ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‍కు ప్రధాని మోదీ ప్రశంస
వృక్ష వేదం పుస్తకాన్ని అందరూ చదవాలని పిలుపు
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని, దానిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‍ను ప్రధాని మోదీ ప్రశంసించారు. పచ్చదనాన్ని పెంచడంతోపాటు పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలను ప్రధాని గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎంపీ సంతోష్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా యువత ఈ పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‍లో పాల్గొనడం ద్వారా దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తూ సంతోష్‍కు లేఖ రాశారు.
కేటీఆర్‍కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన జోగినిపల్లి సంతోష్
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్‍ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‍లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. వృక్షవేదం పుస్తకం చాలా అద్బుతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి అందాలను ఎంతో అద్భుతంగా చూపించారని తెలిపారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకు వస్తుందని తెలిపారు. వృక్ష వేదం పుస్తకాన్ని అద్భుతంగా రూపొందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అద్భుతమైన కానుక
‘మనం నాటిన మొక్కలు పక్షులకు, కీటకాలకు ఆవాస కేంద్రంగా మారి అంతరించి పోతున్న వివిధ రకాల జాతుల పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం సంతోషంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న జీవులను మళ్లీ మనం చూసే వీలు కలుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‍గారి పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా అయి పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఇస్తున్న అద్భుతమైన కానుక’’ అని సంతోష్ కుమార్ ట్విట్టర్‍లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్‍ఎస్ మియావాకి పద్ధతిలో తక్కువ ప్రదేశంలో చిన్న అడవిని సృష్టించే విధంగా మొక్కలు నాటారు. ఆ ప్రదేశంలో మొక్కలు పెరిగి పెద్దవి అయి నేడు పక్షులకు, కీటకాలకు ఆవాసంగా మారాయి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్న బలరామ్‍కు సంతోష్ అభినందనలు తెలిపారు.
దక్కన్‍న్యూస్,
ఎ : 9030 6262 88