ఆయిల్ పామ్‍ను వంటనూనెగా ఉపయోగిస్తారు అని మాత్రమే మనకు తెలుసు. కాని ఆయిల్ పామ్‍ను జీవ ఇంధనంగా ఉపయోగించి ఇండోనేషియా దేశంలో విమానాన్ని నడిపించారు.
పామాయిల్ నూనె కున్న డిమాండ్‍ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం NAMEO-OP పథకం క్రింద రైతులను ప్రోత్సహిస్తున్నది.
అర్హతలు:
అనువైన భూమి, పట్టాదార్ పాస్‍బుక్, బోరు, కరెంట్ వసతులు కలిగియున్న ప్రతి రైతు ఆయిల్‍పామ్ తోట సాగు చేయవచ్చు.
రైతు వాటా:
ఒక మొక్కకు రూ.20/- చొప్పున ఎకరానికి రూ.1140/- ణణ ద్వారా జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి పేరున చెల్లించి నర్సరీ నుండి ఎకరానికి 57 మొక్కలు చొప్పున పొందవచ్చు.
డ్రిప్:
ప్రతి ఆయిల్ పామ్ రైతుకు డ్రిప్ సౌకర్యం రాయితీపై 12 ఎకరాల వరకు కల్పించబడును.
రాయితీలు :
ఒక ఎకరం ఆయిల్ పామ్ సాగుకు మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగు, ఎరువులు మరియు పంట యాజమాన్యం కొరకు సుమారు 51,000 రూపాయలు రాయితీ కల్పించబడును.
మొదటి నాలుగు సంవత్సరములు ఎకరానికి అంతర పంటల కొరకు రూ.2100/-, ఆయిల్ పామ్ తోట యాజమాన్యంనకు రూ.2100/-, మొత్తం ఒక సంవత్సరమునకు రూ.4200/- చొప్పున రైతు రన్నింగ్ బాంకు ఖాతాకు ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తదుపరి జమ చేయబడును. వివరములు
క్రమ వివరములు ఎకరానికి రాయితీ సంఖ్య (రూ.లలో)
ఇంతే కాకుండా ఆయిల్ పామ్ గెలలు ప్యాక్టరీకి చేర్చినందుకు రవాణా చార్జిల క్రింద ఆయిల్ పామ్ కంపెనీవారు రైతు బ్యాంకు ఖాతాకు దూరాన్ని బట్టి ఒక టన్నుకు రూ.370/- నుండి రూ.900/- వరకు చెల్లిస్తారు.
ఆయిల్ పామ్ గెలల ధరలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ రైతుకు గిట్టుబాటు అవుతుంది. 2022వ సంవత్సరము జూన్ నెలలో రష్యా ఉక్రైయిన్ యుద్దం సమయంలో ఆయిల్ పామ్ గెలలు టన్ను రేటు ధర రూ.23,467కు పెరిగింది. తరువాత తగ్గింది. పెరిగి తగ్గిన ధరలకు ఆయిల్ పామ్ డిమాండ్ తగ్గినదని రైతులకు ఒక అపోహ వచ్చింది. కాని అది నిజం కాదు.
మనం సగటున ఒక సంవత్సరానికి 16 కేజీల వంటనూనెను వాడతాం. ఆ విధంగా 2025 సంవత్సరం వరకు మన దేశంలో నూనె వినియోగం 30 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా. మన దగ్గర నూనె ఉత్పత్తి కేవలం 7.5 మిలియన్ టన్నులు మాత్రమే. అంటే మనం విదేశాలనుంచి నూనె దిగుమతి చేసుకొని చాలా విదేశీ మారకద్రవ్యంను ఖర్చు చేస్తున్నాం.
మిగిలిన నూనె పంటలు, అనగా సోయాబిన్, వేరుశెనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలుతో పోల్చుకుంటే ఆయిల్ పామ్ ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ నూనెను పొందవచ్చు.
ఆయిల్ పామ్ అధిక ఆదాయాన్ని ఇచ్చే డిమాండ్ గల పంట. ఈ పంటకు చీడ పీడలు తక్కువ. కోతులు, కుక్కల బెడద ఉండదు. దొంగతనం సమస్య ఉండదు. గిట్టుబాటు ధర ఉంటుంది. ఈ పంటకు దళారీలు ఉండరు. రవాణాకు ఇబ్బంది ఉండదు. ఫాక్టరీకి ఆయిల్ పామ్ గెలలు పంపించిన వెంటనే రవాణా చార్జీలతో సహా ఆయిల్ పామ్ గెలల ఖరీదు రైతుల రన్నింగ్ బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడిల ఆదాయం వస్తుంది.
తెలంగాణా రాష్ట్రంలో భదాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా ఉన్నది. APC శ్రీ.రఘునంధన్ రావు, IAS గారు, ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు శ్రీ యం. హనుమంత రావు, IAS గారు ఆయిల్ పామ్ పంటకు గల డిమాండ్‍ను గుర్తించి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ పంటగా అధిక ఆదాయం గల ఆయిల్ పామ్ పంటను అందరు రైతులు సాగు చేయటానికి తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు లక్ష్యాలు నిర్దేశించారు. ఫ్యాక్టరీలు రైతులకు అందుబాటులో ఉండునట్లు చర్యలు తీసుకొన్నారు. ఆయిల్ పామ్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరములు అంతర పంటలుగా అరటి, బొప్పాయి, జామ, మల్బరీ, మొక్కజొన్న, కూరగాయలు, వేరుశెనగ, కందులు, పెసర, పొద్దుతిరుగుడు, కుసుమలు, మిరప, పత్తి మరియు పశుగ్రాసం వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చు.
ఏడు సంవత్సరముల తరువాత మిరియాలు, కొకో, వక్క, జాజికాయ, ఫైనాపిల్ లాంటి ఖరీదైన పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ తోటచుట్టూ బోర్డర్ ప్లాంటేషన్‍గా వెదురు, టేకు, శ్రీగంధం, సరుగుడు చెట్లు పెంచి తరతరాలుగా నిరంతర ఆదాయం పొందవచ్చు.
పామాయిల్ నూనె చవకైనదే కాకుండా చాలా ఆరోగ్యకరం…
- ఈ నూనెలో కొలెస్టరాల్ శాతం కూడా తక్కువే. పైగా ఆరోగ్యకరమైన శాచురేటేడ్ వెజిటబుల్ ఫ్యాట్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి.
- ఈ నూనెలోని విటమిన్ ‘‘E’’ మరియు టోకోఎట్రీనాల్ అనే యాంటిఆక్సిడెంట్స్ డిస్ట్రక్టివ్ డ్యామేజీని అరికట్టి మెదడు కణాలకు రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా డేమెన్షియా, అల్జీమరాప్లాంటీ రుగ్మతలు దరిచేరవు.
- పామాయిల్ రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పెరుకునే సమస్య ఉండదు.
ఈ సంవత్సరం ఆయిల్ పామ్ సాగును ఇంకా ప్రోత్సహించడానికి భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అల, IAS గారి పర్యవేక్షణలో ఆయిల్ పామ్ రైతులకు పాటలు, నాటికలు, లఘుచిత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు.
ఆయిల్ పామ్ వంట నూనెగా ఉపయోగపడుతుండటంతో పాటు విమానాలకు ఇంధనంగా కూడా వినియోగించవచ్చని తెలుస్తుంది. జీవ ఇంధనంగా ఆయిల్ పామ్ వినియోగం పెరిగితే ఆయిల్ పామ్ సాగుకు డిమాండ్ పెరిగి ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. తర్వాత విమానంతో పాటు స్కూటర్లు, కార్లు నడపడానికి కూడా ఆయిల్ పామ్ ఇంధనం ఉపయోగపడే రోజు దగ్గరలోనే ఉంది.
తెలంగాణా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రాణం పోసిన వ్యక్తి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు నేడు తెలంగాణా వ్యవసాయ మంత్రిగా పనిచేస్తుండడం తెలంగాణా రైతుల అద•ష్టం. కొత్త పంటల తీరు తెన్నులు పరిశీలించి ఆ పంటలను ముందుగా తాను సాగుచేసి రైతులకు భరోసా ఇచ్చి అదర్శంగా నిలుస్తున్నారు. ఆయిల్ పామ్, కొబ్బరి, కొకో, మిరియాలు, జాజికాయ వంటి పంటలను సాగుచేస్తూ, ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తూ రైతు రాజుగా మారాలని నిరంతరం శ్రమించే వ్యక్తి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు. ఆయిల్ పామ్ వాటి అంతర పంటల ఆదాయం సాఫ్ట్ వేర్ జీతానికి తక్కువ కాదని మొదటిగా నిరూపించిన క•షివలుడు. తెలంగాణా రైతులకు మార్గదర్శి. స్వయంగా రైతు అయిన ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఈ తరుణంలో ఆయిల్ పామ్‍తో పాటు అన్ని పంటలతో రైతు భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుండనడంలో ఎలాంటి సందేహం లేదు.
- సముద్రాల విజయ్ కుమార్
ఎ: 837444992