August

సంవేదన అ సంభాషణ అ సంయనమనం అ సమన్వయం పన్నెండు వసంతాల దక్కన్‍ల్యాండ్‍

కాలానికి ఒక విలువను ఆపాదించేది సందర్భం. భిన్న భిన్న సందర్భాలను కాలమూ, సమాజమూ ఎప్పటికప్పుడు అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగుతాయి. ఈ ప్రయాణంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటూ నిర్మాణాత్మక ఆలోచనలనూ, ఆచరణలనూ ప్రోది చేసే వివిధ రంగాలలో పత్రికారంగం అత్యంత కీలకమైనది. గత పన్నేండ్లుగా దక్కన్‍ల్యాండ్‍ మాస పత్రిక ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తున్నది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను చర్చించే వేదికగా, ప్రజాస్వామ్య భావజాల వేదికగా, సమస్త ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ వేదికగా 2012 …

సంవేదన అ సంభాషణ అ సంయనమనం అ సమన్వయం పన్నెండు వసంతాల దక్కన్‍ల్యాండ్‍ Read More »

దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణలో జన్మించిన, గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.‘‘ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్‍ బడగొట్టి, మంచి మాగాణములన్‍ స•జించి, ఎముకల్‍ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్‍ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే;ముసలినక్కకు రాజరికంబు దక్కునే’’అంటూ గర్జించి, హైదరాబాద్‍ సంస్థానవిముక్తి మహో ద్యమంలో దూకి, నిజాం నవాబు – మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగారశిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి. దాశరథి పూర్తి పేరు. దాశరథి కృష్ణమాచారి. దాశరథి …

దాశరథి కృష్ణమాచార్య Read More »

నవరత్నాలలో గోమేధికం

గార్నెట్‍ అందరికి బాగా తెలిసిన ఒక రత్నం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. నాగరికత ప్రారంభ మైనప్పటి నుండి అన్ని సంస్కృతులలో దాని సులభ లభ్యత కారణంగా ప్రజాదరణ పొందింది. ఇది నవరత్నాలలో భాగం. రాహువుకు ప్రతీకగా భావిస్తారు. దీన్ని కలియుగరత్నం అనీ, విశ్వాసరత్నం (Gem of Faith) అని కూడా అంటారు. గార్నెట్‍ అనే పేరు లాటిన్‍ పదం గ్రానాటస్‍(అంటే విత్తనాలు) నుండి వచ్చింది. దానిమ్మ గింజలకు గార్నెట్‍కు ఉండే దగ్గరి పోలిక ఒక కారణం …

నవరత్నాలలో గోమేధికం Read More »

పిల్లల‘మర్రి’కి పునరుజ్జీవం

నాడు 60% వరకు ఎండిపోయిన 700 ఏళ్ల మహా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిన అధికారులు సెలైన్‍ ట్రీట్‍మెంట్‍, రక్షణ చర్యలతో సత్ఫలితాలు అటవీశాఖ కృషితో చిగురించిన కొత్త ఊడలు ప్రస్తుతం 90 శాతం వరకు పచ్చని ఆకులతో కళకళ మళ్లీ పర్యాటకులకు అనుమతి పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది. సుమారు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నాడు 60 …

పిల్లల‘మర్రి’కి పునరుజ్జీవం Read More »

చాయ్‍ గరం

హైద్రాబాద్‍ ఆత్మ చార్మినార్‍లో కాదు ఇరానీ చాయ్‍లో దాక్కుని ఉంది. – జాన్‍దార్‍ అఫ్సర్‍, ప్రముఖ ఉర్దూ కవి మీరెపుడైనా ఖడక్‍ చమచ్‍ చాయ్‍ తాగినారా? పోనీ మలయ్‍దార్‍ పౌనా చాయ్‍? అయ్యో అది భీ తాగలేదా మరి ఉత్త ఖడక్‍ చాయ్‍? జాఫ్రానీ చాయ్‍? ఘావా? గులాబీ పత్తా కా చాయ్‍?అరెరె ఎంత పనయ్యింది? ఇవన్నీ రుచి చూడకుండనే జిందగీ ఖతం అయిపోతే ఎట్ల మరి? ఈ భూమ్మీదికి మళ్లీ మళ్ళీ రాం కదా? ఏదో …

చాయ్‍ గరం Read More »

ప్రమాదకారక పరిశ్రమలు – ప్రజా చైతన్యం – పర్యావరణం

భారతదేశంలో అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ యూనియన్‍ కార్బైడ్‍ కర్మాగారం గురించి మనకు తెలుసు. భోపాల్‍ దుర్ఘటన ద్వారా అటువంటి కంపెనీ ఒకటుందని మనకు తెలిసింది. డిసెంబర్‍ 4, 1984లో కర్మాగారంలో సంభవించిన ప్రమాదం కారణంగా మిథైల్‍ ఐసోసైనేట్‍ అనే విషవాయువు 46.3 టన్నుల మేరకు గాలిలో కలిసిపోయింది. ఆ అర్థరాత్రి కార్బైడ్‍ కంపెనీ సమీపంలో ఉన్న ప్రజలు నిద్రలోనే చనిపోయారు. ఆ దుర్ఘటన ప్రభావం వల్ల ఎంత భారీ నష్టం వాటిల్లిందో ఊహించడం కూడా …

ప్రమాదకారక పరిశ్రమలు – ప్రజా చైతన్యం – పర్యావరణం Read More »

ముందు తరానికి భవితనిచ్చేది వారసత్వమే! జులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సు

UNESCOకు 1 మిలియన్‍ డాలర్ల విరాళాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీజులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సుపాల్గొన్న 195 దేశాల ప్రతినిధులు సెషన్‍ యొక్క థీమ్‍ ‘‘హెరిటేజ్‍ అండ్‍ కమ్యూనిటీస్‍: వరల్డ్ హెరిటేజ్‍ ప్రాపర్టీస్‍ యొక్క సుస్థిరమైనమేనేజ్‍మెంట్‍ కోసం ప్రభావవంతమైన విధానాలు.’’ పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు కనిపించే వారసత్వ అంశాలు. భావితరానికి భవితనిచ్చేది వారసత్వమే! ప్రపంచ మానవులంతా ఒక్కటేనన్న భావనతో, 1972 నుంచి యునెస్కో, ప్రతిదేశం …

ముందు తరానికి భవితనిచ్చేది వారసత్వమే! జులై 21-31 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన UNESCO 46వ సదస్సు Read More »

యునెస్కో జాబితాలో అస్సాం పిరమిడ్లు

యునెస్కో అస్సాంలోని అహోమ్‍ రాజవంశానికి చెందిన మొయిదమ్స్ను భారతదేశ 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది. అహోం రాజులు, రాణులు మరియు ప్రభువుల శ్మశానవాటికలను అస్సాం పిరమిడ్‍లుగా కూడా పిలవబడే మొయిడమ్‍లు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. న్యూ ఢిల్లీలో జరిగిన యునెస్కో 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో అస్సాంలోని అహోం రాజవంశానికి చెందిన మొయిదమ్‍లను భారతదేశ 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా శుక్రవారం (జులై 26) ప్రకటించారు. 2023-24 కోసం యునెస్కో ప్రపంచ …

యునెస్కో జాబితాలో అస్సాం పిరమిడ్లు Read More »

ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం …

ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం Read More »

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం యొక్క శిలా మరియు ఖనిజ సంపద

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన తరువాత ఇప్పుడున్న భూభాగం 1,60,205 చదరపు కిలోమీటర్లలో విస్తరించి వున్నది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తెలంగాణ, ఒడిస్సా, తూర్పులో బంగాళాఖాతం, తమిళనాడు, దక్షిణ దిశలో మరియు పశ్చిమ దిశలో కర్ణాటక ఉన్నది. పుదుచ్చేరి యొక్క చిన్న ప్రాంతమైన యానం జిల్లా (30 చ.కి.మీ) గోదావరి డెల్టాలో ఉండడం విశేషం. ఈ రాష్ట్రానికి 972 కి.మీ. పొడువైన సముద్ర తీరం ఉండటం, దీని వైశాల్యం 40 కి.మీ. ప్రాంతం కావడం, మరియు…