ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి అవగాహన నిర్వహిస్తారు.
చరిత్ర
అమెరికాలో సెనేటర్ గేలార్డ్ నెల్సన్ (Senator Gaylord Nelson) 1970లో మొదటిసారి ఎర్త్డేని నిర్వహిం చారు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా చమురు చిందిన ఘటన తర్వాత అమెరికన్ పౌరులు చేపట్టిన ఉద్యమ విజయానికి సూచకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ శాస్త్రాన్ని ప్రోత్సహించాలని, పర్యావరణానికి సంబంధించిన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. 1969 ప్రారంభంలో కాలిఫోర్నియా (California) లోని శాంటా బార్బరా (Santa Barbara)లో చమురు చిందిన భయానక ఘటన చూసిన తర్వాత గెలార్డ్ నెల్సన్ ఆందోళన చెందాడు.
ఏప్రిల్ 22, 1970న, నీటి కాలుష్యం, చమురు చిందటం, అడవి మంటలు, వాయు కాలుష్యం మొదలైన పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 20 మిలియన్ల అమెరికన్ పౌరులు నగరం అంతటా వీధుల్లోకి వచ్చారు. ఆ వీధి నిరసన భారీ సంచల నం స•ష్టించింది. దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమంతో వందలాది నగరాలు క్రమంగా ఉద్యమ బాట పట్టాయి. ప్రపం చంలోని అతిపెద్ద నిరసనలలో ఒకటిగా ఈ ఉద్యమం నిలిచింది. మొదటి ప్రపంచ దినోత్సవ ఉద్యమం నుంచి ప్రస్తుత ప్రపంచ దినోత్సవం 2024 వేడుక వరకు ఇదే అతిపెద్ద ఉద్యమం.
ప్రస్తుతం సెమినార్లు, ఈవెంట్‍లు వంటి వాటితో అవగాహన కల్పించడానికి ఎర్త్ డే నిర్వహిస్తున్నాం. ఇటువంటి ఆధునిక పర్యావరణ ఉద్య మాలు మెరుగైన జీవనం పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయి.
ఎర్త్ డే 2024 ప్రాముఖ్యత
మా థీమ్, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్, ప్లాస్టిక్‍ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదంపై విస్త•తంగా అవగాహన కల్పించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‍లన్నింటినీ త్వరితగతిన తొలగించాలని, ప్లాస్టిక్ కాలుష్యంపై బలమైన •చీ ఒప్పందం కోసం తక్షణమే ఒత్తిడి చేయాలని మరియు ఫాస్ట్ ఫ్యాషన్‍కు ముగింపు పలకాలని కోరింది.
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111