ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, మార్గదర్శి బి.ఎస్‍.రాములు 75వ జన్మదిన అమృతోత్సవం

23 ఆగష్టు 2024 శుక్రవారం హైదరాబాద్‍లోని రవీంద్రభారతిలో ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, మార్గదర్శి బి.ఎస్‍. రాములుగారి 75వ జన్మదిన అమృతోత్సవ వేడుకలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో… ఘనంగా జరిగాయి. ఆత్మీయుల సందేశాలతో పాటు 25 ఏళ్లలో తెలంగాణ సాహిత్యం, కథ, నవల, సాహిత్య విమర్శ, సామాజిక ఉద్యమాలు, తత్వశాస్త్రాలు అనే అంశాలపై సెమినార్లు జరిగాయి.


రవీంద్ర భారతి సభాప్రాంగంలో 26 అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తుతో ఫ్లెక్సీ బ్యానర్‍ పై బి. ఎస్‍. రాములు గారు వెలువరించిన 120 పుస్తకాల ముఖ చిత్రాలను కనులారా తిలకించే ఏర్పాటు అందరినీ ఆకట్టుకుంది. ఏమి రాసారు ఎన్ని రాసారు ఎన్ని రకాల సబ్జెక్టులపై రాసారో ఒకే ‘చూపు’లో చూపరులకు తెలియజేసింది.


సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు సుప్రసిద్ధ సినీ దర్శకులు, కవి, చిత్రకారులైన ‘మాభూమి’ బి. నర్సింగరావు అధ్యక్షత వహించారు. బి.ఎస్‍. రాములు ఆహ్వాన సంఘం కన్వీనర్‍ కర్రె సదాశివ, ఎ. గవర్రాజు జాజుల గౌరి, క్రిష్‍ రాధాకృష్ణ, హరిత్‍ రూడా సమావేశంలో ఉన్నారు. మొయిలి శ్రీరాములు రచించిన బి.ఎస్‍. రాములు ‘జీవిత రేఖలు’ పుస్తకాన్ని బి. నర్సింగరావు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తు సభకు వచ్చిన రచయితలు, కవులు, మేధావులు, కళాకారులు, అభిమానులు పుష్పగుచ్ఛం, శాలువాలతో సన్మానించారు.
సామాజిక చరిత్రలో బి.ఎస్‍. రాములు గారి సంబంధం అనుబంధం అతి గొప్పది సమాజంలో తను తన తల్లిదండ్రులకు కొడుకుగా, తన తోబుట్టువులకు అన్నగా తమ్ముడిగా, తన బిడ్డలకి తండ్రిగా మాత్రమే కాకుండా తన కుటుంబ పరిధిని దాటి సమాజం పట్ల పై సంబంధాల బాధ్యతను ఆయన తీసుకున్న చొరవ అతి గొప్పదని పలువురు ప్రశంసించారు.


వివిధ సెషన్స్ జరిగిన ఈ కార్యక్రమంలో బిఎస్‍ రాములు గారి రచనలను, వారిపై యితరులు రాసిన గ్రంథాలను, వివిధ రచయితలు రాసిన పుస్తకాలను, ప్రముఖ సంపాదకులు, రచయితలు ఆవిష్కరించారు.
25 సంవత్సరాల తెలంగాణ సాహితీ, సాంస్కృతిక అంశాలపై నిష్ణాతులైన పలువురు కవులు, రచయితలు పరిశోధనాత్మక ప్రసంగాలు చేసారు. సదాశివపేట నుంచి వచ్చిన శ్రీమతి అనురాధ బి.ఎస్‍.రాములుగారి చిత్రాన్ని రావి ఆకుపై చిత్రించి వాటికి లైటు వెలిగే విధంగా అమర్చిన ఆమె సృజనాత్మకత ప్రశంసనీయం.


కవి, రచయిత అంగలకుర్తి విద్యాసాగర్‍ బి.ఎస్‍ రాములుగారి జీవితాన్ని కావ్యగానం చేసారు. జాజుల గౌరి రాములుగారిపై జానపదరీతిలో రాసిన పాటను ఆత్మీయగానం చేసారు.
బిఎస్‍రాములు రచనలపై 25 ఏళ్ల తెలంగాణా సాహిత్యంపై కంచె ఐలయ్య, మొయిల శ్రీరాములు, కోయి కోటేశ్వరరావు, కర్రెసదాశివ డా. వంశీధర్‍, డా. అద్దంకి ప్రజాపతి, ఎం. భాగ్యలక్మి, మారోజు దేవేంద్ర, నేరెళ్ల శ్రీనిఆస్‍గౌడ్‍,కాలువమల్లయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‍, ఆడెపు లక్ష్మీపతి, పాశం యాదిరి, జూపాక సుభద్ర, బండారు సుజాత, డా।। అన్నందాస్‍ జ్యోతి తదితరులు పరిశోధనాత్మక ప్రసంగాలు చేసారు.

  • కె. సచిన్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *