ఈరోజు 19-10-2022న తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి ఎంబీ భవన్ యశోదనగర్ లోని బాలోత్సవం కార్యాలయంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ – హైదరాబాద్’ సంస్థవారు ప్రచురించిన ఉమ్మడి తెలంగాణా 10 జిల్లాల బడిపిల్లల కథలు, బాలచెలిమి నిర్వహణలో బడిపిల్లలు వ్రాసిన బాలల సాహిత్య కథల్ని సాహితీవేత్తలు ఎంపికచేసిన కథల పుస్తకాల్ని అమరావతి బాలోత్సవం కార్యదర్శి మురళిక్రిష్ణ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు అత్యంత అనందాన్నిచ్చేది ఆట బొమ్మలు, కథల పుస్తకాలే అన్నారు. పిల్లల్లో నైతికతను, సృజనాత్మకతను పెంచి వారి ఊహలకు ప్రాణం పోస్తాయన్నారు. తిరుపతి బాలోత్సవం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ పిల్లలు కథలు చెప్పే అవ్వాతాతలకు దూరమై, సెల్ ఫోన్‍కు దగ్గరై బాల్యంలో పొందాల్సిన అనుభూతులకు దూర మవుతున్నారన్నారు. స్వేచ్ఛగా మాటల్లేవ్, పాటల్లేవ్, ఆటల్లేవ్, అంతా యాంత్రికమే ఇటువంటి పరిస్థితుల్లో నుండి బాలల బాల్యాన్ని బయట పడేయటానికి కృషి చేస్తున్న ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ- హైదరాబాద్’ వ్యవస్థాపకులు మణికొండ వేదకుమార్‍గారికి, వారి సంపాదకత్వంలో ప్రచురించిన బాలచెలిమి తెలంగాణ 10 జిల్లాల బడిపిల్లల కథలకు కన్వీనరుగా వ్యవహరించిన గరిపల్లి అశోక్ గారికి ధన్యవాదాలు తెలియ చేసారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తిరుపతి బాలోత్సవం నాయకులు పి. గురునాథం, ఎస్.రెడ్డెప్ప. పి. మునిరామయ్య, చంద్రశేఖర్, పి. మోహనమూర్తి, ఎం. గంగులప్ప, శ్రీమతి భాగ్యమ్మ గారు పాల్గొన్నారు.
- మల్లారపు నాగార్జున, ఎ: 939800068