రెండు రోజుల జాతీయ సదస్సును చరిత్రశాఖ,
డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు నిర్వహించారు
డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, చరిత్రశాఖ ఆధ్వర్యంలో 10.04.2024, 11.04.2024 రోజుల్లో దక్షిణ భారత నాణ్యాల సంస్థ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 150 మంది వివిధ రాష్ట్రాల నుండి పరిశోధకులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారు శాతవాహన, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, చాళుక్యులు, వాకాటకులు, ముసునూరి నాయకులు, దేవరకొండ పాలకులు, వెలమ పాలకులకు సంబంధించిన నాణ్యాలు, కాకతీయుల నాణ్యాలు, బహమనీల, కుతుబ్ షాహీల నాణ్యాల మీద సమగ్రమైన చర్చ జరిగింది.
ఈసమావేశాన్ని రిజిస్ట్రార్ ఆచార్య ఏ.వీ. ఆర్.ఎన్ రెడ్డి అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ప్రారంభించారు. ఈ సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ ఆచార్య కె.పి.రావు, కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు కీలక విషయాలను, నాణ్యాల సేకరణ, వాటి ప్రాశస్త్యం, చరిత్ర పునర్నిర్మాణంలో వాటి పాత్ర గురించి చక్కగా విశ్లేషించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆచార్య కిషన్‍రావు, మాజీ రిజిస్టార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు చరిత్ర నిర్మాణంలో నాణ్యాల పాత్ర చాలా వున్నది అని, రోమన్, అరబ్ నాణ్యాలు దక్షిణ భారతదేశానికి, అరబ్, రోమ్తోవున్న ఆర్థిక, సాంస్క•తిక సంబంధాలను తెలియజేస్తున్నాయి అని వివరించారు. చరిత్రకారులు నాణ్యాలను పరిశీలించి, తెలంగాణ చరితకు వాటి ఉపయోగాలను గ్రంథాల రూపంలో తెలపాలని కోరారు. ఈ సమావేశంలో కీలక ఉపన్యాసాన్ని డాక్టర్ డి. రాజారెడ్డి దక్షిణ భారత నాణ్యాల సంస్థ అధ్యక్షులు చేసారు. వీరు శాతవాహన, కాకతీయ, అసఫ్జహిల నాణ్యాల మీద అనేక రచనలు చేసారు. ఈ నాణ్యాల ఆధారంగా నాటి సామజిక, మాత, ఆర్థిక, సాంస్క•తిక అంశాలను ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ డీన్ సామాజిక శాస్త్రాల విభాగం వారు చారిత్రశాఖ నిర్వహిస్తున్న వివిధ కోర్సులను, ప్రాచీన చరిత్ర పునర్నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను, శాసన, నాణ్యాల ప్రాధాన్యతను వివరించారు. ఈసమావేశంలో ఆచార్య ఇ. సుధారాణి, చరిత్రశాఖలో సీనియర్ ఆచార్యుల వారు నాణ్యాలను, వాటిపై వున్న పలువురి రాణుల జీవన విశేషాలను, నాటి రాణులు చేసిన దాన, ధర్మాలను, వారి ప్రశస్తాన్ని చక్కగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాధాక•ష్ణ, ఆర్.బి.ఐ. క్యురేటర్ పాల్గొన్ని నాణ్యాల తయారీ, వాటి చలామణి, నాణ్యాల ప్రాధాన్యతను, ఆర్.బి.ఐ తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో సీనియర్ కార్యనిర్వాహక సభ్యులు శ్రీ. సత్యమూర్తిగారు దక్షిణ భారత నాణ్యాల సంస్థ ఏర్పాటు, సంస్థ చేపట్టే వివిధ కార్యక్రమాలు, నాణ్యాల మీద సభ్యులు రాసిన వివిధ రచనలు, కేరళ, కర్ణాటక తమిళనాడులో జరిగిన అనేక పరిశోధనల గురించి వివరించారు. సమావేశంలో చరిత్రశాఖ అధ్యక్షులు డాక్టర్ గాజుల దయాకర్ విశ్వవిద్యాలయం తీసుకుంటున్న చర్యలను, చరిత్ర శాఖ ప్రాచీన చరిత్ర నిర్మాణంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, రచనలను, నాణ్యాల ప్రదర్శన, నాణ్యాల తయారీకి వాడుతున్న లోహాలను, కుతుబ్‍షాహీ, అసఫ్ జాహి నాణ్యాలపై విన్న గుర్తులు, చిహ్నాలను, వాటి ద్వారా ఆయా కాలాలలో జరిగిన ఆర్ధిక వ్యవహారాలను వివరించారు.
ఈ సమావేశంలో పరిశోధకులు ప్రాచీన పాలకులు విడుదల చేసిన రాగి, వెండి, బంగారు నాణ్యాల వివరాలను, గద్య, మాడ, కార్షాపణ, సువర్ణ, జిటల్, హలిసికా, ఫణం, హాన్వంటి పలు నాణ్యాల గురించి వాటి ప్రాధాన్యత గురించి, స్థానిక రాజులు విడుదల చేసిన నాణ్యాలకు, బ్రిటిష్ పాలనలో చలామణి అవుతున్న నాణ్యాలకు మధ్య గల తేడాను, నాణ్యాల లోహ ప్రాధాన్యతను, నాణ్యాల విలువను, నాణ్యాల మీద వున్నా శ్రీ. పరమేశ్వర, బుద్ధ, జైన, శైవ, వైష్ణవ దేవత గుర్తులను, లిపిని, మహమ్మదీయ పాలకుల నాణ్యాల మీద వున్న పలు కట్టడాల గుర్తులను, వాటిపై వున్నా పర్షియా, ఉర్దూ, అరబిక్‍ల పులను, రోమన్ పాలకుల నాణ్యాల మీద వున్నా గుర్తులను, రోమన్ నాణ్యాల ప్రామాణికతపై పత్రాలను సమర్పించారు. సమావేశంలో 100 పైగా పత్రాలు సమర్పించి, చర్చించారు.
తెలంగాణలోని కోటిలింగాల, దూళికట్ట, పెద్దబంకుర్, నాగార్జున కొండ, దొనకొండ, శ్రీపర్వతం, కొండాపూర్, బోధన్, నిర్మల్, హనుమకొండ, వేములవాడ, సైఫాబాద్, గోల్కొండ, పానగల్లు, వనపర్తి, సూగూరు, జటప్రోలు, అమరచింత, వంటి పలు ప్రాంతాల్లో జరిగిన పురావస్తు అధ్యయనాలు, మందుముల్, ముకట్రావుపేట, చందుబాట్ల, కొలనుపాక, అలంపూర్, నేలకొండపల్లి, వాడపల్లి, ఘనపూర్, రామప్ప, నుస్తులాపూర్, నగునూరు, వంటి ప్రాంతాల్లో ప్రాచీన చరిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.
ఫణిగిరి, గాజులబండ, వర్ధమానుకోట, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాల గురించి అక్కడ లభించిన పలు పురాతన వస్తువుల గురించి చర్చించారు. ఇటీవల ఫణిగిరిలో జరిపిన త్రవ్వకాల్లో దొరికిన 3730 సీసపు నాణ్యాలు, వాటిపై వున్నా ఏనుగు గుర్తులను, ఉజ్జయిని గుర్తులను, ఇక్ష్వాకులకు చెందిన ఈ నాణ్యాలపై కూడా చర్చ జరిగింది. ఇంక పూర్తి స్థాయిలో ఈ నాణ్యాల మీద చర్చ జరగాల్సిన ఆవశ్యకతను పరిశోధకులు వెలిబుచ్చారు.
దక్షిణ భారత నాణ్యాల వార్షిక సమావేశ ముగింపు సదస్సుకు ముఖ్య అతిధిగా ఆచార్య కె. సీతారామారావు, ఉపకులపతి, అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు పాల్గొని నాణ్యాల చరిత్ర, నాణ్యాల వాడకం, నిజాంల కాలంలో దొరికిన వివిధ నాణ్యాలను, వాటి ప్రాధాన్యతను, చరిత్ర శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలను పేర్కొన్నారు.
ఈ సమావేశానికి అతిధిగా పాల్గొన్న డాక్టర్ మణికొండ వేదకుమార్ గారు తెలంగాణాలో జరుగుతున్న చరిత్ర పరిరక్షణ కార్యక్రమాలను, పురావస్తు శాఖ జరుపుతున్న త్రవ్వకాలను, వివిధ ప్రాంతాల్లో దొరికిన ప్రాచీన వస్తువులను, నాణ్యాలను, బౌద్ధ గుర్తులను, వాటి ప్రాధాన్యతను, సమాజానికి చరిత్ర ద్వారా విలువైన సమాచారం అందిచాలని తెలిపారు. ఈ సమావేశంలో మరొక అతిధి శ్రీమతి అనురాధ రెడ్డి పాల్గొని, దోమకొండ, అమరచింత, వనపర్తి సంస్థానాల సేవలను, వారు సమాజానికి అందించిన సంస్క•తి విశేషాలను తెలిపారు. డాక్టర్ రాజారెడ్డిగారు సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని నాణ్యాలపై చరిత్రకారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని. నాణ్యాలను, వాటిపై వున్న అంశాలను పరిశోధించాలి, నూతన చరిత్ర నిర్మాణానికి నడుం బిగించాలని తెలిపారు.
సీనియర్ ఆచార్యులు డాక్టర్ సుధారాణి చరిత్ర నిర్మాణంలో నాణ్యాల పాత్ర, వాటి వాడకం, నాణ్యాల సేకరణ వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ డీన్ సామాజిక శాస్త్రాల విభాగం వారు చరిత్రలో నాణ్యాలు పాత్ర, విశిష్టతపై మాట్లాడారు. చివరగా చరిత్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ గాజుల దయాకర్ వివిధ రకాల నాణ్యాలు, లోహాలు, నాణ్యాల పరిమాణం, నాణ్యాల ప్రామాణికత వంటి విషయాలను తెలిపారు.
ఈ సమావేశంలో ఆచార్య చెన్నారెడ్డి ప్రచురించిన నుమిస్మాటిక్ ఇండికా గ్రంథాన్ని ఆవిష్కరించారు. శివమాధురి పండిత వ్రాసిన రీచెస్ సాఫ్కల్చరల్ హెరిటేజ్ ఇస్టారికల్ పార్సెక్టివ్స్ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ వారు దీన్ని ప్రచురించారు. చరిత్ర శాఖ వారు ముద్రించిన సావ్‍నీర్‍ను కూడా ఆవిష్కరించారు.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88