స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే



ఫొటో.. మాటలకందని ఓ  దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది..
ఫ్రాన్స్కు చెందిన లూయీస్‍ జాక్వేస్‍ మాండే డాగ్వేర్‍ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్‍ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్‍ అకాడమీ ఆఫ్‍ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్‍ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గుర్తుగా 2010 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అప్పట్లో ఫొటోలు తీసేందుకు రాగి, వేడిని ఉపయోగించేవారు.


క్క క్లిక్‍.. ఎన్నో భావాలకు లాజిక్‍..
కంటెంట్‍ ఎంత బాగా ఉన్నా.. అందుకు తగ్గ కటౌట్‍ లేకపోతే ఆ స్టోరీ వేస్టే.. అంత గొప్పదనం తెలిపే కటౌట్‍ ను కేవలం ఒక్క క్లిక్‍ తో క్రియేట్‍ చేయొచ్చు.. కేవలం ఒక్క ఫొటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన శక్తి ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది. మానవ జీవితానికి ఈ ఫొటోగ్రఫీకి అవినాబావ సంబంధం ఉంది. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో విషయాలకు స్వీట్‍ మెమోరీస్‍కు ఫొటోలే నిదర్శనంగా నిలుస్తాయి.


బ్లాక్‍ అండ్‍ వైట్‍తో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలానికి అనుగుణంగా కలర్‍ఫుల్‍గా మారింది. దీంతో ఫొటోగ్రఫీ రోజురోజుకు ఎన్నెన్నో ప్రత్యేకతలను పరిచయం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది.


ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర :
పలు రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతి చర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం. గ్రఫీ అంటే గీయడం అని అర్థం.. ఫైనల్‍గా ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం అన్నమాట. ఈ ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ప్యారిస్‍ లో బ్లాక్‍ అండ్‍ వైట్‍ కలర్లతో ఫొటోగ్రఫీ ప్రారంభమైంది.


మన దేశంలో ఫొటోగ్రఫీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా..
ఫ్రాన్స్ దేశంలో 1839లో అధికారికంగా ఫొటోగ్రఫీని ప్రపంచానికి ఉచితంగా అందించినా.. భారతదేశానికి 1857 వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. అప్పుడు కూడా బ్రిటీష్‍ రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని వినియోగించేవారు. 1977 నుంచి భారతదేశంలోని సామాన్యులకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో తొలిసారిగా లాలా దీన దయాళ్‍ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు.


జ్ఞాపకాలకు మధురత అద్దే ఫొటోగ్రఫీ
ఒకప్పుడు రీల్స్తో ఫొటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫొటోలు తీసే స్థాయికి ఫొటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు, నిరంతర  కృ షి దాగివుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం ముఖ్యోద్దేశం.

ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *