వేసవిలో కూరగాయలకు డిమాండ్
తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం వేసవి వచ్చింది. ఈ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా మంచి డిమాండ్ ఉంటుంది. అధిక లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. రాష్ట్రంలో కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైనది. వరి వేద్దామనుకొన్నా.. బియ్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూరగాయల సాగు రైతులకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు …