తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను సేకరించి ప్రచురించారు. ఆ పాటలకు భిన్నంగా ఆదిలాబాద్ జిల్లా నార్మూర్ మండలంలో పాడే పాటల్లో బంధుత్వ మాధుర్యం ప్రధానంగా కనిపిస్తుంది.
మొదటి పాటను నార్నూర్ మండల కేంద్రంలో రాథోడ్ జీజా బాయి, ఆడె అనితల బృందం పాడగా, రెండో, మూడో పాటలను అదే మండలంలోని మహగామ్ గ్రామానికి చెందిన రాథోడ్ జానాబాయి, చావన్ సుమన్ బాయి, చావన్ హీరాబాయిల బృందం పాడగా సేకరించి ఈ కింద పొందుపర్చడమైంది.
తీజ్ పాట -1
యా మారో ముంగేక అవడ మోగెరాయే
చావళే అవడా ఫూల్
యా మారో కుణసో వీర గరౌసియామే
రంగే రంగేరో ఫూల్ ।। 2 ।।
యా మారో మోటొ వీర గరౌసియాయే
చావళే అవడా ఫూల్ ।। 2 ।।
సోదరి: వీర తారీ కుణసే రంగేరి పాగడిరే
రంగే రంగేరో ఫూల్ ।। 2 ।।
సోదరుడు: బాయి మారి రాతడే రంగేరి పాగడియె
ధోళే రంగేరో ఫూలే ।। 2 ।।
సోదరి: వీర తూ భాందస బామణ బేసియారే
ఛ భా లెవల మార్
వీర తార ఘెడేన భాందు ఘాగ్ రారే
నీలో నాగర వేస ।। 2 ।।
సోదరుడు: బాయి తార చీణేన భాందు చోకడాయే
లేపో లాగర వేస ।। 2 ।।
సోదరి: వీర తూ లీలడి చడ్తూ ఢేపసోరే
బంద్గయి బారాఫూల్ డోర్
తెలుగు అర్థం
ఒక సోదరి తన సోదరుని గొప్పతనం చూసి మురిసి పోతూ సోదరునితో చేసే సంభాషణయే ఈ పాట.
సోదరి: అమ్మా! నాదేమో పెసర గింజంత మల్లె మొగ్గ
బియ్యపు గింజంత పువ్వు.
కాని మా అన్న రంగు రంగుల పువ్వులున్న గొప్పవాడు. ఓసోదరా…
నువ్వు ధరించిన తలపాగలో ఏ
రంగుల పువ్వులున్నయి?
సోదరుడు: ఓ సోదరి! నేను ధరించిన తలపాగలో పువ్వులు ఎరుపు రంగులో ఉన్నయి.
సోదరి: సోదరా! నువ్వు బ్రాహ్మణుడి లాగా తెలివి గలవాడివి. మాకది గర్వకారణం.
నువ్వు స్వారీ చేసే గుర్రానికి
నా గుర్తుగా మువ్వలు కడ్తాను.
సోదరుడు: సోదరి! నీ లంగా కుచ్చులకు పువ్వులు కట్టి వెళ్తాను
సోదరి: పన్నెండు పూల తీగతో గుర్రాన్ని అలంకరించాను. ఎక్కి వెళ్ళు.
తీజ్ పాట -2
1 నూకూ మేలు మారో బాపూనకే – బాపు ఆయో అబ్ దూలేమా
బేసకాని జావరే మళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
2 నూకూ మేలు మారో యాడీనకే – యాడి ఆయి అబ్ దూలేమా
బేసకాని జావరే మళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
3 నూకూ మేలు మారో కాకనకే – కాక ఆయో అబ్ దూలేమా
బేసకాని జావరే మాళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
4 నూకూ మేలు మారో కాకినకే – కాకి ఆయి అబ్ దూలేమా
బేసకాని జావరే మళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
5 నూకూ మేలు మారో వీరానకే – వీర ఆయో అబ్ దూలేమా
బేసకాని జావరే మళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
6 నూకూ మేలు మారో భొజాయినకే – భొజాయి ఆయి అబ్ దూలేమా
బేసకాని జావరే మళాయేమా – కాజళ్యా ఫేరీ అబ్ దూలేమా
తెలుగు అర్థం : అత్తగారింట్లో ఉన్న అమ్మాయి కోసం తల్లిగారింటి వాళ్ళు ఆమె ఇంటికి వెళతారు. గతంలో అత్తగారింట్లో అమ్మాయిలు పెద్దల ఎదుట మాట్లాడకుండా ఉండాలి. అటువంటి సమయంలో తన అత్తగారింటికి వచ్చిన బంధువులని చూసి అమ్మాయి క్రింది విధంగా తన మనసులో అనుకుంటుంది.
‘మా నాన్న వచ్చారు మా ఇంటికి. వెనక్కి ఎలా పంపించేయను? పందిరి కింద కూర్చున్న మా వాళ్ళందరితో మా నాన్న కూచుంటే బావుండును. అలాగే మా అమ్మ, బాబాయి, పిన్ని, అన్న, వదిన వచ్చారు. వారూ సాదర గౌరవం పొంది నన్ను పుట్టింటికి తీసుకువెళ్తే బావుండు అని ఆశపడ్తుంది.
తీజ్ పాట -3
ప।। ఆట్ ఘడియారి ఛపన దరవాజ ।।2।।
కతకేన పడియ చోర్
చోర్ మిర్జా టోపీ వాళోయే ।।కత।।
చ।। హసలో ఘాల పలంగ పర సూతి ।।2।।
లేగో గదడి మరోడ్
మరోడ్ మిర్జా టోపీ వాళోయే ।।లేగో।।
ఉట నణదోలి దివలో లగాల
తారో భాయి చోర్
చోర్ మిర్జా టోపి వాళోయే
ఘరకో దేవర చోర్
చోర్ మిర్జా టోపీ వాళోయే ।।ఆట్।।
చ।। భురియా ఘాల పలంగ పర సూతి ।।2।।
లేగో నాక్ మరోడ్
మరోడ్ మిర్జా టోపి వాళోయే ।।లేగో।।
ఉట నణదోలి దివలో లగాల
తారోభాయి చోర్
చోర్ మిర్జా టోపీ వాళోయే
ఘరకో దేవర చోర్
చోర్ మిర్జా టోపీ వాళోయే ।।ఆట్।।
తెలుగు అర్థం :
ఇంటి పెద్ద కొడుకు పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళి ఉంటాడు. అతను లేని సమయంలో ఇంట్లో అతని భార్య నిద్రిస్తుండగా ఆమె గొలుసు మరియు ముక్కెర దొంగిలించబడుతుంది. దాంతో నిద్ర నుండి మేల్కొన్న ఆమె తన ఆడపడుచుతో చేసే సంభాషణయే ఈ పాట.
8 గడీలు (అంతస్థులు), 56 దరవాజలున్న ఈ ఇంట్లోకి దొంగలు ఎలా వస్తారు? (ఇంట్లో వాళ్ళకే ఎవరు ఎక్కడుంటారనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో)
దొంగ తలపాగ ధరించి ఉన్నాడు.
ఓ మరదలా! లేవమ్మా.
లేచి దీపం వెలిగించు.
నేను మెడలో గొలుసు వేసుకొని పలంగ్ పైన పడుకొని
ఉంటే దొంగ నా మెడలని విరిచి గొలుసు లాక్కెళ్ళి పోయాడు. ఆ దొంగ ఎవరో కాదు. నీ సోదరుడైన నా మరిది గారే.
దొంగ తలపాగ ధరించి ఉన్నాడు.
లేవమ్మా మరదలా! లేచి దీపం వెలిగించు.
ముక్కెర వేసుకొని పలంగ్ పైన నేను పడుకొని ఉంటే నా ముక్కు విరిచి ముక్కెర లాక్కెళ్ళిపోయాడు. దొంగ ఎవరో కాదు. నీ సోదరుడైన నా మరిదిగారే.
- అజ్మీర శైలజ
(టీఆర్సీ జర్నల్ ఆఫ్ తెలంగాణ స్టడీస్ నుండి)