ఈ పాదాలు జైనతీర్థంకరునివేమో. స్థానికంగా మాత్రం ఇవి దేవుని పాదాలని, ఆ పాదాలను నిలబెట్టి ఉంచిన ప్రదేశాన్ని పాదాలగడ్డ అని అంటారు. …

ఆ పాదాలు ఇప్పుడక్కడ లేవు!!! Read More »

ఓన్లీ వన్‍ ఎర్త్

జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2022కు ఆతిథ్యం ఇవ్వనున్న స్వీడన్‍ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2022 థీమ్‍. ‘ఓన్లీ వన్‍ ఎర్త్’ (ఒకే ఒక్క భూమి), ప్రకృతికి అనుగుణంగా స్థిరంగా జీవించడంపై దృష్టి పెడుతుంది. జూన్‍ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా గుర్తించడానికి దారితీసిన స్టాక్‍హోమ్‍ కాన్ఫరెన్స్ నుండి 2022కి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి.గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు.. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే …

ఓన్లీ వన్‍ ఎర్త్ Read More »

‘వ్యర్థ’ వివేకంతో నిర్మల నదులు

‘డౌన్‍ టు ఎర్త్’ సంపాదకురాలు, ‘సెంటర్‍ ఫర్‍ సైన్స్ అండ్‍ ఎన్విరాన్‍మెంట్‍’ డైరెక్టర్‍ జనరల్‍ సునీతా నారాయణ్‍ అందించిన వ్యాసం మన నదులు అంతకంతకూ కాలుష్య కాసారాలు అవుతున్నాయి. వాటిని స్వచ్ఛ వాహినులుగా ఉంచేందుకు చాలా సంవత్సరాల క్రితమే అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే అవి అంతగా ఫలించడం లేదు. కారణమేమిటి? మన పట్టణాలు, నగరాలలోని చెత్తా చెదారం, మురుగు జలాలను నదులలోకి యథేచ్ఛగా వదలడమే కాదూ? అసలే వాతావరణ మార్పు మన ధాత్రికి ఎనలేని…

సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం… బ్లాక్‍ చెయిన్‍ టెక్నాలజీ…!

సెలయేటి ఒడ్డున కూర్చుని పంట పొలాలకు ప్రవహించే నీటిని గమనించినట్లయితే పాతనీరు వెళుతుంటే, కొత్తనీరు వచ్చిచేరుతూ పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. అదే విధంగా సాంకేతిక రంగంలో కూడా ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చినపుడు దాని గురించి ఆలోచించేలోపే మరొక కొత్త ఆవిష్కరణ మనకు అందుబాటులోకి వస్తూ.. మానవాళికి మరింత సుఖాన్ని, సౌఖ్యాన్ని అందిస్తున్నాయనడం ఎంత మాత్రం సత్యదూరం కాదు. ఇక కంప్యూటర్‍ వచ్చాక మన సమాజం యొక్క తీరుతెన్నులే మారిపోయాయి. గంటలో చేసే పనిని, …

సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం… బ్లాక్‍ చెయిన్‍ టెక్నాలజీ…! Read More »

దిల్లీలో ఉన్న మన ‘హైదరాబాద్‍ హౌస్‍’

దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో ఛాయ్‍పే చర్చలకైనా.. విలేకరుల సమావేశాలైనా, ముఖ్య కార్యక్రమాలైనా అన్నింటికీ ఒకటే వేదిక. అదే దిల్లీలో ఉన్న హైదరాబాద్‍ హౌస్‍. ఏ దేశ అధ్యక్షులైనా మన దేశంలో పర్యటిస్తే దీని గడప తొక్కాల్సిందే. అతిథిగా రాచమర్యాదల రుచి చూడాల్సిందే. నిజాం ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్‍ దర్పానికి ప్రతిబింబంగా నిలుస్తోంది.వందేళ్ల చరిత్ర..దిల్లీ నగరం నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ …

దిల్లీలో ఉన్న మన ‘హైదరాబాద్‍ హౌస్‍’ Read More »

నాలుగు గొప్ప చోళ దేవాలయాలు

మనదేశంలో విలసిల్లిన మూడు దేవాలయ శైలుల్లో నాగరపద్ధతిలో వింధ్య పర్వతాల నుంచి కృష్ణానది వరకు, ద్రావిడ పద్ధతిలో కృష్ణానది నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మించబడినాయి. క్రీ.శ.4-5 శతాబ్దాల్లో ప్రారంభమైన ఈ దేవాలయ నిర్మాణం తమిళ నాట క్రీ.శ.13-14 శతాబ్దాలకు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ముందు ఇటుక, కొయ్యలతో ప్రారంభమై గుహాలయాలు, రాతి ఆలయాలుగా రూపు దిద్దుకొని, రానురాను ఆగమశాస్త్రాల్లో పేర్కొన్న పూజ, పునస్కారాల కోసం, ఆలయం కూడా గర్భాలయ, అర్థ, మహామండపాలకు తోడు అనేక కట్టడాలు చేరి, …

నాలుగు గొప్ప చోళ దేవాలయాలు Read More »