మా భూమి

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్‍ మణికొండ

అందరికీ నమస్కారం! నా పేరు అరణ్య, 9వ తరగతి, సిద్దిపేట. మనిషి ఆనందంగా ఆహ్లాదంగా జీవించడానికి పర్యావరణం ఎంతో దోహదపడుతుంది. ఈ గాలి, నీరు, నేల, వెలుతురు, అడవులు మొదలగునవి మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఈ సృష్టిలో భూమి మాత్రమే జీవనానికి కావలసిన వాతావరణం కలిగి ఉన్నదని భావిస్తారు. చక్కని పర్యావరణం లేకుండా ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేము. కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం ఎంతో అవసరం. మనం పర్యావరణాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచాలి. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి మీద ఉన్నది. ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడేలా ఉద్యమాలు చేపట్టాలి. మనిషి సృష్టించే రకరకాల సాంకేతిక పరికరాల ద్వారా వాతావరణం ప్రతీ రోజూ క్షీణిస్తూ వస్తున్నది. అందువలన వాతావరణం కాలుష్యం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. అంతే కాకుండా వాతావరణ కాలుష్యం మనిషి ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తున్నది. రేడియో, టీవీ మరియు సెల్‍ టవర్ల నుండి విడుదలయ్యే రేడియో కిరణాలు జీవన మనుగడను దెబ్బ తీస్తున్నాయి. అనేక పక్షులు ఏటా రేడియేషన్‍ ద్వారా చనిపోతున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వాహనాలు, ఫ్యాక్టరీలు అనేక పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల ద్వారా నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు నదులలో వదలడం వల్ల జలచరాలు రోజు రోజు క్షీణిస్తున్నాయి. ఇంకా పంట పొలాలకు కలుషిత నీరు ఇవ్వడం ద్వారా ఆహార సంపద, నాణ్యత తగ్గుతూ వస్తున్నది. ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల అవి నేలను, నీరును కలుషితం చేస్తున్నాయి. వివిధ రకాల రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలో పేరుకుపోతున్నాయి. రోడ్లు, భవనాలు విస్తరించుట వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకటం లేదు. దాని ద్వారా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి.


చెట్లను వివిధ కారణాల మూలంగా నరికివేయడం ఓజోన్‍ పొర క్షీణించడానికి కారణమవుతున్నది. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడ భూమి మీద ఎలా ఉండనున్నదో మనం అంచనా వేయలేము. అందువలన పర్యావరణాన్ని కాపాడడమే దీనికి పరిష్కార మార్గము. పర్యావరణాన్ని అవసరమున్నంత వరకు సద్వినియోగం చేసుకుంటూ కాపాడుకోవడమే సరైన పరిష్కారం. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు స్వార్థపరంగా ఆలోచించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలు చేపట్టాలి. సాధ్యమైనంత తక్కువ నీటిని వాడడం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, పంటలకు కృత్రిమ రసాయనాలు వినియోగించకుండా సహజ ఎరువులు వినియోగిచడం, చెట్లను నాటడం మొదలగు వాటి ద్వారా పర్యావరణం కాపాడవచ్చును. పర్యావరణ పరిరక్షణే మానవ మనుగడకు మంచి మార్గం అని అందరూ తెలుసుకోవాలి. అని ఏకధాటిగా తనకు తెల్సిన విషయాల్ని ప్రసంగించే సరికి చప్పట్ల మోత మోగుతూనే ఉంది. ఇంత చిట్టి మెదళ్ల ఇన్ని ఆలోచనలా అని పర్యావరణ పోటీల్లో రాష్ట్రస్థాయిలో బహుమతి పొందినందుకు అందరూ అభినందించారు.

  • ఇ. వైష్ణవి, ఎ : 799599103

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *