బాలచెలిమి గ్రంథాలయం

జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, తడపాకల్‍, నిజామాబాద్‍ జిల్లా

బాల చెలిమి గ్రంధాలయంను మా పాఠశాలలో 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 వేల రూపాయలతో మా పాఠశాలకు ఈ గ్రంథాలయాన్ని బాలచెలమి వ్యవస్థాపకులు శ్రీ వేదకుమార్‍ గారు ఇవ్వడం జరిగింది. అనేక రకాల పుస్తకాలు ఉండడంవల్ల మా విద్యార్థులు వాటిని చదవడం, అనేక విషయాలు అర్థం చేసుకోవడం, దానితోపాటు చక్కగా కథలు రాయడం, కవితలు అల్లడం జరిగింది. అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు కూడా సంపాదించడం జరిగింది. అదేవిధంగా అనేక పక్రియల్లో విద్యార్థులు పుస్తకాలను రాయడం, ఆవిష్కరించడం జరిగింది. చక్కని గ్రంథాలయాన్ని మాకు బహుమానంగా ఇచ్చిన బాలచెలిమి వారికి ప్రత్యేక అభినందనలు. – ప్రవీణ్‍ కుమార్‍ శర్మ, తెలుగు పండితులు, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల తడపాకల్‍, నిజామాబాద్‍ జిల్లా.

మా పాఠశాల పేరు జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల తడపాకల్‍.. మా పాఠశాలలోని బాలచెలిమి గ్రంధాలయంలో ఉన్నటువంటి అనేక పుస్తకాలను ప్రతినిత్యం చదవడం వల్ల నేను కవితలు, కథలు రాయడం నేర్చుకున్న. ఇప్పటివరకు 30 పైగా కవితలు కథలు రాయడమే కాకుండా అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించాను. జాతీయస్థాయి సైన్స్ ఫిక్షన్‍ కథల పోటీలలో తాను రాసిన ‘అమ్మ కోరిక’ అనే కథకు ప్రత్యేక బహుమతి లభించింది. అదేవిధంగా జిల్లాస్థాయిలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కవితల పోటీలలో నేను రాసిన ‘నీటి విలువ’ అనే కవితకి జిల్లా స్థాయిలో రెండవ బహుమతిని సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. – మహమ్మద్‍ రీమ్‍ షా, 8వ తరగతి

బాల చెలిమి గ్రంథాలయం లోని అనేక పుస్తకాలను చదవడం వల్ల కథలను రాయడం, కవితలు రాయడం నేర్చుకున్నాం. అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు పొందినాను. చిన్నారి కథలు, చదువు, అమ్మ సరళ వచన శతకాల పుస్తకాలను ఆవిష్కరించాను. అక్షరయాన్‍ బాలిక పురస్కారం, బాల జ్యోతి పురస్కారం, తానా వారి పురస్కారం అందుకున్నాను. – పేరుడేగల వైష్ణవి

ఏడవ తరగతి నుండి నేను మా పాఠశాల గ్రంధాలయం పుస్తకాలను చదవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా బాలచెలిమి వారు మా పాఠశాలకు గ్రంధాలయం ఇవ్వడం ద్వారా అనేక పుస్తకాలను చదివే అవకాశం నాకు లభించింది. దాని వల్లనే నేను కథలు కవితలు రాయడం జరిగింది. ఇప్పటివరకు సుమారుగా 30 కథలు, కవితలు రాసాను. అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు కూడా సాధించాను. అంతర్జాతీయ మాసపత్రిక గడుగ్గాయి వారు నిర్వహించిన కవితల పోటీలలో పాల్గొని నేను రాసిన కవిత తెలుగు భాషకి బహుమతి పొందాను. – శ్రీలేఖ, పదవ తరగతి, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల తడపాకల్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *