ది బిల్‍ ఈస్‍ పాస్డ్

2024 ఫిబ్రవరికి తెలంగాణ బిల్లు పార్లమెంట్‍ ఉభయ సభల ఆమోదం పొంది ఒక దశాబ్ద కాలం గడచింది. ఉభయ సభల ఆమోదం అనంతరం బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. మార్చ్ 1న రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2014 మార్చి 4న భారత ప్రభుత్వం రాజపత్రం జారీ చేసింది. 2014 జూన్‍ 2న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆ రాజపత్రంలో ప్రకటించింది. 2014 ఫిబ్రవరిలో భారత పార్లమెంట్‍ ఉభయ సభల్లో జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది.


2014 ఫిబ్రవరిలో జరిగేవి పార్లమెంట్‍ చివరి సమావేశాలు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాస్‍ కావాలన్నఆకాంక్షతో యావత్‍ తెలంగాణ సమాజం దిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నది. తెలంగాణ ఉద్యమ నాయకు లందరూ దిల్లీలో మకాం వేశారు. ఫిబ్రవరిలో దిల్లీలో చలి వణికిస్తున్నది. అయితే దిల్లీలో రాజకీయ వాతావరణం వేడిగా ఉన్నది. అశోకా రోడ్‍లో ఉన్న ఆంధప్రదేశ్‍ భవన్‍లో ఒకవైపు తెలంగాణవాదులు, మరొకవైపు ఆంధ్రా లాబీయిస్టుల కోలాహలం. కాంగ్రెస్‍ నాయకత్వంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం కూడా తెలంగాణ బిల్లును ఈ సమావేశా ల్లోనే పాస్‍ చేయించాలన్న క•త నిశ్చయంతో ఉన్నట్టు కనిపించింది. ఆంధ్రా లాబీయిస్టులు బిల్లును పార్లమెంట్‍లో ప్రవేశ పెట్టకుండా అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. లగడపాటి పెప్పర్‍ స్ప్రే ఉదంతం ఈ రోజుల్లోనే జరిగింది. తెలంగాణ బిల్లు లోక్‍ సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముందస్తు కుట్రలో భాగంగా లగడపాటి రాజగోపాల్‍ పెప్పర్‍ స్ప్రే చేసిన ఉదంతంలో తెలంగాణ ఎంపీలు శ్రీ పొన్నం ప్రభాకర్‍, శ్రీ సిరిసిల్ల రాజయ్య, దిల్లీ కాంగ్రెస్‍ ఎంపి శ్రీ సందీప్‍ దీక్షిత్‍ తదితర లోక్‍సభ సభ్యులను గాయపడినారు. స్పీకర్‍ స్థానంలో ఉన్న మీరాకుమార్‍ గారు లగడపాటి అనాగరిక చర్యను పార్లమెంట్‍ సత్సంప్రదాయాలకు తగిలిన పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించారు. 16 మంది ఆంధ్రా సభ్యులను సస్పెండ్‍ చేశారు. ఆ తర్వాత లోక్‍ సభలో విస్త•త చర్చ అనంతరం ఫిబ్రకవరి 18న బిల్లు ఆమోదం పొందింది.


ఫిబ్రవరి 20న పార్లమెంట్‍ సమావేశాల చివరి రోజు. ఆ రోజు రాజ్యసభలో బిల్లు పాస్‍ కాకపోతే ఎన్నికల అనంతరం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టవలసి ఉంటుంది. అందరిలో బిల్లు ఆమోదంపై ఆందోళన, ఉద్వేగం ఆవరించింది. రాజ్యసభలో అడ్డం పడతారేమోనన్నభయం వెంటాడుతూనే ఉన్నది. బిజేపి నాయకులు ఏమీ కాదని హామీ ఇస్తున్నా వెంకయ్యనాయుడు బిల్లుపై అనేక అభ్యంతరాలు లేవదీసి బెంబేలెత్తించారు. రాజ్యసభ ఆ రోజు 7 సార్లు వాయిదా పడింది. ఇక్కడ టివిల ముందు కూసున్న ప్రజలకు నరాలు తెగే ఉత్కంఠ. అయితే ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్‍ సింగ్‍ గారు వెంకయ్యనాయుడు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు జవాబు ఇచ్చి వారిని శాంతింప జేశారు. ముఖ్యంగా ఆంధప్రదేశ్‍ రాష్ట్రానికి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని, పన్నుల పంపిణీలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రోత్సాహాకాలు (Incentives) కల్పిస్తామని హామీ ఇచ్చి రాజ్యసభలో బిల్లు పాస్‍ కావడానికి మార్గం సుగమం చేశారు. ఈ మొత్తం పక్రియలో లోక్‍ సభలో, రాజ్యసభలో ఆంధ్రా లాబీయిస్టులకు గట్టి మద్దతు పలికిన వారు త•ణమూల్‍ కాంగ్రెస్‍ ఎంపీలు. తెలంగాణ ఏర్పాటు అయితే బెంగాల్‍లో గూర్ఖాల్యాండ్‍ డిమాండ్‍ బలం పుంజుకుంటుందని వారి భయం. ఆనాటికే గూర్ఖాల్యాండ్‍
ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఉన్నది. ఉత్తరప్రదేశ్‍లో కూడా బుందేల్‍ ఖండ్‍, పూర్వాంచల్‍ రాష్ట్రాల డిమాండ్లు తలఎత్తగలవని సమాజ్‍ వాది పార్టీ కూడా తెలంగాణ బిల్లును వ్యతిరేకించింది. పదేళ్ళ తర్వాత చూస్తే ఆనాడు తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన త•ణమూల్‍ కాంగ్రెస్‍, సమాజ్‍ వాది పార్టీల అపోహలు సత్యదూరమని తెలిపోయినవి. వారు ఊహించిన దానికి భిన్నంగా బెంగాల్‍లో గూర్ఖాల్యాండ్‍ ఉద్యమం చల్లబడింది. ఉత్తరప్రదేశ్‍లో బుందేల్‍ ఖండ్‍, పూర్వాంచల్‍ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వెల్లుబుకలేదు. ఏది ఏమైనా ఎట్టకేలకు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‍ పి.జె కురియన్‍ అధ్యక్షతన తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం రోజు ఫిబ్రవరి 20న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‍ పి.జె కురియన్‍ను రంగంలోకి దించడం యూపిఎ ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని ఆనాడు అందరూ భావించారు. ‘‘ది బిల్‍ ఈజ్‍ పాస్డ్’’ అని కురియన్‍ చేసిన ప్రకటన తెలంగాణ ప్రజానీకాన్ని ఆనందడోలికల్లో ముంచేసింది. వెంటనే తెలంగాణ అంతటా సంబురాలు ఆకాశాన్ని అంటాయి.


గతానుభవాలను ద•ష్టిలో ఉంచుకొని బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర పడే దాకా అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్‍ ప్రకటించారు. అందుకే తెలంగాణవాదులు దిల్లీని వదలి రాలేదు. ఏ దశలోనైనా తెలంగాణ ఏర్పాటుకు ఆంధ్రా లాబీయిస్టులు అడ్డం పడతారన్నముందు చూపుతో అక్కడనే కాపు కాస్తూ ఉండిపోయారు. ఫైలు రాష్ట్రపతి సంతకానికి వెళితే ఆయన టేబుల్‍ మీద నుంచి పెన్నును కూడా మాయం చేస్తారు. ఒకవేళ పెన్నుదొరికినా పెన్నులో ఇంకు లేకుండా చేస్తారు అని ఆ రోజుల్లో తెలంగాణ వాదులు జోక్స్ వేసుకుంటూ నవ్వుకునేవారు. ‘‘కనురెప్పలు కత్తిరించుకొని కాలానికి కాపలా కాయాలి’’ అని రచయిత పరవస్తు లోకేశ్వర్‍ ఈ కాలంలోనే రాశారు. అట్లా తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండి తెలంగాణ ఉద్యమ అంతిమ గమ్యానికి చేరుకున్నారు. మార్చ్ 1న రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‍ ముఖర్జీ బిల్లుపై ఆమోదముద్ర వేశారు. మార్చ్4న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేసింది. జూన్‍ 2న తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. ‘‘ఆంధప్రదేశ్‍ రాష్ట్రం నుంచి దిల్లీ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతాను’’ అని కెసిఆర్‍ దిల్లీ వెళ్ళే ముందు ప్రకటించారు. అన్న మాట ప్రకారం తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాతనే కెసిఆర్‍ హైదరాబాద్‍కు తిరిగి వచ్చారు.


అయితే తెలంగాణ బిల్లులో ఉన్న కొన్ని లోపాలను ఆనాడే తెలంగాణ వాదులు గుర్తించారు. వాటిని సవరించాలని కోరుకున్నారు కూడా. ముఖ్యంగా.. సాగునీటి రంగానికి సంబందించి కొన్ని క్లాజులు మనకు ఇవ్వాళ్ళ కూడా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా పుట్టని తెలంగాణ రాష్ట్రం ఆమోదం ఉందని బిల్లులో నమోదు చేశారు. బిల్లులో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రజలు డిమాండ్‍ చేస్తున్న ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇవ్వలేదు. (ఆ తర్వాత కూడా పదేళ్ళు ఎంత మొర పెట్టుకున్నామోది ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు) ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి పంపిన డ్రాఫ్ట్ బిల్లులో లేని షెడ్యూల్‍ 11లో పేరా 10 తుది బిల్లులో చేరింది. ఇందులో క•ష్ణా బేసిన్లో ఉన్న రెండు తెలంగాణ ప్రాజెక్టులను (కల్వకుర్తి, నెట్టెంపాడు) మాత్రమే చేర్చినారు కానీ అప్పటికే ఆమోదం ఉన్నఏ ఎం ఆర్‍ పి, పాలమూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టులను చేర్చలేదు. గోదావరి బేసిన్లో ప్రాణహిత-చేవెళ్ళ, దేవాదుల తదితర ప్రాజెక్టులు వేటినీ ఇందులో చేర్చలేదు. వీటితో పాటు హైదరాబాద్‍ ఉమ్మడి రాజధానిగా పదేండ్లు కాక 3 ఏండ్లకు తగ్గించాలని, హైదరాబాద్‍ శాంతి భద్రతల బాధ్యతను గవర్నర్‍కు ఇవ్వడాన్ని.. మరికొన్ని ఇతర లోపాలని సవరించాలని తెలంగాణ వాదులు కోరినారు. ‘‘మీకు బిల్లు ఆమోదం కావాలా లేదా సవరణలు కావాలా తేల్చుకోండి’’ అన్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. సవరణలకు పట్టుబడితే ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందలేదేమోనని, మొదటికే మోసం వస్తుందని, ముందైతే తెలంగాణ ఏర్పడనీ ఆ తర్వాత సవరణాల సంగతి చూసుకోవచ్చు అన్న ఆలోచనతో లోపాలతోనే బిల్లు ఆమోదానికి మొగ్గు చూపారు తెలంగాణ నాయకత్వం. ఆనాడు వారికి ఇదొక అనివార్య స్థితి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిల్లులోని ఆ లోపాలు మనకు ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తున్నవి.


ఎన్నికల అనంతరం కేంద్రంలో నరేంద్ర మోది నాయకత్వంలో బిజేపి కొత్త ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు జారీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆమోదం లేకుండానే ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపేసింది. ఆ తర్వాత బిల్లు ద్వారా దాన్నివిభజన చట్టంలో భాగం చేశారు. షెడ్యూల్‍ 11 లోని పేరా 10లో మన ప్రాజెక్టులను చేర్చకపోవడం చేత అవన్నీ కొత్త ప్రాజెక్టులని, వాటికి అపేక్స్ కౌన్సిల్‍ ఆమోదం తీసుకోవాలని, అంతవరదాకా ప్రాజెక్టు పనులు ఆపాలని ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం నిరంతరం కేంద్రానికి, నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నది. వారి చేత లేఖలు రాపిస్తున్నది. అదే సమయంలో వారు మాత్రం అపేక్స్ కౌన్సిల్‍ ఆమోదం లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. నదీ జలాల్లో మనకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తున్నది. అంతర్‍ రాష్ట్ర నది జలా వివాదాల చట్టం, 1956 సెక్షన్‍ 3 ప్రకారం క•ష్ణా నదీ జలాల పునర్‍ పంపిణీ కోసం తెలంగాణ రాష్ట్ర పోరాటం ఫలించింది. 2023 అక్టోబర్‍ నెలలో సెక్షన్‍ 3 కింద అదనపు నియమ నిబందనలను విచారణకు స్వీకరించాలని బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ కు నివేదిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్‍ నోటిఫికేషన్‍ ను జారీ చేసింది. క•ష్ణా ట్రిబ్యునల్‍ ఆ అదనపు నియమ నిబంధనలను స్వీకరించి విచారణ కొనసాగించడం శుభ సూచకం. క•ష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా పొందడానికి తెలంగాణ పోరాటం కొనసాగుతుంది.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొంది పదేళ్ళు గడచిన ఈ సందర్భంలో అందుకు క•షి చేసిన ప్రతి ఒక్కరికీ అభివందనాలు. ఈ క•షిలో అమరులైన తెలంగాణ బిడ్డలకు జోహార్లు.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే,
    ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *