April

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్‍ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్‍ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్‍ వార్మింగ్‍, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ …

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం Read More »

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం

మాడభూషి రంగాచార్య స్మారక సంఘం వారు గత ఇరవై యేళ్లుగా బాలసాహిత్య రంగంలో చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. ప్రతి ఏటా నవంబరు నెలలో హైదరాబాద్‍లోని పాఠశాలల బాలబాలికలకు కథల పోటీ నిర్వహిస్తుంది. అందులో బాగున్న కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పదకొండు ప్రోత్సాహక బహుమతులను మార్చి 11న అందజేయడంతో పాటు ఇద్దరు బాల సాహితీవేత్తలను సన్మానించడం జరుగుతుంది. ఈ యేడాది మార్చి 11న హైదరాబాద్‍ నగరంలోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో గిరిజ పైడిమర్రి …

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం Read More »

బాలచెలిమి గ్రంథాలయం

జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, తడపాకల్‍, నిజామాబాద్‍ జిల్లా బాల చెలిమి గ్రంధాలయంను మా పాఠశాలలో 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 వేల రూపాయలతో మా పాఠశాలకు ఈ గ్రంథాలయాన్ని బాలచెలమి వ్యవస్థాపకులు శ్రీ వేదకుమార్‍ గారు ఇవ్వడం జరిగింది. అనేక రకాల పుస్తకాలు ఉండడంవల్ల మా విద్యార్థులు వాటిని చదవడం, అనేక విషయాలు అర్థం చేసుకోవడం, దానితోపాటు చక్కగా కథలు రాయడం, కవితలు అల్లడం జరిగింది. అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు …

బాలచెలిమి గ్రంథాలయం Read More »

మంచి పుస్తకం @ 20

పిల్లలు పరిపూర్ణులు. వాళ్ల భవిష్యత్తును వాళ్లు ఎంచుకోవాలి, అందుకు బాధ్యత కూడా వాళ్లే వహించాలి అన్న నమ్మకంతో మంచి పుస్తకం పని చేస్తుంది. అనుకరణ, ఇతరులను ఆరాధించటం ద్వారా పిల్లలు నేర్చుకుంటారన్నది నిజమే. అయితే, ఎవరితో (దేనితో) ప్రభావితం కావాలనేది ఎంచుకునేది పిల్లలే. కాబట్టి, వారికి నీతి కథలు చెప్పాల్సిన పనిలేదు, అందువల్ల ఉపయోగం కూడా లేదు. రోడ్లు మీద పాదాచారులతో సహా ఎవరూ నియమాలు పాటించరు. పుస్తకాలలో ట్రాఫిక్‍ రూల్స్ గురించి ఎంత చెప్పినా ఏం …

మంచి పుస్తకం @ 20 Read More »

నానమ్మ చెప్పిన కథ

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

నానమ్మ చెప్పిన కథ Read More »

వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత

ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనేక సముదాయాల సమాహారమే వారసత్వ సంపద. ఆ సముదాయాల సమాహారం అనేక రూపాల్లో ఉండవచ్చు. భావజాలరూపంలో ఉండొచ్చు. నాగరికత, సంస్కృతి, అలవాట్ల వంటి జీవనవిధాన రూపంలో ఉండొచ్చు. భౌతిక రూపాలైన మానవ నిర్మిత కట్టడాలు, దేవాలయాలు, ఆనకట్టలు, నగర నిర్మాణ పద్ధతులు, ఉద్యానవనాలతో పాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కళాత్మక నిర్మాణాల రూపంలో ఉండొచ్చు. వీటిని కాపాడుకుంటూ ముందు తరాలకు అందివ్వడమనేది వర్తమాన సమాజపు బాధ్యత. ఆ …

వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత Read More »

పోరు జెండా.. మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం… పోరాటానికి పర్యాయ పదం.. భూమికోసం.. భుక్తికోసం… పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత… పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‍పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్‍… చావుకు వెరవని గెరిల్లా యోధురాలు.. అసెంబ్లీలో ఆమె మాట తూటా.. పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా – ఆమె పోరాటాల ఎర్రజెండా.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల …

పోరు జెండా.. మల్లు స్వరాజ్యం Read More »

హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్‍ దర్గా

‘‘ఏదోస్తీ హమ్‍ నహీఁ తోడేఁగేచోడేఁగే దమ్‍ అగర్‍తేరే సాథ్‍నా చోడేఁగే..’’‘‘ఈ స్నేహాన్ని మేం విడదీయం. శ్వాస వీడినా స్నేహాన్ని మాత్రం వీడిపోము’’. షోలే సీన్మాలోని ఈ పాట 330 సం।।ల క్రితం హైద్రాబాద్‍ నగరంలో ఏకాత్మగా జీవించి మరణించిన ఇద్దరు స్నేహితులకు అక్షరాలా వర్తిస్తుంది. వారు హజ్రత్‍ సయ్యద్‍ షా యూసుఫుద్దీన్‍, హజ్రత్‍ సయ్యద్‍ షా షరీఫుద్దీన్‍లు. నాంపల్లి స్టేషన్‍ వెనుక భాగాన బజార్‍ ఘాట్‍ చౌరస్తాలో ఉన్న బాబా యూసుఫైన్‍ దర్గా వీరికి సంబంధించినదే. వీరిద్దరు …

హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్‍ దర్గా Read More »

తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి

తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్‍ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల నుంచి కొద్ది మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఈ విరాళాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి పలువురు మంత్రులు, అధికారులతో ఆర్థికమంత్రి మంత్రి హరీశ్‍రావు సమీక్షించారు. హరితనిధి ఏర్పాటు చరిత్రాత్మకమని, హరితనిధికి జమ అయ్యే నిధులతో నర్సరీలు, మొక్కల పెంపకం చేపట్టనున్నట్టు …

తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి Read More »

నేను ఇంకా ఎన్నేళ్లు వేచిచూడాలి? ఘనపూర్‍ దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం ఆవేదన

ఎన్నో యాసలున్న తెలుగు భాషను మాట్లాడే వారినందరినీ ఒక్కతాటిపైకితెచ్చి, ఆయా భూభాగాలను ఒక్కటిగా కూర్చి తమిళ, కన్నడ, మరాఠి, ఒరియా సరిహద్దులుగా మొత్తం తెలుగు నేలను 62 సంవత్సరాల పాటు పాలించిన ఘనత కాకతీయ గణపతిదేవునిదే. ఎలాంటి శతృభయం లేకుండా దేశరక్షణకు, సమృద్ధ పంటలతో సస్యరక్షణకు పూనుకొన్న గొప్ప చక్రవర్తి. సాగునీటికి విశాలమైన చెరువుల్ని, పెరుగుతున్న జనాభాకు కొత్త కొత్త పట్టణాలను, ఆధ్యాత్మిక వనరులుగా ఎన్నో దేవాలయాలను నిర్మించిన గొప్పదార్శనికునిగా పేరు తెచ్చుకొన్నాడు. దేశీయ, విదేశీయ వర్తక …

నేను ఇంకా ఎన్నేళ్లు వేచిచూడాలి? ఘనపూర్‍ దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం ఆవేదన Read More »