క్యాన్సర్‍ భూతం

కుర్మయ్య: అమ్మా! నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పదా! ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం.
తల్లి: వద్దు బిడ్డా! ఇప్పటికే మస్తు ఆస్పిటల్లకు తిరిగినా. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. నేను రాను బిడ్డా!
కుర్మయ్య: లేదమ్మా! నామాట విను! పాలమూరులో మంచి డాక్టర్‍ వున్నడు. సూపించుకుని వద్దాం . ఇదొక్క సారి నా మాట వినమ్మా!
తల్లి: సరే బిడ్డా! పోదాం పదా ఈ మాయదారి రోగమేందో నన్ను సంపుతోంది
కుర్మయ్య: అమ్మా! పాత రిపోర్టులన్నీ తీసుకో
తల్లి: తీసుకున్న బిడ్డా!
కుర్మయ్య: డాక్టర్‍ గారూ! మా అమ్మకు వచ్చిన రోగమేందో తెలుస్తలేదు. మీరే మా అమ్మను కాపాడాలి.
డాక్టర్‍: ఇంతకు ముందు ఎక్కడైనా చూపించుకున్నారా
కుర్మయ్య: చూపించుకున్నాం. డాక్టర్‍
డాక్టర్‍: ఏదీ! రిపోర్టులు ఇటివ్వండి సరే! ఈ టెస్టు రాస్తాను చేయించండి
కుర్మయ్య: సరే, డాక్టర్‍
కుర్మయ్య: ఇదిగొండి డాక్టర్‍!
డాక్టర్‍: అమ్మా! మీరు బయటికి వెళ్ళండి ఇదిగో చూడు బాబూ! మీ అమ్మకు క్యాన్సర్‍ ఉంది. అందుకే రోగం తగ్గుతలేదు
కుర్మయ్య: క్యాన్సరా! డాక్టర్‍! మేము పల్లెటూరోళ్ళం. కాయకష్టం చేసుకుని బతికేటోళ్లం క్యాన్సర్‍ ఎలా వచ్చింది
డాక్టర్‍: ఏమీ అలవాట్లు లేకున్నా మనం రోజూ తింటున్న ఆహారమే క్యాన్సర్‍ కు కారణం అవుతుంది.
కుర్మయ్య: ఏంది డాక్టర్‍. ఆహారం తింటే క్యాన్సర్‍ వస్తుందా?
డాక్టర్‍: ఎందుకురాదు! తింటున్న అన్నం, పప్పు, కూరగాయలు, వంటనూనెలు, పళ్ళు అన్నీ పురుగుమందులు పిచికారి చేస్తూ పండించినవేకదా. తినే ప్రతి దాంట్లో రసాయనాలు ఉంటున్నాయి. ఇవే క్యాన్సర్‍ కు కారణం అవుతున్నాయి.
ఓ మాట అడుగుతా! చెప్పు! పురుగుమందులు కొట్టకుండా వ్యవసాయం చేసినప్పుడు ఈ రోగాలున్నాయా? జొన్న సంకటి , తైద అంబలి చింతకాయ చెట్నీ స్వచ్ఛమైన పల్లి నూనె తిన్నప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకొచ్చినాయో అర్థమైందా?
బాబూ! ఔషధాలనే ఆహారంగా తీసుకుని బతుకులను నరకంగా మార్చుకుంటున్నాం. మనం రసాయనిక మందులులేని స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా వుండగలుగుతాము డాక్టర్‍గా చెబుతున్నా! ఈ రోగాలకు ఆసుపత్రులు శాశ్వత పరిష్కారం చూపలేవు.


డాక్టర్‍ ! ఇప్పుడేం చేయాలో చెప్పు.
నీ లాంటి యువరైతులతో పాటు ప్రతి రైతు ప్రక•తి సేద్యం చేయాలి. రసాయనిక ఎరువులు లేని పంటలను పండించాలి. ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడంతో పాటు స్వచ్ఛమైన ప్రక•తి ఆహారాన్ని భావితరాలకు బహుమతిగా అందివ్వాలి.
అప్పుడు నాలాంటి డాక్టర్లతో పని ఉండదు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు.
ఇప్పటికైనా అందరూ మేల్కోవాలి. ప్రక•తి సేద్యాన్ని, వారు పండించిన పంటలను కొంటూ ఆ ఆహారాన్నే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


-గుముడాల చక్రవర్తి గౌడ్‍
ఎ : 9441059424

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *