ఎలిఫెంటా గుహలు 1987లో UNESCO చే గుర్తింపు

ఉనికి: మహారాష్ట్ర
ప్రకటించిన సంవత్సరం: 1987
విభాగం: సాంస్కృతికం (సైట్‍)


ముంబైకి సమీపంలో సముద్రంలోని ఒక ద్వీపంలో ‘‘సిటీ ఆఫ్‍ కేవ్స్’’ ఉంది. శివారాధనతో ముడిపడి ఉన్న అనేక శిల్పాలను ఇక్కడ చూడవచ్చు. భారతీయ కళను దాని అత్యంత పరిపూర్ణమైన వ్యక్తీకరణలో ఇక్కడ చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా ప్రధాన గుహలోని భారీ, ఎత్తైన రిలీఫ్‍ (తలం నుంచి ఉబికివచ్చినట్లుగా ఉండే శిల్పాలు)లలో. స్తంభాలతో సహా గుహల లేఅవుట్‍, గుహలను వివిధ భాగాలుగా ఉంచడం, విభజించడం మరియు సర్వతోభద్ర (నాలుగు దిశల్లో తలుపులు ఉండే ఆలయ-రూపం) ప్రణాళికతో గర్భగృహం ఏర్పాటు ఈ రాక్‍-కట్‍ ఆర్కిటెక్చర్‍లో ముఖ్యమైన పరిణామాలుగా ఉన్నాయి. సౌందర్యం, శిల్ప కళల కలయికగా ఈ గుహలు ఉన్నాయి. ‘రసాలు’ (సౌందర్యానికి సంబంధించిన భారతీయ సూత్రాలు) ఎలిఫెంటా గుహల వద్ద అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.


ప్రాధాన్యం : (i)(ii)
(i) ప్రధాన ఎలిఫెంటా గుహలోని లింగాకారం చుట్టూ ఉన్న పదిహేను పెద్ద శిల్పాలు భారతీయ కళ గొప్ప నిదర్శనాల్లో ఒకటి మాత్రమే కాకుండా శివుని ఆరాధనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కలెక్షన్లలో ఒకటిగా ఉంటాయి.
(ii) పశ్చిమ భారతదేశంలోని రాక్‍-కట్‍ ఆర్కిటెక్చర్‍ చరిత్రలో గుహలు అత్యంత అద్భుత సాధన. త్రిమూర్తులు, ఇతర భారీ శిల్పాలు, వాటి సౌందర్య నేపథ్యంతో, ఒక ప్రత్యేకమైన కళాత్మక సృష్టికి ఉదాహరణలుగా నిలిచాయి.
ముంబైకి సమీపంలో ఉన్న ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న పురావస్తు ఆధారాలు, స్థూపాల అవశేషాలను బట్టి చూస్తే అది బౌద్ధ కాలం నుండి అంటే సామన్య శక పూర్వం రెండవ శతాబ్దం నుండి కూడా అక్కడ నాగరికత ఉనికిని సూచిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, దాని ప్రపంచ వారసత్వ గుర్తింపు మాత్రం అక్కడ కొండను తొలచి నిర్మించిన ఆలయాలు, బహుశా ఈ ప్రాంత కొంకణ్‍ మౌర్య పాలకులచే సామాన్య శకం ఆరో శతాబ్దంలో ప్రచారం చేయబడిన శైవ హిందూ మతానికి సంబంధించిన ఐకానోగ్రాఫికల్‍ కళాఖండాల ఉనికికి లభించింది. ఈ ప్రాంతాన్ని అనేక మంది రాజులు పాలించిన దాఖలాలున్నాయి. బాదామి చాళుక్య రాజవంశానికి చెందిన ప్రఖ్యాత రాజు పులకేసిన్‍ II కూడా ఆరంభంలో ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా, ఇక్కడి గుహలలో ఒకదానిలో గణనీయమైన భాగంలో శిల్పాలు చెక్కించినట్లుగా చెబుతారు. మొదట్లో ఘరాపురి అని పిలువబడే ఈ ద్వీపాన్ని పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్‍ వారు ‘‘ఎలిఫెంటా’’ అని పిలిచారు, ఎందుకంటే ఆ కాలం నాటికి అక్కడ భారీ ఏనుగు శిల్పం ఉండింది. ఈ ఏకశిలా బసాల్ట్ ఏనుగు నిర్మాణం ఇప్పుడు సైట్‍లో లేదు: ఇది ప్రస్తుతం ముంబైలోని బావు దాజీ లాడ్‍ మ్యూజియంలో ఉంది.
ఇప్పటి దాకా తెలిసిన మేరకు శివునికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఒకప్పుడు లింగ రూపంలోనూ, అదే విధంగా పాశుపత రూపంలోనూ పూజించబడిన ఏకైక ప్రదేశం ఎలిఫెంటా. ఈ సైట్‍లో ఏకశిలా దేవాలయాల మూలాలను కూడా చూస్తాం. సున్నితమైన శిల్ప ప్రాతినిధ్యాలను ఇక్కడ చూడవచ్చు. కళాకారుల అనుభవ నైపుణ్యాలు ఈ విగ్రహాల్లో కనిపిస్తుంది. మానవ, దైవిక లక్షణాలను చిత్రించడంలో శిల్పులకు గల సామర్థ్యం ఇక్కడ చూడవచ్చు. ఎలిఫెంటా శైవ కళ మరియు శిల్పకళకు ఇదే తరహాలో ముందటివి లేవు. ఈ తరహాలో ఇవే మొదటివి. ఈ ప్రాంతాపు బౌద్ధ కళకు ఈ సైట్‍ కు అనేక శైలీకృత సారూప్యతలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని సమకాలీన బౌద్ధ ప్రదేశాలలో పనిచేసిన శిల్పులు, ఇతర కళాకారుల బృందాల సృజనాత్మక నైపుణ్యాలు, సంప్రదాయాల తీరుతెన్నులనూ ఈ సైట్‍లోనూ చూడవచ్చు.


అజంతా కళ, ముఖ్యంగా బోధిసత్వ వజ్రపాణి, ఏనుగు శిల్పాలను ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ శివుడిని అర్ధనారీశ్వరుడిగా చెక్కారు. అనేక సున్నితమైన మిశ్రమ శిల్ప చిత్రణలలో ఒకటి, వివిధ లింగపరమైన అంశాలను సున్నితంగా విరుద్ధమైనది. తోడుగా ఉన్న ఇతర దేవతల శిల్పాల్లో కూడా ఈ సొగసు కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణీక గుహలలోని భారీ శిల్పాల్లో వివిధ భంగిమల్లో శివ శిల్పాలు, భార్య పార్వతితో శివుడి విగ్రహాలే అధికంగా ఉన్నాయి.


జర్మన్‍ గణిత శాస్త్రజ్ఞుడు, పటాల రూపకర్త, అన్వేషకుడు, ట్రావెల్స్ త్రూ అరేబియా అండ్‍ అదర్‍ కంట్రీస్‍ ఇన్‍ ది ఈస్ట్ (1764) గ్రంథ రచయిత కార్స్ టెన్‍ నీబుర్‍ మాటలలో చెప్పాలంటే… ‘‘నిజంగా డిజైన్‍లో లేదా చెక్కడంలో ఈ బేస్‍-రిలీఫ్‍లను గ్రీకు శిల్పాలతో పోల్చలేం. అయితే అవి ప్రాచీన ఈజిప్ట్ శిథిలాల కంటే ఎంతో గొప్పగా ఉన్నాయి. అంతే కాదు… పెర్సె పొలిస్‍ శిథిలాల లోని భారీ శిల్పాల కంటే కూడా మరింత గొప్పగా ఉన్నాయి. పురాతన భారతీయులు సాధారణంగా ఊహించిన దానికంటే మెరుగైన విజయం సాధించారు.’’
ఈ ద్వీపం వ్యూహాత్మ స్థానంలో నెలకొంది. 1840 వరకు పోర్చుగీస్‍ సైనిక అవుట్‍పోస్ట్ గా పనిచేసింది. పోర్చుగీస్‍ సైనికులు తరచుగా షూటింగ్‍ ప్రాక్టీస్‍ కోసం శిల్పకళా ఫలకాలను ఉపయోగించే వారు. వాటికి జరిగిన నష్టమే ఇందుకు రుజువు. సైట్‍లోని అసలు రాతి శాససంలో ఏముందో తెలుసుకునేందుకు పోర్చుగీస్‍ వారు దాన్ని తీసుకెళ్లారు. అదిప్పుడు ఇక్కడ ఉందో నేటికీ గుర్తించలేదు. దాంతో ఈ అంశం గుహలను (వాటిలోని శిల్పాలను) సృష్టించిందెవరు అనే అంశంలో వివిధ వివరణలకు దారితీసింది.
ప్రపంచ వారసత్వ గుర్తింపు ఎలిఫెంటా గుహల స్థితిగతులకు బాధ్యత వహించే అన్ని ఏజెన్సీలను ఒకచోట చేర్చింది. ఈ గుహలకు ప్రధాన సంరక్షక సంస్థ ఏఎస్‍ఐ. గుహలకు ఆనుకొని ఉన్న మట్టిదిబ్బల తవ్వకాలు, ముఖ్యంగా పాతిపెట్టబడిన స్థూపాలు, ఈ భారతీయ వారసత్వం తొలినాళ్ల గురించి మన అవగాహనను సుసంపన్నం చేస్తాయి.

  • అమరేశ్వర్‍ గల్లా
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *