మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము

‘ఆరోగ్యమే మహాభాగ్యము’’ మనిషి ఎంత సంపాదించాడన్నది ముఖ్యం కాదు. ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలిగాడన్నదే ముఖ్యం. ఆరోగ్యమే అసలైన సంపద. కాబట్టి ఆరోగ్యవంతులే భాగ్యవంతులు’’.


ఆరోగ్య సంపద కావాలంటే ‘చిరు’ధాన్యాలను ‘సిరి’ ధాన్యాలుగా భావించాలి. అవి చిన్న గింజలుగా కనిపించే ఆహార ధాన్యాన్ని మిల్లెట్స్ అంటారు. గడ్డి మొక్కల నుండి లభించే ధాన్యం ఇది. ఇప్పుడు సామలు, అరికలు, ఊదలు, కొర్రలు మరియు అండు కొర్రలు ఆరంటిని సిరిధాన్యాలుగా పిలుచుకుంటున్నాము. దీర్ఘకాలంగా వివిధ రోగాల బారిన పడిన వారే కాకుండా, కొన్నింటికి మందులే లేవని డాక్టర్స పెదవి విరిచినా సిరిధాన్యాలను పద్దతి ననుసరించి క్రమం తప్పకుండా వినియోగించి ఆరోగ్యవంతులుగా మారి ఆనందంగా ఉంటున్నారని, అందువలన అందరూ నిత్య ఆహారంగా అలవాటు చేసుకోవాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా।। ఖాదర్‍వలీగారు కోరారు.


సంక్రాంతి పర్వదినమే కాకుండా తన జన్మదినమైన జనవరి 15న సాయంత్రం గం।।7.30 ని।।లకు ప్రారంభమైన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా।। వలీగారు సంక్రాంతికి సరిధాన్యాలకు ఉన్న సంబంధాన్ని ఉదహరిస్తూ, ఈ సీజన్‍లో సిరిధాన్యాలు ఆరోగ్యదాయకంగా పనిచేస్తాయని చెప్తూ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారు వీటి ఫలితాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా సిరిధాన్యాలను పండించి వినియోగింపజేసి భారతదేశాన్ని ఆరోగ్యదేశంగా కనిపింప జేయాలని ఈ దేశ రైతులకు పిలుపు నిచ్చినట్టు గుర్తు చేస్తూ మాధవరం సెరెనిటీలో కూడీ వీటిని వినియోగిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్న తన అభిప్రయాఆన్ని వ్యక్తపరిచారు. దాదాపు గంటకు పైగా నిశ్శబ్దంగా సాగిన వారి ప్రసంగం ఇంకా చెప్తే వినాలన్నంతగా ఆకట్టుకుంది.


కర్మనఘాట్‍ మెయిన్‍ రోడ్‍లో ప్రముఖ గేటెడ్‍ కమ్యూనిటీగా పేరొందిన ‘మాధవరం సెరెనిటీ’లో మేనేజింగ్‍ కమిటీ, సీనియర్‍ సిటిజన్స్ అసోసియేషన్‍, వాకర్స్ అసోసియేషన్‍ మూడు సంఘాలు కలిసి ఏర్పాటుగావించిన ఈ సమావేశము మొదట సీనియర్‍ సిటిజన్స్ అసోసియేషన్‍ ప్రధాన కార్యదర్శి దివాకర్‍రావుగారి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. ఆ వెంటనే అతిథులచే దీపారాధన వాకర్స్ అసోసియేషన్‍ కోశాధికారి ప్రార్థనాగీతం ఆలాపనలు జరిగాయి. సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన సీనియర్‍ సిటిజన్స్ అసోసియేషన్‍ అధ్యక్షులు, లయన్‍. సముద్రాల ధనుంజయగారు మాట్లాడుతూ మన ఆహారమే మన ఆరోగ్య మంటూ సిరిధాన్యాల ఫలితానికి తానే నిదర్శనమంటూ, తనకు ఈ మధ్య డయాబెటీస్‍ అని తెలియగానే డాక్టర్స్ దగ్గరకు వెళ్ళకుండా వేదికపైనున్న తన మిత్రుల సలహాపై సిరిధాన్యాలనే ఆహారంగా బుజించి ‘సుగర్‍’ను పూర్తిగా నిర్మూలించుకోగలిగానని గర్వంగా చెప్పుకోగలిగారు.


ఆ తరువాత మాధవరం సెరెనిటీ మేనేజింగ్‍ కమిటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండారు మక్షహనమ్మగారు మాట్లాడుతూ సిరిధాన్యాలకు సంబంధించిన ఓ మంచి కార్యక్రమం సెరెనిటీలో ఏర్పాటు చేయడం అందరూ అదృష్టంగా భావించాలని, పెద్దలు చెప్పే వాటిని పాటించాలని కోరారు.


విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు Er. ఎమ్‍.శ్యామ్‍ప్రసాద్‍రెడ్డి డా।। ఖాదర్‍వలీ గారిని సభకు పరిచయం చేస్తూ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉండి అక్కడే స్థిరపడే సమయంలో మాతృదేశంపై ఉన్న ప్రేమాభిమానాలు ఒక్కసారిగా ప్రేరేపించగా వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి ఈ విధంగా సేవలందిస్తున్నట్టు చెప్పారు.


మరో విశిష్ట అతిథి అర్బన్‍ & రీజనల్‍ ప్లానర్‍ మరియు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టీ చైర్మన్‍ Er. మణికొండ వేదకుమార్‍గారు ప్రసంగిస్తూ తాను కూడా డా।। ఖాదర్‍ వలీ గారిని కల్సిన స్ఫూర్తితో సిరిధాన్యాల వినియోగదారుడనని, వాటి వలన మనకు లభించే ఆరోగ్య ఉపయోగాలను వివరించడమే కాకుండా సిరిధాన్యాలను పండిస్తున్నట్టు తెలిపారు.


ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ Er. ఎస్‍. ముత్యపురెడ్డి మాట్లాడుతూ ఎటువంటి జబ్బుకైనా సరిధాన్యమే సిసలైన మందని ఒక్క మాటలో చెప్తూ ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉన్నా తనను ప్రత్యక్షంగా లేదా ఫోన్‍ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.


సమావేశంలో గౌరవంగా అతిథులను సత్కరించడం జరిగింది. ఈ సత్కార కార్యక్రమంలో మేనేజింగ్‍ కమిటీ ట్రెజరర్‍ పి.ఎమ్‍.వి.సుబ్బయ్యగారు, సీనియర్‍ సిటిజన్స్ అసోసియేషన్‍ ట్రెజరర్‍ ఆర్‍. వెంకట్‍రెడ్డిగారు సహకరించారు. కార్యక్రమ ముఖ్య కారకులైన సముద్రాల ధనంజయ్‍గారిని అతిథులు సత్కరించారు. ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్‍ అధ్యక్షులు రజిత్‍రెడ్డి గారు, జాలీవాకర్‍ మురళీ కృష్ణరాజుగారు, చింతపల్లి సాయిబాబా దేవాలయం ధర్మకర్త చింతపల్లి ధనంజయగారు, తదితరులు పాల్గొన్నారు. ఎన్‍ఆర్‍ఐ డా।। రాముల వారి సతీమణి డా।। సుశీల సముద్రాల గారిని ఈ వేదికపై శాలువాతో ఘనంగా సన్మానించారు. చివరగా శ్రీ దివాకర్‍రావుగారి వందన సమర్పణతో ఆనాటి కార్యక్రమం ముగిసింది.

  • దివాకర్‍రావు
    కార్యదర్శి, సీనియర్‍ సిటిజన్స్, మాధవరం సెరెనిటీ
    ఎ : 939137240

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *