స్వర్ణసంహిత

మనకు అసలు పరిచయం అవసరం లేని లోహం బంగారం, ఆఫ్రికాలోని అడవి బిడ్డల నుండి అమెరికా లోని స్టాక్‍ మార్కెట్‍ మదుపరుల దాక అందరు కావలనుకునేది ఈ బంగారాన్నే. మానవుడు సంఘజీవిగా మారిన తొలి దశ నుండి నేటి వరకు అన్ని నాగరికతలకు అవసరమైన పదార్ధం ఏదన్నా
ఉందంటే అది బంగారమే. విలువయిన దాన్ని, అరుదైన వాటిని బంగారం తోటే పోలుస్తారు. నాగరికత తొలిదశ నుండి బులియన్‍ గా ఉపయోగపడి నేటి వరకు అలాగే కొనసాగుతోంది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది దీని ఉపయోగాలు అంతకంతకూ పెరుగు తున్నాయి.


మన సంస్క•తి-బంగారం:

బంగారం మన సంస్క•తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, దీనికి అనేక దైవిక లక్షణాలు ఆపాదించ బడ్డాయి.
తైతరేయ స్మ•త మరియు శతపధ బ్రాహ్మణాలలో బంగారాన్ని వేరు చేయడనికి మట్టిని కడగడం గురించి ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో సింధు నదిని హిరణ్మయి అని, సరస్వతి నది హిరణ్య వర్తనిగా వర్ణించబడింది. బంగారు కరెన్సీ బరువు ‘‘అష్టప్రద్‍’’, కటకసంహిత మరియు తైత్తిరేయ సంహితలో ప్రస్తావించ బడింది. బంగారు శతమానం అంటే శతపధబ్రాహ్మణంలో 100 క•ష్ణలు. బ•హదారణ్యకోపనిషత్‍లో యాజ్ఞవల్క్యునికి 1000 బంగారు మాడలతో కూడిన గోవు దానముగా లభించిందని పేర్కొనబడింది. వాజసనేయి సంహిత స్వర్ణకారుల గురించి ప్రస్తావించింది. ఇలా బంగారం గురించి వేద సాహిత్యంలో అసంఖ్యాకమైన ప్రస్తావన చూడవచ్చు. హరప్పా నాగరికత లో కూడా బంగారు నగలు వాడేవారు.
మన ప్రాచీన సాహిత్యంలో బంగారం ప్రస్తావనలు ప్రతిచోటా కనిపిస్తాయి. సాగరమధనంలో మహాలక్ష్మి ఆవిర్భవించినప్పుడు విశ్వకర్మ కాంచనకటకారులు బహుకరించినట్టుగా భాగవతంలో పోతన పేర్కొన్నాడు. ఋగ్వేదంలో బంగారం, (నిష్కం మరియు నిష్కగ్రీవ) ప్రస్తావన ఉంది. జాత్రపు, హిరణ్య మొదలైన పేర్లను బంగారం కలిగి ఉంది.
బంగారం వాడుక:
3100 దీ• నాటికి ఈజిప్షియన్లు ‘‘బంగారంలో ఒక భాగం, వెండి రెండున్నర భాగాలకు సమానం’’ అనే కోడ్‍ను అభివ•ద్ధి చేశారు. తరువాతి కాలంలో రోమన్లు బంగారం కోసం విస్త•తంగా తవ్వకాలు జరిపారు. నాగరికతలు తమ పరిణామ క్రమంలో డబ్బును కనుగొన్నాయి. బంగారాన్ని అప్పటి నుంచి కరెన్సీగా వాడుతున్నారు. ప్రారంభ రోజుల్లో కోలార్‍ మాస్కీ ప్రాంతాలను పాలించిన భారతీయ రాజులు బంగారు నాణేలను ముద్రించారు. చరిత్ర ప్రారంభలో కుషాణులు మరియు గుప్త రాజులు కూడా బంగారు నాణేలను ముద్రించారు. భారతదేశంలో బంగారం సహజ స్థితిలో అందుబాటులో ఉన్నప్పటికీ, వాణిజ్యం మరియు వ్యాపారం కారణంగా చాలా బంగారం ఇండియాలోకి చేరడం జరిగింది. రోమన్లు సుగంధద్రవ్యాలు, రత్నాలు, మరియు వస్త్రాలతో బంగారాన్ని మార్చుకున్నారు. భారతదేశానికి ‘‘సింక్‍ హోల్‍ ఆఫ్‍ గోల్డ్’’ అనే మారుపేరు వచ్చింది. పోర్చుగీస్‍ మరియు ఇతర యూరోపియన్‍ దేశాలు కూడా సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటికి బదులుగా భారతదేశంతో బంగారంతో వ్యాపారం చేశాయి.
బంగారం భౌతిక స్వభావం:
బంగారం యొక్క సాగే గుణం చాలా ఎక్కువ ఒక ఔన్స్(28 గ్రాములు) బంగారాన్ని 5 మైక్రో మీటర్ల మందంతో 8 కి.మీ వైర్‍ గా లాగవచ్చు. అలాగే దీని పరుచుకునే గుణం కూడా చాల ఎక్కువ, ఒక ఔన్స్ బంగారాన్ని ఒక 100 చదరపు అడుగుల వెడల్పు కలిగిన అతి పలుచని పొరగా చెయ్యవచ్చు. పైగా తుప్పు పట్టదు, మెరుస్తుంది ఇంకా ఇది ఒక మంచి విద్యుత్వాహకము. ఈ లక్షణాల వల్ల బంగారం బహుళ ఉపయోగకారి.
బంగారం యొక్క ఖనిజ సమాచారం:
బంగారం ఫార్ములా Au. కాంతివంతమైన పసుపు, పెరుగుతున్న వెండి శాతం తో తెల్లటి పసుపు రంగులో కనిపిస్తుంది. పలుచని బంగారురేకు కాంతిప్రసారంలో నీలం మరియు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. లోహపు మెరుపు కలిగివుంటుంది. కాఠిన్యం :2 1/2 నుండి 3 వరకు, విశిష్ట గురుత్వం (specific gravity): 15 నుండి19.3 వరకు, ఐసోమెట్రిక్‍ స్పటిక వ్యవస్థ (crystal system) కలిగినది బంగారం.
బంగారం-లభ్యత:
సహజ(native) రూపంలో లభించే లోహంలో బంగారం ఒకటి. ఇది ప్లేసర్‍లలో ముద్దలు మరియు బంగారు రేణువులుగా లభిస్తుంది ఎక్కువ ప్రాసెసింగ్‍ లేకుండానే ఇలాంటి బంగారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా దొరికే బంగారం లోహమే కాకుండా ఖనిజం కూడా. నిర్దిష్ట రసాయన సూత్రం మరియు క్రిస్టల్‍ వ్యవస్థతోపాటు ఇతర ఖనిజ లక్షణాలు కలిగి ఉన్నందున దీన్ని ఖనిజంగా పరిగణించవచ్చు.
బంగారం నిక్షేపాలు 8 రకాలుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.
అవి 1. క్వార్టజ్ బంగారు ధాతువు 2. నీలంవెండి బంగారు ధాతువు 3. ఐరన్‍ ఆక్సైడ్‍ రాగి బంగారు ధాతువు 4. గోల్డ్ సల్ఫైడ్‍ ధాతువు 5. నీలం మట్టి (•శ్రీ••) బంగారు ధాతువు 6. టెల్లూరియం బంగారు ధాతువు 7. ఆర్సెనోపైరైట్‍లో బంగారం 8. గ్రానైట్లో బంగారు ధాతువు.
ఇలా ఎనిమిది రకాల ధాతువులు బంగారానికి మూలాలు. సింగ్భూమ్‍ క్రాటన్‍లో మరో కొత్త రకమైన అసోసియేషన్‍లో బంగారం ఖనిజం ఉందని జియాలజిస్టులు అన్నారు.


భారతదేశంలో బంగారు ఖనిజ నిక్షేపాలు/వనరులు:
బంగారు ధాతువు (ore) : 501839632 టన్నులు.
బంగారు లోహం (metal) : 654.74 టన్నులు.
బంగారం ప్లేసర్స్ (placers): ధాతువు 261210000 టన్నులు, లోహం 5.86టన్నులు.


సహజ బంగారం ఇండియాలో ప్లేసర్‍ గోల్డ్గా లభిస్తోంది. ప్లేసర్లు రెండు రకాలు, పేలియో ప్లేసర్‍ మరియు ఒండ్రు మట్టి మరియు నది ఇసుకలో ఉండే ప్లేసర్స్. 959 నుండి 1000 స్వచ్ఛత స్థాయిలు కలిగిన హై ప్యూరిటీ ప్లేసర్‍లు కేరళలోని నిలంబూర్‍ వైనాడ్‍ బంగారు క్షేత్రాలలో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో సింఘ్భామ్‍లోని ధజోరీ బేసిన్‍లో ఉన్న నియోఆర్కియన్‍-పేలియో ప్రొటెరోజోయిక్‍ స్థరాల మధ్య పేలియో ప్లేసర్‍ నిక్షేపాలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎల్లువియల్‍, ఒండ్రు మరియు కొలువియల్‍ జోన్‍ల నుండి ప్రస్తుతం ప్లేసర్‍ బంగారం స్థానికంగా రికవరీ చేయబడుతోంది.


జార్ఖండ్‍లోని సుబర్ణరేఖ నది, ఆంధ్రలోని స్వర్ణముఖి నది, శివాలిక్‍ హిల్స్లో గల అనేక చిన్న ప్రవాహాల లో బంగారంతో కుడిన ప్లేసర్‍ ఇసుక /మట్టి ఉంది. ఇవి వివిధ రకాల ప్లేసర్‍ల ఉదాహరణలు మాత్రమే. వివిధ రకాల ప్లేసర్‍ బంగారం భారతదేశంలో అనేక ప్రదేశాలలో ఉన్నది.
బంగారం యొక్క అతిపెద్ద ప్రాథమిక వనరులు బీహార్‍లో 44%, రాజస్థాన్‍లో 25% కర్ణాటకలో 21%, పశ్చిమ బెంగాల్‍లో 3% ఆంధ్రాలో 3% మరియు జార్ఖండ్‍లో 2% ఉన్నాయి. తెలంగాణ లో ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండజిల్లాలో పెద్దవూర, బంగారిగడ్డ మొదలయిన గ్రామాలు దగ్గర బంగారం ఉనికి ఉన్నది. గ్రామం పేరు కూడా బంగారుగడ్డ అని ఉండడం ఒక విశేషం. గద్వాల్‍ సిస్ట్ బెల్ట్లో ఆత్కూరు, ధరూరు వద్ద మెటా బసాల్ట్లోని పెగ్మాటైట్‍, క్వార్టజ్ సిరలలో 25 ppb• నుండి 165 ppbగా బంగారం నమోదు చేయబడింది.
భారతదేశంలో బంగారం ఉత్పత్తి:
ప్రపంచ బంగారం ఉత్పత్తిలో భారతదేశం 2019-20లో IBM Report ప్రకారం1724 కిలోల ఉత్పత్తితో 60వ స్థానంలో ఉంది . బంగారు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది, ఆస్ట్రేలియా మరియు రష్యా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశంలో బంగారం ఉత్పత్తి మొత్తం కర్ణాటక నుంచే.హట్టి బంగారు గనులు (HGML) ద్వారా జరుగుతూంది. 2017-18 సంవత్సరంలో జార్ఖండ్‍ నుండి ఒక ప్రైవేట్‍ కంపెనీ ద్వారా 11 కిలోలు, ఆ తరవాత 2018-19 సం.లో 3 కిలోల ఉత్పత్తి జరిగింది. BGML ద్వారా చిత్తూరులోని చిగురుగుంటగనిలో, అనంతపురం లోని యెప్పమన, కర్ణాటకలోని కోలార్‍ గనిలో ఉత్పత్తి జరిగేది. 1.3.2001 నుండి ఈ గనులు మూత పడ్డాయి.
ఆంధ్రాలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల బంగారం దొరుకు తుంది. అన్వేషణలు కూడా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో మైనింగ్‍ కోసం ప్రైవేట్‍ కంపెనీకి మైనింగ్‍ లీజు మంజూరు అయినది.


WORLD GOLD COUNCIL అంచనా ప్రాకారం భారతదేశంలో వార్షికంగా 750 టన్నుల వరకు డిమాండ్‍ ఉంటుంది. భారతదేశం రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారుగా ప్రసిద్ధి చెందింది. చైనా మాత్రమే మనను అధిగమించింది. రిజర్వ్ బ్యాంక్‍ వద్ద 795 టన్నుల బంగారం నిలవ ఉంది కానీ, భారతదేశంలో అందరి దగ్గర కలిపి 21,000 నుండి 25,000 టన్నుల దాకా బంగారం ఉందని అంచనా. చాలా దేవాలయాలలో గణనీయమైన బంగారు ఆభరణాలు మరియు నిల్వలు ఉన్నాయి. ఇవి ఏటా పెరుగుతున్నాయి .


బంగారం ఉపయోగాలు:
అనేక ప్రత్యేకతలు కల ఈ లోహం ఆభరణాలు మరియు అలంకారాలు, వస్త్రాలు, నాణేలు పతకాలు బహుమతులు మొదలైన వాటికీ పనికిరావటం అందరికి తెలుసు. పలుచగా సాగేగుణం వల్ల బంగారు రేకులు ఆహార పదార్థాలకు పూతగ వాడుతారు. డెంటిస్ట్రీలో బంగారం ఎప్పటినుండో వాడుతున్నారు. దాని విద్యుత్‍ వాహకత కారణంగా ఎలక్ట్రికల్‍, ఎలక్ట్రానిక్‍ పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు. అంతరిక్ష పరిశ్రమ, ఉపగ్రహ తయారీలో కూడా వాడుతారు.
బంగారాన్ని పారిశ్రామికంగా ఉపయోగించడం ఎన్నో రకాలుగా ఉంటుంది. కంప్యూటర్స్, సెల్‍ ఫోన్‍లో బంగారం
ఉంటుంది. నానో టెక్నాలజీ ఇన్‍స్ట్రుమెంట్స్లో దీని ఉపయోగం రోజు రోజు పెరుగుతుంది.
వైద్య ఉపయోగాలు:
కీళ్లనొప్పులు, కండర సంబంధిత రుగ్మతలు, క్యాన్సర్‍ చికిత్స వంటి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. బంగారు సమ్మేళనాలను యాంటీ ఇన్‍ఫ్లేమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్‍ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఇది బయో కాంపాటాబుల్‍ మెటల్‍ (జీవానుకూల లోహం) కాబట్టి సర్జరీలో ఉపయోగిస్తారు. ఆరోగ్యకరమైన కీళ్ల కోసం మానవ శరీరంలో బంగారం అవసరం ఉంటుంది. 70 కిలోల బరువున్న వ్యక్తిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. బంగారం యొక్క ఉపయోగాలు చాలా సమగ్రమైనవి, ఇక్కడ కొన్ని మాత్రమే ప్రస్తావించబడ్డాయి.
బంగారం-రసవాదం:
మధ్యయుగ కాలంలో రసాయనాన్ని కలపడం ద్వారా బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చు అనే బలమైన నమ్మకం ఉండేది. సైన్స్ అభివ•ద్ధితో అది అసాధ్యం అని నిరూపించబడింది. ఈ రోజుల్లో ఏదైనా తప్పుడు నమ్మకాన్ని ‘‘రసవాదం’’ అంటారు. ఆకుపసరు బండను బంగారంగా మార్చగలదనే నమ్మకం భారతదేశంలో కొంత ఉంది. ‘‘పరసువేది’’ ఒక భ్రమ మాత్రమే.
గుప్త నిధులు:
బంగారం గురించి మాట్లడెటప్పుడు గుప్తనిధుల ప్రస్తావన అనివార్యం. వీటి గురించి మనం తరచుగా వార్తల్లో వింటుంటాం. కొన్నిసార్లు వ్యక్తులు సివిల్‍ కట్టడాలు కోసం లేదా ఇంటిపునాది తవ్వినప్పుడు అనుకోకుండా నిధులు కనుగొంటారు. ఈ రోజుల్లో కొంత మంది నిధులవేటలో పనికట్టుకొని వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో వారు నిజమైన నిధి, మన సాంస్క•తిక వారసత్వ కట్టడాలను నాశనం చేస్తారు. శిల్పసంపదను పాడు చేస్తారు. ఈ పనులు చాలా అనైతికం మరియు చట్టవిరుద్ధం.


గుప్త నిధులు ఆచూకి ఎవరికైనా తెలుస్తే ప్రభుత్వానికీ తెలియ పరచాలి. ఆ సంపద 100 సంవత్సరాల లోపల దాచినదై ఉంటే యజమాని/ ఫైండర్‍ చట్టం ప్రకారం వారి వాటాను పొందుతారు. నిధి 100 సంవత్సరాల కంటే పాతది అయితే, దానిని పురావస్తు పదార్థంగా, వారసత్వ సంపదగా ప్రభుత్వం ప్రకటించవచ్చు . అప్పుడు అధికారిక అంచనా విలువలో కొంత శాతాన్ని యజమాని/ఫైండర్‍ పొందుతాడు. జిల్లా కలెక్టర్‍/ ట్రెజర్‍ ట్రోవ్‍ ఆఫీసర్‍, పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సదరు నిధిని యజమాని లేనిదిగా ప్రకటించవచ్చు.
10 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉండీ భూమిలో దాచిన వస్తువులు ట్రెజర్‍ ట్రోవ్‍ చట్టం ప్రకారం నిధిగా పరిగణించబడతాయి. ఏదైనా నిధిని కనుగొన్నప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం చట్ట ప్రకారం తప్పనిసరి. దేవాలయం మరియు కోటలు మొదలైన వాటి పునాది క్రింద అంతులేని గుప్తనిధులు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. టన్నుల కొద్దీ బంగారాన్ని దాచడం పాత రోజుల్లో అస్సలు సాధ్యం కాదు. అక్కడక్కడ దాచి ఉంచిన చిన్న మొత్తంలో నాణేలు, నగలు ఎక్కడైనా అప్పుడప్పుడు దొరికాయి. గుప్తనిధుల గురించి పుకార్లు మాత్రం చాల విస్త•తంగా వ్యాపించి ఉన్నాయి. ఇదే అదునుగా ప్రజల అమాయకత్వాన్ని దురాశను స్వార్ధపరులు సొమ్ము చేసుకోవటం కూడా జరుగుతుంది.

మెరిసేదంతా బంగారం కాదు:
కొన్ని ఖనిజాలు అచ్చం బంగారం లాగా మెరుస్తూ బంగారమె కావచ్చు అనే భ్రమను స•ష్టిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని:
శైథిల్యం చెందిన అబ్రకపు కణములు. ఇవి ప్రధానంగా గ్రానైటిక్‍ భూభాగంలో త్రవ్వినప్పుడు, చిన్న చిన్న శకలాలు మెరుస్తూ కనిపిస్తాయి. అవి బంగారం కాదు అని పరిశీలిస్తే అర్థమవుతుంది
పైరైట్‍: ఇది బంగారానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఫూల్స్ గోల్డ్ అనే మారుపేరును కలిగిఉంది. ఇది నిజానికి సున్నపురాయిలో కనిపించే ఐరన్‍ సల్ఫైడ్‍ ఖనిజం. క్యూబ్‍ఆకారం లో మెరుస్తున్న బంగారం వంటి భ్రమను స•ష్టిస్తుంది.
చాల్కోపైరైట్‍ కూడా బంగారంలా మెరుస్తుంది.ఇది బంగారు పసుపు రంగుతో ఉండే కాపర్‍ ఐరన్‍ సల్ఫైడ్‍ యొక్క ఖనిజం.
బ్రోంజైట్‍: గేలాక్సీ గ్రానైట్‍లో కనిపించె బంగారు మెరిసే మచ్చలు పైరాక్సిన్‍ ఖనిజం బ్రోంజైట్‍ యొక్క స్ఫటికాలు. కంచు వంటి రంగు కారణంగా బంగారంలా కనిపిస్తాయి.


-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్‍ఐ(రి)
ఎ: 9866449348

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *