సాంకేతిక రంగానికి నిరంతర సవాల్‍ @ సైబర్‍ సెక్యూరిటీ..!!

2023వ సం।।లో అత్యధిక ఫిషింగ్‍ దాడులకు గురవుతున్న దేశాలలో యూఎస్‍, యూకే తరువాత ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఇండియాలోని సాంకేతిక పరిశ్రమ దాదాపు 33 శాతం ఇలాంటి ఫిషింగ్‍ దాడులను ఎదుర్కొం టోంది. ఆర్థిక మరియు భీమా రంగాలు సైబర్‍ నేరగాళ్ళకు ప్రధాన లక్ష్యంగా మారాయని యూఎన్‍ఓ గ్లోబల్‍ సైబర్‍ సెక్యూరిటీ నివేదిక తెలుపుతోంది.


బ్యాంకు ఖాతాల నుండి సొమ్ములను తస్కరించడం, దేశంలో ప్రఖ్యాతి చెందిన సంస్థల యొక్క మౌళిక సదు పాయాలకు ఆటంకం కలిగించడం, సోషల్‍ మీడియా ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం ద్వారా సాధారణ ప్రజల్లో భయాందోళనలు కలిగించే దిశగా విభిన్న రూపాల్లో సైబర్‍ దాడులు జరుగు తున్నాయి. వీటి నుండి రక్షణ పొందే దిశగా ‘‘సైబర్‍ సెక్యూరిటీ’’ అన్న అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. ఈ నేపథ్యంలో సైబర్‍ సెక్యూరిటీ ప్రాధాన్యతను మనమూ తెలుసుకుందామా!!


సైబర్‍ సెక్యూరిటీ అంటే
నెటిజన్లకు సంబం ధించిన వ్యక్తిగత సమాచారం నిల్వచేయబడిన ప్రదేశాన్ని (వెబ్‍సైట్‍, సోషల్‍ మీడియా ఫ్లాట్‍ఫాం, కంప్యూటర్‍ లాంటివి) సైబర్‍ స్పేస్‍ అని అంటారు. ఈ సైబర్‍ స్పేస్‍కు రక్షణ కల్పించడాన్నే ‘‘సైబర్‍ సెక్యూరిటీ’’ అని అంటారు.
బాబ్‍ థామస్‍ అనే పరిశోధకుడు 1970వ సం।।లో ఆర్పానెట్‍ (ARPANET) (ఇంటర్నెట్‍ను మొదట్లో ఆర్బానెట్‍ అని పిలిచేవారు) అంతటా కదలగలిగే క్రీపర్‍ అనే కంప్యూటర్‍ పోగ్రామ్‍ను తయారు చేశాడు. ఇ-మెయిల్‍ సృష్టికర్త రేటామ్లిన్‍సన్‍ రీపర్‍ అనే మరొక కంప్యూటర్‍ పోగ్రామ్‍ను తయారు చేశాడు. ఇది ఆర్పానెట్‍ (ARPANET) క్రీపర్‍ పోగ్రామ్‍లను ట్రాక్‍ చేసి తొలగించింది. ఈ విధంగా సైబర్‍ సెక్యూరిటీని మొదటిసారిగా పరీక్షించారు. అదేవిధంగా మాల్‍ వేర్‍ యాంటీవైరస్‍ అప్లికేషన్‍ను చెక్‍ చేసి తొలగించడం కూడా ఇదే మొదటిసారి.


సైబర్‍ దాడులు – వాటి రకాలు
i) సైబర్‍ టెర్రరిజం : సమాజంలో పెద్ద ఎత్తున అలజడులు సృష్టించేందుకు రాజకీయ ప్రేరిత విధానాలతో కంప్యూటర్‍ మరియు ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ వ్యవస్థ లపై దాడులు చేయడాన్కి సైబర్‍ టెర్రరిజం అంటారు.
ii) సోషల్‍ ఇంజనీరింగ్‍ : సురక్షితంగా భద్రపరచబడిన సున్నితమైన సమాచారాన్ని, ఆభద్రతా వలయం నుండి తప్పించడానికి ఉపయోగించే దాడిని సోషల్‍ ఇంజనీరింగ్‍ అంటారు.
iii) ట్రోజన్లు : డౌన్‍లోడ్‍ చేసుకునే ముందు అధీకృత (వాస్తవ) ఫైల్‍గా భ్రమింపచేసి ఒకసారి ఇన్‍స్టాల్‍ చేసుకున్న తరువాత సిస్టమ్‍ను నియంత్రించి దాడులు చేసే అనధీకృత మాల్‍వేర్‍ను ట్రోజన్‍ అంటారు. సిస్టమ్‍ను నియంత్రించి దాడులు చేయడానికి ఇది హ్యాకర్లకు అనధికారిక అనుమతిని ఇస్తుంది.
iv) మాల్‍వేర్‍ : ఒక కంప్యూటర్‍లో సక్రమంగా పనిచేసే సాఫ్ట్వేర్‍ను నియంత్రించి, దాని పనితీరును అస్తవ్యస్తం చేయడం ద్వారా కంప్యూటర్‍ను యాక్సెస్‍ చేయకుండా నిరోధించడం, అస్థిరపరచడం, డేటా నిల్వ నుండి రహస్యంగా డేటాను తస్కరించే నియంత్రిత, నిర్దేశిత, రహస్య పోగ్రామ్‍ను మాల్‍వేర్‍ అంటారు.
v) యాడ్‍వేర్‍ : ఇది కూడా మాల్‍వేర్‍ ముప్పులాంటిదే. ఇది ఒక అడ్వర్‍టైజ్‍మెంట్‍ సపోర్టెడ్‍ సాఫ్ట్వేర్‍. దీనినే యాడ్‍వేర్‍ వైరస్‍ అంటారు. ఇది ఒక అవాంఛనీయమైన పోగ్రామ్‍ Potentially Unwanted Programme) (PUP). మన ప్రమేయం లేకుండానే ఇది సిస్టమ్‍లో ఇన్‍స్టాల్‍ చేయబడి అనవసర అడ్వర్‍టైజ్‍మెంట్లను సృష్టిస్తూ మనల్ని చికాకు పరుస్తూ ఉంటుంది.
vi) ఫిషింగ్‍ : మోసపూరిత కమ్యూనికేషన్‍ విధానాలను (ప్రధానంగా ఇమెయిల్స్) ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడాన్ని ఫిషింగ్‍ అంటారు. కొన్ని ఫిషింగ్‍ స్కామ్‍లలో మాల్‍వేర్‍ ఇన్‍స్టాలేషన్‍ కూడా ఉంటుంది.
vii) సేవల తిరస్కరణ (Denial of Service – DIS) : హ్యాండ్‍ షేక్‍ ఆపరేషన్‍ విధానాలతో కంప్యూటర్‍ లేదా నెట్‍ వర్క్ పనితీరును తీవ్రతరం చేయడం, సిస్టమ్‍ను ఓవర్‍లోడ్‍ చేయడం ద్వారా వినియోగదారుని అభ్యర్థనలకు సిస్టమ్‍ ప్రతిస్పందించకుండా ఉండడాన్ని ‘‘సేవల తిరస్కరణ’’ అంటారు.
viii) మ్యాన్‍ – ఇన్‍ – ద మిడిల్‍ అటాక్‍ (MITM) : ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటర్నెట్‍ లావాదేవీలలో హ్యాకర్లు వారి అనుమతి లేకుండా ప్రవేశించి, వారి డేటాను తస్కరించడాన్ని మ్యాన్‍ – ఇన్‍ ద – మిడిల్‍ అటాక్‍ అంటారు. ఈ రకమైన దాడులు అసురక్షిత పబ్లిక్‍ వైఫై నెట్‍ వర్క్లపై జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ix) బోట్‍ నెట్‍లు : కంప్యూర్ల నెట్‍వర్క్లోకి హ్యాకర్ల ద్వారా మాల్‍వేర్‍ని ప్రవేశపెట్టి, కంప్యూటర్లను హైజాక్‍ చేయడాన్ని బోట్‍నెట్‍ అంటారు. ఈ విధంగా చేయడం ద్వారా హ్యాకర్లు కంప్యూటర్ల నెట్‍వర్క్ను తమ ఆధీనంలోకి తీసుకొని తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు.
x) ఎస్‍క్యూఎల్‍ ఇంజెక్షన్‍ (SQL injection) : వినియోగదారుల డేటాబేస్‍లోకి హానికారక కోడ్‍ను పంపడం ద్వారా వారి డేటాబేస్‍లోకి అనధికారికంగా ప్రవేశించడాన్ని ఎస్‍క్యూఎల్‍ ఇంజెక్షన్‍ అంటారు.
xi) ర్యాన్‍సమ్‍ వేర్‍ (Ransomware) : డెస్క్టాప్‍, లాప్‍టాప్‍, మొబైల్‍ఫోన్ల వంటి కమ్యూనికేషన్‍ పరికరాలలోని ఫైల్స్లోకి ప్రవేశించే మాల్‍వేర్‍ను ర్యాన్‍సమ్‍వేర్‍ అంటారు. ఈ విధంగా ప్రవేశించిన తరువాత ర్యాన్‍సమ్‍వేర్‍ ఆ ఫైల్స్లోని సమాచారాన్ని తన గుప్పిట్లో పట్టి ఉంచుతుంది. వినియోగదారునికి ఆ సమాచారం మళ్ళీ డీ క్రిప్ట్ కావాలంటే భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి
ఉంటుంది.
xii) స్ఫూఫింగ్‍ (Spoofing) : సెండర్స్ పంపిన సమాచారాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా చట్టపరమైన సంస్థగా లేదా వ్యాపారిగా, సహోద్యోగి లేదా మనకు బాగా తెలిసిన వారిలాగా నటిస్తూ, అక్రమంగా మన వ్యక్తిగత సమాచారాన్ని పొందడం, డబ్బు సంపాదించడం, డేటాను దొంగలించడం లేదా మాల్‍వేర్‍ను చొప్పించే నేరపూరిత విధానాన్ని ‘‘స్ఫూఫింగ్‍’’ అంటారు.
xiii) స్కిమ్మింగ్‍ (Skimming) : అపరిచిత వ్యక్తుల నుండి వారి అనుమతి లేకుండా డేటాను దొంగలించడాన్ని స్కిమ్మింగ్‍ అంటారు. ఉదా।। బస్సులో వినియోగదారుకు దగ్గరగా ఉన్నప్పుడు రహస్యగా డేటాను చదవడాన్ని స్కిమ్మింగ్‍ అంటారు.


భారత్‍లో ఇటీవల జరిగిన సైబర్‍ దాడులు
i) కోవిడ్‍-19 ఆధారిత సైబర్‍ దాడి : కోవిడ్‍-19 పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఇండియాలోనూ మరియు ప్రపం• •వ్యాప్తంగా సైబర్‍ నేరగాళ్ళు రాన్‍సమ్‍వేర్‍ మరియు ఫిషింగ్‍ విధానాల ద్వారా సైబర్‍ దాడులకు పాల్పడ్డారని మైక్రోసాఫ్ట్ నివేదిక తెలిపింది.
ii) వాన్నాక్రై (wanncry) : ఇది ఒక ర్యాన్సమ్‍వేర్‍. ఇది వినియోగదారుల డివైజెస్‍ను తన ఆధీనంలోకి తీసుకొని లాక్‍ చేస్తుంది. నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించిన తరువాతనే డివైజెస్‍లోకి యాక్సెస్‍ను ఇస్తుంది. 2017వ సం।।లో ఇది మన దేశంలో విస్త•తంగా వ్యాపించింది. దీని బారిన పడిన ప్రధాన నగరాల్లో కోల్‍కతా, ఢిల్లీ, భువనేశ్వర్‍, పూణే మరియు ముంబైలు తొలి 5 స్థానాల్లో నిలిచాయి.
iii) మిరాయి బోట్‍నెట్‍ (Mirai Botnet) : ఇది ఒక మాల్‍వేర్‍. ఎఆర్‍సీ ప్రాసెసర్లలో ప్రవేశించడం ద్వారా స్మార్ట్ డివైజెస్‍ను ప్రభావితం చేసి వాటిని రిమోట్‍తో నియంత్రించే బోట్స్ (bots), జాంబీస్‍ (zombies) పరిధిలోకి తెస్తుంది. వీటి ద్వారా డిస్ట్రిబ్యూటెడ్‍ డేనియల్‍ ఆఫ్‍ సర్వీస్‍ (DDOS) లాంటి దాడులను కూడా చేయవచ్చు.
iv) పెట్యార్యాన్సమ్‍ వేర్‍ : దీనిద్వారా మనదేశంలో జవహర్‍లాల్‍ నెహ్రూ పోర్ట్ట్రస్ట్ టెర్మినల్స్లలో ఒకదాని కార్యకలాపాలు పూర్తిగా నాశనం చేయడం జరిగింది.
v) మనదేశంలోని విభిన్న జాతీయ సంస్థల వెబ్‍సైట్లపై సైబర్‍ దాడి జరిగింది.
vi) ఢిల్లీ ఎయిమ్స్, కూడంకుళం న్యూక్లియర్‍ పవర్‍స్టేషన్లపై సైబర్‍ దాడి జరిగింది.
vii) 2017లో ఉత్తరాఖండ్‍లోని తెహ్రీ డ్యాంపై సైబర్‍ దాడి జరిగింది.


స్టక్స్నెట్‍ కేసు (Case Of Stuxnet) :
ఇది ఒక సైబర్‍ వార్మ్ (worm). దీనిని యూఎస్‍ నేషనల్‍ సెక్యూరిటీ ఏజెన్సీ మరియు ఇజ్రాయిల్‍ మిలటరీ విభాగం సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. ఇరాన్‍లోని నతాంజ్‍ న్యూక్లియర్‍ ఎన్‍రిచ్‍మెంట్‍ సెంటర్‍పై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు దీనిని రూపొందించారు. 2012లో మన దేశంలోని ఎలక్ట్రానిక్‍ వ్యవస్థల్లో కూడా స్టక్స్నెట్‍ విస్తరించినట్లు భారతీయ నిపుణులు గుర్తించారు.
సైబర్‍ సెక్యూరిటీ – ఆవశ్యకత
వ్యక్తుల కొరకు :
సామాజిక మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎంతో మంది షేర్‍ చేస్తూ ఉంటారు. అలాంటి సమాచారాన్ని ఇతరులెవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
వ్యాపార సంస్థల కొరకు : మనదేశం లోని దిగ్గజ వ్యాపార, వాణిజ్య సంస్థలు వారి వ్యాపార నిర్వహణకు సంబంధించిన విలువైన సమాచారాన్ని (ఉదా: పేటెంట్స్, వస్తు ఉత్పత్తికి సంబంధించిన విలువైన సమాచారం) తమ వద్ద నున్న సిస్టమ్స్లలో భద్రపరుస్తాయి. సైబర్‍ దాడుల వారి సంస్థలకు చెందిన ఉద్యోగుల సమాచారం లేదా ఇతర కాన్ఫిడెన్షియల్‍ సమాచారం ముష్కరుల చేతికి చిక్కిటన్లయితే పోటీ ప్రపంచంలో ఆ సంస్థ విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉంది.
ప్రభుత్వం కొరకు : స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు సంబంధించిన మరియు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక, మిలటరీ వ్యూహాలకు సంబంధించిన రహస్య సమాచారం భద్రపరుస్తాయి. ఇలాంటి సమాచారం పొరపాటున అనధికారక వ్యక్తులకు చిక్కినట్లయితే, అది యావత్‍ దేశానికి కోలుకోలేని అపార నష్టాన్ని కలిగిస్తాయి.


సక్రమ డిజిటల్‍ లావాదేవీల నిర్వహణ కొరకు :
డిజిటల్‍ ఇండియా పథకం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్‍ లావాదేవీలను ప్రోత్సహిస్తుండడంతో మారుమూల గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల్లో సైతం క్యూఆర్‍ కోడ్‍ స్కానర్ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. హ్యాకర్లు వీటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు విస్త•త స్థాయిలో నమోదవుతున్నాయి.
ఇలా వివిధ స్థాయిల్లో జరిగే సైబర్‍ దాడులను నిరోధించి, వివిధ రకాల వ్యవస్థలు సక్రమంగా పనిచేయించడం కొరకు సైబర్‍ సెక్యూరిటీ అవసరం ఎంతైనా ఉంది.
సైబర్‍ సెక్యూరిటీ కొరకు కేందప్రభుత్వం చేపట్టిన చర్యలు :
i) సెర్ట్-ఇన్‍ (CERTI-IN) : కంప్యూటర్‍ వ్యవస్థకు సంబంధించిన భద్రతాపరమైన సమస్యలు ఎదురైనపుడు తక్షణమే స్పందించేందుకు వీలుగా కంప్యూటర్‍ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా (CERTI-IN)ను 2004లో స్థాపించారు. ఇది సైబర్‍ నేరాలకు సంబంధించి నేషనల్‍ నోడల్‍ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది ఎలాక్ట్రానిక్స్ • ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది.
ii) ఇండియన్‍ సైబర్‍ క్రైమ్‍ కోఆర్డినేషన్‍ సెంటర్‍ (I4C) : సైబర్‍ నేరాలను అదుపు చేసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇండియన్‍ సైబర్‍ క్రైమ్‍ కోఆర్డినేషన్‍ సెంటర్‍ స్థాపించేందుకు నిర్ణయించింది. అక్టోబర్‍ 5, 2018న దీనిని అప్రూవ్‍ చేసింది. సైబర్‍ నేరాల నియంత్రణ మరియు సమన్వయంలో ఇది శిఖర సంస్థగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయనున్నది. దీని కిందనే సైబర్‍ వారియర్‍ పోలీస్‍ ఫోర్స్ పనిచేస్తుంది.
iii) సైబర్‍ స్వచ్ఛతా కేంద్రం : ఇది 2017 ప్రారంభంలో ప్రారంభించబడింది. వినియోగదారుల సిస్టమ్‍లోకి ప్రవేశించిన వైరస్‍లు, బాట్‍లు, మాల్‍వేర్‍, ట్రోజన్లను విశ్లేషించడానికి, వాటిని సిస్టమ్‍ల నుండి తొలగించి సక్రమంగా పనిచేయించ డానికి ఇది ఒక వేదిక లాగా తోడ్పడుతుంది.
iv) సైబర్‍ సురక్షిత భారత్‍ : సైబర్‍ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సైబర్‍ సురక్షిత భారత్‍ చొరవను ప్రారంభించింది. సైబర్‍ నేరాలను అరికట్టడంలో బాగంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు మరియు ఫ్రంట్‍ లైన్‍ ఐటీ సిబ్బంది యొక్క సామర్థ్యాలను పెంచడానికి ఇది తోడ్పడుతుంది.
v) నేషనల్‍ క్రిటికల్‍ ఇన్ఫర్మేషన్‍ ఇన్‍ఫాస్ట్రక్చర్‍ ప్రొటెక్షన్‍ సెంటర్‍ (NCIIPC) : జాతీయ స్థాయిలో వ్యూహాత్మక రంగాలైన వైమానిక, అణు మరియు అంతరక్షి రంగాలలో ఎదురయ్యే సైబర్‍ బెదరింపులను ఎదుర్కోవడానికి ఇది సమన్వయ కేంద్రంగా జాతీయ భద్రతా సలహాదారు నియంత్రణలోని నేషనల్‍ టెక్నికల్‍ రీసెర్చ్ ఆర్గనైజేషన్‍ కింద పని చేస్తుంది.
vi) చిన్నారులు మరియు మహిళలపై సైబర్‍ నేరాల నియంత్రణ పథకం : ఇది చిన్న పిల్లలు మరియు మహిళలపై సైబర్‍ నేరాలను నిరోధించేందుకు కృషి చేస్తుంది. భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.


శాసన సంబంధ చర్యలు :
i) ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ చట్టం – 2000
  • ఎలక్ట్రానిక్‍ రికార్డులు మరియు డిజిటల్‍ సిగ్నేచర్స్ను భౌతిక పత్రాలు, చేతితో రాసిన సంతకాలతో సమానంగా పరిగణించింది. తద్వారా ఇ-గవర్నె•్స•, ఇ-కామర్స్ను ప్రోత్సహిస్తోంది.
  • హ్యాకింగ్‍, డేటా దొంగతనం, సైబర్‍ టెర్రరిజం మొ।।లకు సైబర్‍ నేరాలను నిర్వచించి వాటికి శిక్షలను ఖరారు చేస్తుంది. తద్వారా ఈ చట్టం సైబర్‍ భద్రతకు పెద్ద పీట వేస్తుంది.
  • సైబర్‍ నేరాలను పరిష్కరించే న్యాయనిర్ణేతల నియామకాలను మరియు అప్పిలేట్‍ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది.
  • నేషనల్‍ సైబర్‍ సెక్యూరిటీ పాలసీ-2013
  • ఈ పాలసీ ద్వారా విభిన్న స్థాయిల్లోని సైబర్‍ నేరాలను పరిష్కరించడానికి జాతీయస్థాయిలో ఒక నోడల్‍ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు.
  • డిజిటల్‍ సమాచారం భద్రత కొరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుసరిస్తారు.
  • 5 లక్షల మంది నిపుణులకు శిక్షణ ఇవ్వడం ద్వారా నేషనల్‍ క్రిటికల్‍ ఇన్ఫర్మేషన్‍ ఇన్‍ ఫాస్ట్రక్చర్‍ ప్రొటెక్షన్‍ సెంటర్‍ను ఏర్పాటు చేయడం
  • సైబర్‍ సెక్యూరిటీ విధానాల గురించి చర్చిస్తూ, ఎప్పటికప్పుడు నూతనత్వం తీసుకు రావడానికి ఒక థింక్‍ ట్యాంక్‍ను ఏర్పాటు చేయడం.


వ్యక్తిగత డేటా భద్రత బిల్లు-2019
జస్టిస్‍ బి.ఎన్‍. శ్రీకృష్ణ (రిటైర్డ్) నేతృత్వంలో పర్సనల్‍ డేటా ఫ్రేమ్‍వర్క్ను రూపొందించారు. ఈ బిల్లు వినియోగదారులకు ఈ క్రింది హక్కులు కల్పిస్తుంది.
1) రైట్‍ టు ఇన్ఫర్మేషన్‍ అండ్‍ యాక్సెస్‍ 2) రైట్‍ టు ఫర్‍ గాటన్‍ (మరిచిపోయే హక్కు) 3) రైట్‍ టు కరెక్షన్‍ (సరిదిద్దుకునే హక్కు) 4) రైట్‍ టు డేటా పోర్టబులిటీ (డేటా పోర్టబులిటీ హక్కు)


సైబర్‍ సెక్యూరిటీ – అంతర్జాతీయ సహకారం
బుడాపెస్ట్ కన్వెన్షన్‍ ఆన్‍ సైబర్‍ క్రైమ్‍-2001

  • ఇది కాపీరైట్‍ ఉల్లంఘనలు, కంప్యూటర్‍ వ్యవస్థకు సంబంధించిన మోసాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, నెట్‍వర్క్ భద్రతా ఉల్లంఘనల గురించి చర్చిస్తుంది.
  • తగు శాసన పరమైన విధానాలు, అంతర్జాతీయ పోలీసులతో పాటు, న్యాయపరమైన సహకారాన్ని పొందడం ద్వారా ఒక ఉమ్మడి నేర నియంత్రణా విధానాన్ని అమలు పరచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
  • యూఎస్‍, యూకేలతో పాటు ఇందులో 56 సభ్య దేశాలున్నాయి. ఇండియాకు ఇందులో సభ్యత్వం లేదు.


గ్లోబల్‍ సెంటర్‍ ఫర్‍ సైబర్‍ సెక్యూరిటీ :
దీనిని వరల్డ్ ఎకనామిక్‍ ఫోరమ్‍ చొరవతో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, న్యాయసహకార సంస్థలకు సైబర్‍ సెక్యూరిటీ సవాళ్ళపై తగు సహకారాన్ని అందించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక సమగ్ర నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


కామన్‍ వెల్త్ సైబర్‍ డిక్లరేషన్‍ సమ్మిట్‍-2018
  • అంతర్జాతీయ సహకారం ద్వారా సైబర్‍ స్పేస్‍లో స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నారు.
  • సైబర్‍ స్పేస్‍లో ఆర్థిక, సామాజిక హక్కులను ప్రోత్సహించే చర్యలకు మద్దతివ్వడం
  • ఆయా దేశాలలో జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నేషనల్‍ సైబర్‍ సెక్యూరిటీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహమివ్వడం.


పారిస్‍ కాల్‍ (Paris Call) :
పారిస్‍లో సమావేశమైన యునెస్కో ఇంటర్నెట్‍ గవర్నెన్స్ ఫోరమ్‍ (IGF) సమావేశంలో సైబర్‍ స్పేస్‍ను భద్రపరచడానికి కావలసిన సాధారణ నియమాలను రూపొందించే లక్ష్యంతో ‘‘ది పారిస్‍ కాల్‍ ఫర్‍ ట్రస్ట్ అండ్‍ సెక్యూరిటీ ఇన్‍ సైబర్‍ స్పేస్‍’’ ప్రారంభించ బడింది.
చివరిగా: డిజిల్‍ ఇండియా నినాదం జనబాహుళ్యంలోకి విస్త•తంగా చొచ్చుకు పోవడంతో దేశంలో వచ్చే ఏడాదికి అంతర్జాల వినియోగదారులు 90 కోట్లకు చేరనుండగా, ఇప్పటికే మొబైల్‍ కనెక్షన్ల సంఖ్య 116 కోట్లకు పైబడింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వినియోగాని కనుగుణంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సులువుగా సైబర్‍ నేరగాళ్ళ బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో డిజిటల్‍ అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య, అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం మెరుగైన ఫలితాలనిస్తుంది. ఇటీవల 61 దేశాలకు చెందిన పోలీస్‍ దళాలు ‘‘ఆపరేషన్‍ ఫస్ట్లైట్‍-2024’’ పేరిట చేపట్టిన ఏకోన్ముఖ దాడిలో నాలుగువేల మంది వరకు సైబర్‍ నేరగాళ్ళు పట్టుబడ్డారు. ప్రభుత్వాలు ఇలా కలిసికట్టుగా, కట్టుదిట్టంగా, ధీటైన చర్యలు చేపడితేనే ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన సైబర్‍ వ్యవస్థ సాకారమవుతుంది.


-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *